For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వచ్చే ఏడాదే భారత రోడ్ల పైకి టెస్లా ఎలక్ట్రిక్ కార్లు

|

అమెరికా ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా ... భారత్ లో తన ప్రయాణాన్ని త్వరలో ప్రారంభించబోతోంది. విజయవంతమైన స్టార్టుప్ ఫౌండర్ గా ఎలాన్ మస్క్ కు పేరుంది. ఆయన స్థాపించిన కంపెనీయే టెస్లా. అమెరికా లోని కాలిఫోర్నియా లోని పాలో ఆల్టో కేంద్రంగా టెస్లా తన కార్యకలాపాను కొనసాగిస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ లో కంపెనీకి చాల ప్రావీణ్యత ఉంది. దీంతో పాటు సోలార్ ఎనర్జీ రంగం లోనూ ఉంది. 2020 లో ఎగుడు దిగుడుగా ఉండే భారత రోడ్లపై తమ కార్లు పరుగులు పెట్ట నున్నాయని టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ఇటీవల వెల్లడించారు. ఈ విషయాన్నీ IANS వార్తా సంస్థ వెల్లడించింది. అమెరికన్ ఏరోస్పేస్ మ్యానుఫ్యాక్చరర్ అండ్ స్పేస్ ట్రాన్స్పోర్టేషన్ కంపెనీ ఈ నెల 21 న నిర్వహించిన స్పేస్ EX హైపేర్లూప్ పోడ్ కాంపిటీషన్ 2019 అనే పోటీని నిర్వహించింది. ఇందులో పాల్గొన్న ఇండియా నుంచి వెళ్లిన ఐఐటీ మద్రాస్ కు చెందిన ఆవిష్కార్ హైపేర్లూప్ బృందం అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా ఎలాన్ మస్క్ భారత్ కార్యకలాపాల గురుంచి వెల్లడించారు.

ఆలస్యమైన ప్రయాణం...

ఆలస్యమైన ప్రయాణం...

ఎలాన్ మస్క్ ఎప్పటి నుంచో భారత్ లో కార్యకలాపాలు ప్రారంభించాలని ఆసక్తి తో ఉన్నారు. కానీ రకరకాల కారణాలతో ఇప్పటి వరకు సాధ్యం కాలేదు. భారత ప్రభుత్వ విధానాలు సైతం ఆలస్యానికి కారణం అయ్యాయి. మరో వైపు భారత్ కు చెందిన టెస్లా కంపెనీ చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ దీపక్ అహుజా రిటైర్మెంట్ ప్రకటించటంతో ఇది మరింత ఆలస్యం ఐంది. భారత్ లో ప్రవేశించడం చాల ఇష్టం. కానీ దురదృష్ట వశాత్తు అక్కడి విధానాల కారణంగా ఇప్పటివరకు అది జరగ లేదని ఎలాన్ మస్క్ గతం లో పేర్కొన్నారు. అయితే, ఇప్పుడు పరిస్థితులు మెరుగైనట్లు కనిపిస్తోంది. అందుకే, ఎలాన్ మస్క్ కచ్చితమైన టైం ఫ్రేమ్ చెబుతున్నారు. అక్కడికి ఈ ఏడాదే (2019) వెళ్లేందుకు ఉవ్విల్లూరుతున్నాం. లేదంటే వచ్చే ఏడాది (2020) తప్పనిసరి అని ఎలాన్ మస్క్ స్పష్టం చేసారు.

ధర 35,000 డాలర్లు...

ధర 35,000 డాలర్లు...

ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న టెస్లా ఎలక్ట్రిక్ కార్లు... మోడల్ 3 భారత్ లో ప్రవేశించే అవకాశం ఉంది. దీని ధర సుమారుగా 35,000 డాలర్లు (సుమారు రూ 24,50,000) ఉండనుందని అంచనా. అయితే భారత మార్కెట్ ధర విషయంలో చాల సున్నితంగా ఉంటుంది కాబట్టి ఇంకొంత తగ్గే అవకాశం ఉండొచ్చు అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎలాగూ ప్రభుత్వం కూడా ఎలక్ట్రిక్ కార్ల కొనుగోళ్ళకు భారీ ప్రయోజనాలు కల్పిస్తుండటం టెస్లా కు కలిసొచ్చే అంశమే.

చైనా నుంచి దిగుమతి...

చైనా నుంచి దిగుమతి...

టెస్లా కు ఇప్పటికే చైనా లోని షాంఘై నగరంలో భారీ ఎలక్ట్రిక్ కార్ల తయారీ ఫ్యాక్టరీ ఉంది. గిగాఫ్యాక్టరీగా పరిగణించే ఈ ప్లాంట్ లో ఏడాదికి 5,00,000 ఎలక్ట్రిక్ కార్లను ఉత్పత్తి చేయొచ్చు. అలాగే మరో 5,00,000 కార్ల ఉత్పత్తిని పెంచే ప్రయత్నంలో కంపెనీ ఉంది. ఒక వేళ భారత్ లో ప్రవేశించాలంటే టెస్లా చైనా నుంచి ఈ ఎలక్ట్రిక్ వాహనాలను దిగుమతి చేసుకొని ఇక్కడ విక్రయించే అవకాశం ఉంది.

English summary

వచ్చే ఏడాదే భారత రోడ్ల పైకి టెస్లా ఎలక్ట్రిక్ కార్లు | Tesla electric car may run on Indian roads in newxt year

Elon Musk has put a timeline for the entry of the company's electric car on Indian roads. In a recent interaction with IIT Madras students the Tesla CEO said that the car may run on Indian roads in 2020.
Story first published: Saturday, July 27, 2019, 13:06 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X