For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దటీజ్ జాక్ మా!: $290 బిలియన్ల లోన్ మిషన్ చైనాను ఎలా మార్చిందంటే?

|

బీజింగ్: అలీబాబా గ్రూప్ ఫౌండర్ జాక్ మా చైనాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త. అలీబాబా.కామ్ ఈ-కామర్స్ పోర్టల్ అధినేత. చైనాలో అత్యంత సంపన్నుడు. ఇతని ఆన్‌లైన్ బ్యాంకు చిన్న వ్యాపారస్తులకు రుణాలు ఇస్తూ నిశ్శబ్ద విప్లవం సాధిస్తోంది. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థకు దశాబ్దాలుగా సరిగ్గా అందని రుణ వ్యవస్థను లక్ష్యంగా చేసుకుంది జాక్ మా ఆన్‌లైన్ బ్యాంక్.

అమెరికాతో ట్రేడ్‌వార్ దెబ్బ: 1992 తర్వాత తొలిసారి పడిపోయిన చైనా GDPఅమెరికాతో ట్రేడ్‌వార్ దెబ్బ: 1992 తర్వాత తొలిసారి పడిపోయిన చైనా GDP

16 మిలియన్ల చిన్న కంపెనీలకు 2 ట్రిలియన్ల యువాన్ల రుణాలు

16 మిలియన్ల చిన్న కంపెనీలకు 2 ట్రిలియన్ల యువాన్ల రుణాలు

3,000కు పైగా వేరియేబుల్స్‌ను అనలైజ్ చేయగలిగిన రియల్ టైమ్ పేమెంట్ డేటా, రిస్క్ మేనేజ్‌మెంట్ సిస్టంను ఉపయోగిస్తూ.. జాక్ మా అండ్ కో తమ మైబ్యాంక్ (MYbank) ఆన్‌లైన్ బ్యాంకుని నిర్వహిస్తున్నారు. దీనిని నాలుగేళ్ల క్రితం ప్రారంభించారు. ఈ ఆన్‌లైన్ బ్యాంకు ఇప్పటి వరకు దాదాపు 16 మిలియన్ల చిన్న కంపెనీలకు 2 ట్రిలియన్ల యువాన్లు (290 బిలియన్ డాలర్లు) రుణాలు ఇచ్చింది.

డిఫాల్టర్స్ రేటు 1 శాతమే

డిఫాల్టర్స్ రేటు 1 శాతమే

రుణగ్రహీతలు తమ తమ స్మార్ట్ ఫోన్ ద్వారా కొన్ని స్టెప్స్‌లలో మైబ్యాంక్‌లో రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. రుణం అప్రూవల్ కాగానే కాసేపట్లో వెంటనే వారికి క్యాష్ వస్తుంది. ఈ మొత్తం ప్రక్రియ కేవలం మూడు నిమిషాల్లో పూర్తవుతుంది. పైగా, బ్యాంకు అధికారుల అవసరం ఏమాత్రం లేదు. జాక్ మాకు చెందిన మైబ్యాంక్ రుణ డిఫాల్టర్ల రేటు కూడా చాలా తక్కువగా ఉంది. డిఫాల్టర్స్ రేటు కేవలం 1 శాతం మాత్రమే.

దేశ ఆర్థిక వ్యవస్థకు చిన్న వ్యాపారాలు, కంపెనీలు కీలకం

దేశ ఆర్థిక వ్యవస్థకు చిన్న వ్యాపారాలు, కంపెనీలు కీలకం

ఎలక్ట్రానిక్ పేమెంట్స్‌లో ప్రపంచంలోనే చైనాను అతిపెద్ద మార్కెట్‌గా మార్చిన ఈ ఫైనాన్షియల్ టెక్నాలజీ.... ఇప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకంగా మారిన కంపెనీల (చిన్న చిన్న కంపెనీలు) పట్ల బ్యాంకులు ఎలా వ్యవహరించాలో చెబుతున్నాయని అంటున్నారు. మైబ్యాంక్... పేమెంట్ సిస్టమ్స్, సోషల్ మీడియా, ఇతర మార్గాల ద్వారా డేటాను సేకరిస్తోంది. చిన్న రుణగ్రహీతలకు అనుకూలంగా నడుచుకుంటోంది. గతంలో ప్రభుత్వ ఆర్థిక సంస్థలకు దూరంగా ఉన్నవారు కూడా ఇప్పుడు మైబ్యాంక్‌కు దగ్గరవుతున్నారు.

వృద్ధి రేటు ఇలా ఉన్నా...

వృద్ధి రేటు ఇలా ఉన్నా...

