For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ పొరపాట్లు చేస్తే ఐటీ నోటీసులొస్తాయ్..

|

ఆదాయ పన్ను రిటర్న్ (ఐటీఆర్) సమర్పించే వారు తెలిసి తెలియక పొరపాట్లు చేస్తే వాటికి సంభందింది ఆదాయ పన్ను (ఐటీ) శాఖ నుంచి నోటీసులు రావడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి నోటీసులు అందితే ఆందోళన తప్పదు. అయితే ఐటీ శాఖ నుంచి నోటీసు రావడానికి పలు కారణాలు కూడా ఉంటాయి. అవేమిటంటే..

ఐటీఆర్ ఫైలింగ్ లో జాప్యం

ఐటీఆర్ ఫైలింగ్ లో జాప్యం

* ఐటీఆర్ ఫైలింగ్ కు ఇచ్చిన గడువు లోపు రిటర్న్ ఫైల్ చేయకపోతే ఐటీ శాఖ నుంచి రిమైండర్ నోటీసు వస్తుంది. గడువు దాటిన తర్వాత కూడా మీరు రిటర్న్ ను ఫైల్ చేయవచ్చు. కానీ అందుకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

* ఈ ఏడాది డిసెంబర్ 31 కన్నా ముందు రిటర్న్ ఫైల్ చేస్తే రూ.5,000 వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. వచ్చే ఏడాది జనవరి ఒకటి తర్వాత ఫైల్ చేస్తే జరిమానా రూ. 10,000 వరకు పెరుగుతుంది.

* ఐటీ శాఖనుంచి నోటీసు పొందకుండా ఉండాలంటే గడువులోపు ఐటీఆర్ ను ఫైల్ చేయడం మంచిది.

మరిన్ని సందర్భాలు...

మరిన్ని సందర్భాలు...

* ఐటీఆర్ ను ఫైల్ చేసే సమయంలో ఫారం 26 ఏఎస్, ఫారం 16 లేదా 16ఏ లో ఉన్న సమాచారం ఒకే విధంగా ఉండాలి. అయితే వీటిలో తేడాకు కారణాలు ఉండవచ్చు. అయితే మూలం వద్ద పన్ను విషయంలో తేడాలు ఉంటే ఐటీ నోటీసు రావడానికి అవకాశం ఉంటుంది. టీడీఎస్ మినహాయించుకున్నవారు ఆ వివరాలను సరిగ్గా వెల్లడించకపోయినా, టీడీఎస్ కోసం అసెస్సీ క్లెయిమ్ చేసుకున్నప్పుడు తేడాలు ఉన్నా నోటీసు రావచ్చు.

* బ్యాంకులు, ఉద్యోగం చేసే కంపెనీ ఇతర మార్గాల ద్వారా ఒక వ్యక్తి ఆదాయ వివరాలను ఆదాయ పన్ను శాఖ అధికారులు సేకరిస్తుంటారు. ఒక పన్ను చెల్లింపుదారు తన ఆదాయ వివరాలను తన ఐటీఆర్ లో పేర్కొనాల్సి వస్తుంది. లేనిపక్షంలో నోటీసు రావొచ్చు.

* భార్య/భర్త పేర్ల మీద పెట్టుబడులు పెట్టినప్పుడు ఆ పెట్టుబడుల ద్వారా వచ్చే ఆదాయాన్ని రిటర్న్ లో చూపాలి. లేకపోతే నోటీసు రావడానికి అవకాశం ఉంటుంది.

డెఫెక్టీవ్ రిటర్న్ నోటీసు

డెఫెక్టీవ్ రిటర్న్ నోటీసు

* సరైన ఫారం లో రిటర్న్ ను ఫైల్ చేయక పోయినా కూడా డెఫెక్టీవ్ రిటర్న్ నోటీసు వస్తుంది. దీనికి 15 రోజుల్లోపు స్పందించాల్సి ఉంటుంది. ఒకవేళ తప్పుగా రిటర్న్ ఫైల్ చేస్తే తర్వాత సవరించిన రిటర్న్ ను సమర్పించాల్సి ఉంటుంది.

* అధిక విలువ కలిగిన లావాదేవీలు నిర్వహించి వాటి వివరాలు టాక్స్ రిటర్న్ లో చూపకపోతే ఈ లావాదేవీలకు సంభందించిన ఆదాయ వనరుల వివరాలను తెలియజేయమని ఆదాయ పన్ను శాఖ కోరవచ్చు.

* వీటితో పాటు ఇంతకు ముందు సంవత్సరాల్లో పన్ను ఎగవేసిన వాటికీ సంభందించి నోటీసు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రిటర్న్ ఫైల్ చేసే ముందు అన్ని రకాల ఆదాయాల వివరాలు లెక్కించి దగ్గర పెట్టుకోవాలి. తేడాలు, తప్పులు లేకుండా చూసుకోవాలి.

English summary

ఈ పొరపాట్లు చేస్తే ఐటీ నోటీసులొస్తాయ్.. | Reasons why you may get a notice from the income tax department

You may get worried if you get a notice from the income tax department. You can get a tax notice for many reasons.
Story first published: Saturday, July 27, 2019, 18:37 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X