For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హైదరాబాద్‌వాసులకు గుడ్‌న్యూస్: రూ.2,500కే కళ్యాణ మండపం!!

|

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో పేద, మధ్య తరగతి కుటుంబాలకు భారీ ఊరట లభించేలా జీహెచ్ఎంసీ సరికొత్త కార్యక్రమానికి రూపకల్పన చేస్తోంది. రూ.2,500కే కళ్యాణ మండపం అందుబాటులోకి తీసుకు రానుంది. తొలుత కమ్యూనిటీ హాళ్లను విస్తరించి, ఆ తర్వాత కొత్త హాళ్లను నిర్మించనుంది. దీంతో హైదరాబాదులోని పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది.

మీ మొబైల్ ఫోన్‌తో జాగ్రత్త..! ఇలా చేయండి: HDFC హెచ్చరికమీ మొబైల్ ఫోన్‌తో జాగ్రత్త..! ఇలా చేయండి: HDFC హెచ్చరిక

పెళ్లి కోసం ఫంక్షన్ హాల్ అంటే లక్షలు..

పెళ్లి కోసం ఫంక్షన్ హాల్ అంటే లక్షలు..

సాధారణంగా పెళ్లి అంటే పంక్షన్ హాల్స్‌కు వేలు, లక్షలు ఖర్చు అవుతాయి. ఇక హైదరాబాదులో ఫంక్షన్ హాల్, అదీ పెళ్లిళ్ల సీజన్‌లో అంటే లక్షలు గుమ్మరించాల్సిందే. అంత మొత్తం ఇవ్వలేని వారికి కేవలం రూ.2,500కే కళ్యాణ మండపాలు ఇచ్చేందుకు జీహెచ్ఎంసీ ప్లాన్ చేస్తోంది. ఇందుకు హైదరాబాదులోని కమ్యూనిటీ హాల్స్‌ను పెంచనుంది. అలాగే, కొత్తగా కళ్యాణ మండపాలు నిర్మించనుంది.

ఆ ప్రాంతాల్లో హాల్స్

ఆ ప్రాంతాల్లో హాల్స్

హైదరాబాదులో దాదాపు కోటికి పైగా జనాలు ఉన్నారు. ఇందులో లక్షల కుటుంబాలు ఉన్నాయి. జనాభా పెరుగుదలకు అనుగుణంగా కమ్యూనిటీ హాల్స్, కళ్యాణ మండపాల నిర్మణం జరగలేదు. దీనికి తోడు ప్రయివేటు పంక్షన్ హాల్స్ పుట్టుకు వచ్చాయి. ఈ భారాన్ని పేద, మధ్య తరగతి కుటుంబాలు మోయలేకపోతున్నాయి. స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకొని ఆ ప్రాంతాల్లో కమ్యూనిటీ హాల్స్, ఫంక్షన్ హాల్స్ నిర్మించాలని భావిస్తున్నారు.

ఇలా రూ.2500 వసూలు..

ఇలా రూ.2500 వసూలు..

అడిక్‌మెట్, సీతాఫల్‌మండి వంటి పలు ప్రాంతాల్లో కమ్యూనిటీ హాల్స్‌ను కళ్యాణ మండపాలుగా ఉపయోగిస్తున్నారు. కళ్యాణ మండపాల బాధ్యతలను పొదుపు సంఘాలకు అప్పగించే అవకాశాలు ఉన్నాయి. ఇందులో కరెంట్, ఇతర ఖర్చుల కింద రూ.2వేలు, రూ.500 పొదుపు సంఘాలకు నిర్వహణ కింద.. మొత్తం రూ.2,500 వసూలు చేయనున్నారు.

English summary

హైదరాబాద్‌వాసులకు గుడ్‌న్యూస్: రూ.2,500కే కళ్యాణ మండపం!! | Rs.2,500 Marriage Function Hall: benefit for Poor and Middle class people

Greater Hyderabad Municipal Corporation planning to build marriage function halls in Hyderabad only for Rs.2,500.
Story first published: Sunday, July 28, 2019, 13:25 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X