13 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ కలిగిన చైనా వృద్ధి రేటు గత క్వార్టర్‌లో మూడు దశాబ్దాలకు (1992) దిగజారింది. ఇందుకు కారణాలు అనేకం కావొచ్చు. కానీ ప్రభుత్వేతర సంస్థలు.. ముఖ్యంగా చిన్న వ్యాపారాలు 60 శాతం వృద్ధి సాధించాయి. 80 శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించాయి. ఆర్థిక వ్యవస్థకు చిన్న, మధ్యతరగతి కంపెనీలు ఎంతో కీలకమని చెబుతున్నారు. అయితే, బ్యాంకులు మాత్రం ఈ సెగ్మెంట్‌తో రిస్క్ అని భావించాయని అంటున్నారు. అదే సమయంలో జాక్ మాకు చెందిన మైబ్యాంక్ మాత్రం వారికి రుణాలు ఇచ్చి కీలకంగా మారింది. బిగ్ డేటా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఉపయోగం ద్వారా చైనా అతి త్వరగా వరల్డ్ లీడర్‌గా ఎదిగింది.

మైబ్యాంక్ రుణ ఆమోద రేటు నాలుగు రెట్లు ఎక్కువ

మైబ్యాంక్ రుణ ఆమోద రేటు నాలుగు రెట్లు ఎక్కువ

సంప్రదాయ బ్యాంకుల కంటే మైబ్యాంక్ రుణ ఆమోద రేటు నాలుగు రెట్లు ఎక్కువగా ఉంది. సాధారణంగా 80 శాతం స్మాల్ బిజినెస్ లోన్ విజ్ఞప్తులను తిరస్కరించడంతో పాటు ఈ ప్రక్రియకు 30 రోజుల సమయం వరకు తీసుకుంటాయని చెబుతున్నారు. అయితే మైబ్యాంకు నిర్వహణ వ్యయం యువాన్లుగా ఉందనిచెబుతున్నారు. అదే సమయంలో సంప్రదాయ బ్యాంకుల నిర్వహణ వ్యయం 2000 యువాన్లుగా ఉంది.

మైబ్యాంక్ ఆదాయం 670 మిలియన్ యువాన్లు

మైబ్యాంక్ ఆదాయం 670 మిలియన్ యువాన్లు

మైబ్యాంక్ ఆదాయం గత ఏడాది 670 మిలియన్ల యువాన్లుగా ఉంది. స్మాల్ బిజినెస్ రుణాల కోసం అత్యాధునిక టెక్నాలజీని ఎప్పటికప్పుడు ఉపయోగిస్తోంది. యూనిట్స్ ఆఫ్ టెన్సెంట్ హోల్డింగ్స్ లిమిటెడ్, పింగ్ ఆన్ ఇన్సురెన్స్ గ్రూప్ కంపెనీ కూడా ఇలాంటి (చిన్న బిజినెస్) వాటికి రుణాలిస్తున్నాయి. ప్రభుత్వ రంగ చైనా కన్‌స్ట్రక్షన్ బ్యాంకు కార్పోరేషన్ తన ఉనికిని పెంచుకుంటోంది.

బ్యాంకులను మార్చిన మైబ్యాంక్

బ్యాంకులను మార్చిన మైబ్యాంక్

దేశంలోనే అతిపెద్ద లెండర్ సెప్టెంబర్ నెలలో మొబైల్ యాప్‌ను లాంచ్ చేసింది. ఇది రెండు నిమిషాల్లో 5 మిలియన్ యువాన్ల అప్లికేషన్స్ ప్రాసెస్ చేస్తుంది. కన్‌స్ట్రక్షన్ బ్యాంకు లిమిటెడ్ మాత్రం గత ఏడాది చిన్న బిజినెస్‍‌లకు రుణాలను 51 శాతం పెంచింది. ఈ పరిశ్రమలో సాధించిన వృద్ధి కంటే ఇది రెండు రెట్లు కావడం గమనార్హం. ఈ బ్యాంకు వన్ ఇయర్ లోన్‌కు యావరేజ్‌గా 5.3 శాతం వడ్డీని వసూలు చేస్తోంది. మొత్తంగా 4.35 శాతం కంటే ఎక్కువ వసూలు చేస్తోంది. డిఫాల్టర్స్ కూడా చాలా తక్కువే ఉన్నారు. మొత్తంగా మైబ్యాంక్ ప్రభావం ఇతర బ్యాంకులపై పడింది.

English summary

దటీజ్ జాక్ మా!: $290 బిలియన్ల లోన్ మిషన్ చైనాను ఎలా మార్చిందంటే? | Jack Ma's $290 Billion loan machine is changing chinese banking

Jack Ma’s online bank is leading a quiet revolution in the way China lends to small businesses, taking aim at a credit bottleneck that has held back Asia’s largest economy for decades.
Story first published: Sunday, July 28, 2019, 15:48 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X