For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సౌదీ హోటళ్లలో ఇక ఇండియన్స్ పనిచేయడానికి వీల్లేదు! సౌదీ రాజు హుకుం

|

సౌదీ అరేబియా.. అత్యున్నత ఆర్థిక వ్యవస్థల్లో ప్రధానమైంది. ప్రపంచ దృష్టిని ఎప్పుడూ తమ సంపదతోనే ఆకర్షించే ఈ రాజ్యం ఇప్పుడు కీలకమైన నిర్ణయం తీసుకుంటోంది. తమ దేశంలోని ఉద్యోగాలు.. తమవాళ్లకే చెందాలనే ఉద్దేశంతో మొదటి ప్రయత్నాన్ని మొదలుపెట్టింది. ఇప్పటివరకూ అమెరికాలో ట్రంప్ తీసుకుంటున్న ఈ చర్యలను యావత్ ప్రపంచ దేశాలూ విమర్శిస్తున్న నేపధ్యంలో ఇప్పుడు సౌదీ రాజు మొహ్మద్ బిన్ సలాం చేసిన నిర్ణయం విస్మయానికి గురిచేస్తోంది. ఎందుకంటే అగ్ర దేశాలన్నీ మెల్లిగా సెల్ఫ్ సెంట్రిక్‌గా మారడం ఈ గ్లోబలైజేషన్‌లో ఎలాంటి పరిణామానికి సంకేతమో విశ్లేషించుకోవాలి. సౌదీ అరేబియా మొట్టమొదటిగా ప్రపంచ ప్రజలను దృష్టిని ఆకర్షించే నిర్ణయం తీసుకుంది. అదేంటంటే.. ఇకపై హాస్పిటాలిటీ ఉద్యోగాల్లో అంతా తమ దేశానికి చెందిన ఉద్యోగులే ఉండాలని తీర్మానించారు. అంతేకాదు ఈ రంగంలో విదేశీయులపై నిషేధాన్ని కూడా విధించారు. వాళ్ల రిక్రూట్మెంట్ కూడా చేయొద్దని హుకుం జారీ చేశారు.

సీఈఓకు రూ.180 కోట్ల జీతం! ఈ భారతీయ కంపెనీ పేరైనా విన్నారా?సీఈఓకు రూ.180 కోట్ల జీతం! ఈ భారతీయ కంపెనీ పేరైనా విన్నారా?

ఈ ఏడాది ఆఖరి నుంచే

ఈ ఏడాది ఆఖరి నుంచే

అధిక శాతం తమ దేశీయులకు ఉద్యోగాలు కల్పించి విదేశీయులకు కోటా లాంటి విధించడం సాధారణంగా చూస్తున్న విషయమే. అయితే ఈ సారి రంగం మొత్తమ్మీదే ఇలాంటి బ్యాన్ విధించడం ఇదే మొదలు. తాజాగా ఈ అంశంపై సమావేశమైన సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మొహ్మద్ బిన్ సలాం.. కార్మిక శాఖకు ఆదేశాలు జారీ చేశారు. రిసార్ట్స్, త్రీ స్టార్ లేదా అంత కంటే ఎక్కువ స్టార్స్ ఉన్న హోటల్స్, ప్రీమియం సర్వీస్ అపార్ట్‌మెంట్స్‌లలో ఫ్రంట్ డెస్క్ నుంచి మేనేజ్మెంట్ వరకూ అంతా తమ దేశస్తులే ఉండాలని నిర్ణయించారు. డ్రైవర్, డోర్ మెన్, పోర్టర్స్ వంటి వాటిల్లో మాత్రం కొద్దిగా మినహాయింపును ఇచ్చారు. రెస్టారెంట్ హోస్ట్, హెల్త్ క్లబ్ సూపర్ వైజర్ వంటి వాటిల్లో విదేశీయులు పనిచేసే వీల్లేదని స్పష్టం చేసింది సౌదీ కార్మిక శాఖ.

నిరుద్యోగాన్ని ఎదుర్కొనేందుకు

నిరుద్యోగాన్ని ఎదుర్కొనేందుకు

పర్యాటక రంగాన్ని మరింతగా విస్తరించుకోవాలని భావిస్తున్న ఈ తరుణంలో వాళ్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. తమ దేశంలో పెరుగుతున్న నిరుద్యోగాన్ని ఎదుర్కొనేందుకు ఆ దేశ రాజు ఈ మార్గాన్ని వెతికారు. సుమారు 13 శాతంగా ఇప్పుడు సౌదీలో నిరుద్యోగిత ఉంది. ఎందుకంటే ఆతిధ్య రంగం తక్కువ వేతనంతో దొరికే విదేశీయులపై (భారత్ వంటి దేశాలు) ఆధారపడడం వల్ల స్థానికులపై ప్రభావం పడ్తోందని గుర్తించారు. అందుకే కఠినమైనదైనా నిర్ణయం తీసుకోక తప్పదని వెల్లడించారు. దీని వల్ల ఖర్చులు పెరిగినా దేశ యువత నుంచి తీవ్ర వ్యతిరేకత రాక ముందే జాగ్రత్తపడాలని రాజు భావించారు. అందుకే ఈ తరహాలో తరుణోపాయం ఆలోచించారు.

ఇక తప్పదు

ఇక తప్పదు

ఈ ఏడాది డిసెంబర్ 29 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రాబోతోంది. ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం ఆ తేదీ నుంచి వాళ్లకు కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది కాబట్టి అమలు తేదీగా దీన్ని ఖరారు చేశారు. ఈ నేపధ్యంలో ఈ రంగంపై విపరీతంగా ఆధారపడిన మన లాంటి దేశాల వాళ్లకు ఇది పెద్ద దెబ్బ లాంటి నిర్ణయమే.

అమెరికా తర్వాత సౌదీ లాంటి దేశాలు తీసుకుంటున్న ఈ నిర్ణయాల నేపధ్యంలో మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే.. దేశాల్లో నిరుద్యోగం పెరుగుతోంది. విదేశాలకు వెళ్లి అక్కడ ఏదో ఒక పని చేసుకోవడానికి కూడా అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. ముఖ్యంగా సర్వీస్ బేస్డ్ ఇండస్ట్రీలో ఎవరూ ఊహించని మార్పులు చోటు చేసుకోబోతున్నాయి కాబట్టి ముందు జాగ్రత్త పడడం మంచిది.

English summary

సౌదీ హోటళ్లలో ఇక ఇండియన్స్ పనిచేయడానికి వీల్లేదు! సౌదీ రాజు హుకుం | Saudi Arabia to ban foreigners from slew of hospitality jobs

Saudi hotels to ban jobs to foreigners in hospitality sector. This decision of Saudi king to be implemented from Dec 29th as it is Islamic calendar new year.
Story first published: Monday, July 29, 2019, 8:28 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X