For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మాల్యాకు 'లీగల్' ఫైట్ ఖర్చులు పెడుతున్న 5 కంపెనీలు

|

లండన్: భారత్‌లోని బ్యాంకులకు వేలకోట్ల రూపాయలు ఎగవేసి లండన్‌లో తలదాచుకుంటున్న విజయ్ మాల్యా కేసులో మరో ట్విస్ట్. విజయ్ మాల్యాకు ఫండింగ్ చేసిన కేసులో ఐదు కంపెనీలపై ఈడీ దృష్టి సారించింది. అనుచరుల ద్వారా షెల్ కంపెనీలను సృష్టించి వాటి ద్వారా మాల్యా నిధులను తన సొంత ఖాతాల్లోకి మళ్లించుకున్నట్లుగా ఈడీ గుర్తించిందని తెలుస్తోంది.

యూపీఐ ద్వారానే ఐపీఓల్లో పెట్టుబడియూపీఐ ద్వారానే ఐపీఓల్లో పెట్టుబడి

ఈ లావాదేవీల్లో ఐదు కంపెనీలు పాలుపంచుకున్నట్లుగా ఈడీ గుర్తించింది. దీని ఆధారంగా గత వారం 24వ తేదీన బెంగళూరులో శశికాంత్ ఇంట్లో సోదాలు చేశారు. మాల్యాకు ఈ శశికాంత్ ఆప్తుడని ఈడీ వర్గాలు గుర్తించాయని సమాచారం. ఫ్యూజిటిక్ ఎకనమిక్ అఫెండర్ చట్టం కింద ఈ చర్యలు చేపట్టారు.

5 companies under ED scanner for funding Vijay Mallyas legal costs

డమ్మీ కంపెనీలు రూ.200 కోట్ల మేర ప్రాఫిట్స్‌ను లిక్కర్ బిజినెస్ నుంచి బయటకు తీసుకు వచ్చి, అతని లీగల్ ఖర్చుల కోసం వెచ్చించాయని గుర్తించినట్లుగా తెలుస్తోంది. దర్యాఫ్తులో దక్షిణాది రాష్ట్రాలలో మూడు కంపెనీలు, విదేశాలలో రెండు కంపెనీలు నమోదైనట్లుగా తెలుస్తోంది.

కింగ్ ఫిషర్ బీరును తమ అనుబంధ విదేశీ కంపెనీలకు రాయితీ రేటుకు ఎగుమతి చేసే విధానాన్ని అనుసరించిందని గుర్తించినట్లుగా తెలుస్తోంది. అదే బీరును ప్రీమియంతో విక్రయించింది. ఈ కంపెనీలపై దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది.

ఇదిలా ఉండగా, తమ కంపెనీల ఆస్తుల్ని జప్తు చేయడంపై మాల్యా సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. దీనిని ఆగస్ట్ 2వ తేదీన విచారిస్తామని న్యాయస్థానం తెలిపింది. మాల్యా తరఫున సీనియర్ లాయర్ నారిమన్‌ వేసిన పిటిషన్‌ను అనుమతిస్తూ చీఫ్ జస్టిస్ రంజన్‌ గగోయ్ నేతృత్వంలోని బెంచ్ నిర్ణయం తీసుకుంది. దీనిపై వాదనలు వచ్చే శుక్రవారం వింటామని తెలిపింది.

English summary

మాల్యాకు 'లీగల్' ఫైట్ ఖర్చులు పెడుతున్న 5 కంపెనీలు | 5 companies under ED scanner for funding Vijay Mallya's legal costs

Probing into a whistleblower’s complaint, the Enforcement Directorate (ED) is investigating at least five companies in India and overseas for their alleged association with embattled liquor baron Vijay Mallya.
Story first published: Tuesday, July 30, 2019, 15:27 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X