For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

JLL ఆదాయం రూ.4,000 కోట్లు, వచ్చే ఏడాది చివరికల్లా 2,000 మందికి ఉద్యోగ అవకాశం

|

ప్రాపర్టీ కన్సల్టెంట్ జేఎల్ఎల్ ఇండియా రాబడి 2018-19 ఆర్థిక సంవత్సరంలో 17 శాతం పెరిగి, రూ.4 వేల కోట్లకు చేరుకుంది. ఓ వైపు రియల్ ఎస్టేట్ వ్యాపారం స్లోడౌన్ అయినప్పటికీ జేఎల్ఎల్ మాత్రం మంచి వృద్ధి సాధించింది. అదే సమయంలో వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి 2,000 మందిని ఉద్యోగంలోకి తీసుకోనుంది. గ్లోబల్ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ జేఎల్ఎల్‌కు చెందిన సంస్థనే జేఎల్ఎల్ ఇండియా.

2017-18 ఆర్థిక సంవత్సరంలో రూ.3,420 కోట్ల రెవెన్యూను రిపోర్ట్ చేసింది. దేశంలోని 10 మెజర్ సిటీల్లో ఈ కంపెనీకి ఉన్న వివిధ కార్యాలయాల్లో 11,500 మంది ఉద్యోగులు ఉన్నారు. వచ్చే ఏడాది చివరి నాటికి మరో 2,000 మందిని తీసుకోనుంది.

నెలకు రూ.10వేలు ఇన్వెస్ట్ చేయడం ద్వారా రూ.1కోటి సంపాదన!నెలకు రూ.10వేలు ఇన్వెస్ట్ చేయడం ద్వారా రూ.1కోటి సంపాదన!

 JLL India revenue grows 17% to Rs.4,000 crore in FY19, to hire 2,000 employees by 2020 end

ఇండియన్ కమర్షియల్ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి డిమాండ్ బాగా ఉందని, ఇది వృద్ధి రేటుకు ఉపయోగపడిందని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రమేష్ నాయర్ అన్నారు. ఆఫీస్ స్పేస్ వంటి వాటికి ఇన్వెస్టర్లు, వినియోగదారుల నుంచి డిమాండ్ ఎక్కువగా ఉందని చెప్పారు. బ్రోకరేజీ సర్వీసులు, లావాదేవీలు, ఇంటిగ్రేటెడ్‌ ఫెసిలిటీస్‌ మేనేజ్‌మెంట్‌, ప్రాపర్టీ /అసెట్‌ మేనేజ్‌మెంట్‌ వంటి విభాగాల్లో మంచి పనితీరు నమోదు చేసినట్లు చెప్పారు.

ఈ సంవత్సరం ఇప్పటిదాకా 800 మంది సిబ్బందిని నియమించామని, ఈ ఏడాది చివరి నాటికి తమ ఉద్యోగుల సంఖ్య 12,000కు చేరుకుంటుందని, వచ్చే ఏడాది చివరినాటికి తమ ఉద్యోగుల సంఖ్య 13,500 వరకు చేరుకుంటుందని చెప్పారు. ఇతర కంపెనీలతో పోలిస్తే వలసలు చాలా స్వల్పమన్నారు. కమర్షియల్ రంగం అంచనాలకు మించి పుంజుకుంటోందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెరా, బినామీ లావాదేవీల చట్టం, జీఎస్టీ వంటి కీలక సంస్కరణలు రియల్ ఎస్టేట్‌పై సానుకూల ప్రభావం చూపుతున్నాయన్నారు.

English summary

JLL ఆదాయం రూ.4,000 కోట్లు, వచ్చే ఏడాది చివరికల్లా 2,000 మందికి ఉద్యోగ అవకాశం | JLL India revenue grows 17% to Rs.4,000 crore in FY19, to hire 2,000 employees by 2020 end

Property consultant JLL India's revenue rose 17 percent to Rs 4,000 crore in 2018-19 despite slowdown in the real estate market and it plans to hire 2,000 employees by the end of the next year to sustain this growth momentum.
Story first published: Monday, July 29, 2019, 11:42 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X