For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారత్ వృద్ధి రేటు అంచనాలు తగ్గించిన ఐఎంఎఫ్

|

నరేంద్ర మోడీ నేతృత్వంలో అఖండ మెజారిటీతో రెండో సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ .... దేశ వృద్ధి రేటు పరుగులు పెడుతుందని ఆశించింది. ఇటీవల ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ సైతం తన బడ్జెట్ ప్రసంగంలో ఇండియా ఏకంగా 5 ట్రిలియన్ డాలర్ల వ్యవస్థగా ఆవిర్భవించనుందని ఆశాభావం వ్యక్తం చేసింది. అందుకు అనుగుణంగానే జీడీపీ వృద్ధి రేటు ఉంటుందని పేర్కొంది. కానీ దేశంలో పరిస్థితులు మరోలా ఉన్నాయి. స్టాక్ మార్కెట్లు కుదేలు అవుతున్నాయి. ఆశింశిన మేరకు వర్షాలు లేక వ్యవసాయ రంగం తీవ్ర కరువును ఎదుర్కొంటోంది. నగరాలూ, పట్టణాలతో సహా గ్రామీణ ప్రాంత వినియోగం నెమ్మదిస్తోంది. కొంత కాలంగా కార్లు, వాణిజ్య వాహనాలు, ద్విచక్ర వాహనాల విక్రయాలు నెల నేలకూ తగ్గిపోతున్నాయి. బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ కంపెనీలు దెబ్బతిని రుణాల లభ్యత పడిపోయింది. ఇవన్నీ దేశంలో మందగమనం పరిస్థితులను సూచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశానికి మరో ఎదురు దెబ్బ తగిలింది.

పెట్టుబడులు పెట్టాలనుకుంటే ముందు ఈ పనులు చేయండి...పెట్టుబడులు పెట్టాలనుకుంటే ముందు ఈ పనులు చేయండి...

వృద్ధి రేటు 7 శాతమే....

వృద్ధి రేటు 7 శాతమే....

ఇంటర్నేషనల్ మోనిటరీ ఫండ్ (IMF) ... భారత జీడీపీ వృద్ధి రేటును తగ్గించింది. మన దేశ జీడీపీ కేవలం 7 % వృద్ధిని మాత్రమే నమోదు చేస్తుందని వెల్లడించింది. గతంలో IMF అంచనాల కంటే ఇది 0.3 % తక్కువ కావడం విశేషం. దేశంలో వినియోగ స్థితిగతులను పరిగణలోకి తీసుకొని IMF భారత జీడీపీ వృద్ధి రేటు అంచనాలను సవరించింది. 2019-20 ఆర్ధిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి రేటును 7.3% నుంచి 7 శాతానికి తగ్గించగా... 2020-21 ఏడాదికి 7.5% నుంచి 7.2% శాతానికి పరిమితం చేసింది. అయితే, 7% వృద్ధి తో అయినా ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందే దేశంగా మాత్రం మనకు గుర్తింపును కట్టబెట్టింది. ఇదొక్కటే మనకి కాస్త ఊరటనిచ్చే అంశం.

ప్రపంచ వృద్ధి రేటు తక్కువే...

ప్రపంచ వృద్ధి రేటు తక్కువే...

వరల్డ్ ఎకనామిక్ ఔట్లుక్ పేరుతో ... IMF చిలి రాజధాని శాంటియాగో లో నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికలో ప్రపంచ వృద్ధి రేటును కూడా కాస్త సవరిస్తూ... 2019, 2020 సంవత్సరాలకు వృద్ధి అంచనాలను స్వల్పంగా తగ్గించింది. 2019 కి గాను ప్రపంచ వృద్ధి రేటు 3.2% (గతంలో 3. 3%) కి తగ్గించగా... 2020 కి 3.5% (గతంలో 3.6%) నికి సవరించినట్లుగా భారత సంతతికి చెందిన చీఫ్ ఎకనామిస్ట్ గీత గోపినాథ్ వెల్లడించారు. అభివృద్ధి చెందిన దేశాల్లో మెరుగైన పరిస్థితుల ప్రభావాన్ని ... వర్ధమాన దేశాల్లో నెలకొన్న విషమ పరిస్థితులు అధిగమించటం వల్ల మొత్తంగా ప్రపంచ వృద్ధి అంచనాలను స్వల్పంగా సవరించాల్సి వచ్చినట్లు ఆమె పేర్కొన్నారు.

చైనా లో అదే పరిస్థితి...

చైనా లో అదే పరిస్థితి...

పొరుగు దేశం చైనా లోనూ పరిస్థితులు ఏమీ బాగోలేవు. దేశంలో మందగమనం వెంటాడుతున్న నేపథ్యంలోనే అటు అమెరికా నుంచి ట్రేడ్ వార్ మొదలైంది. దీంతో చైనా లో జీడీపీ వృద్ధి రేటు 2019 లో 6.3% నుంచి 6.2% నికి తగ్గగా... 2020 లో ఆ దేశ జీడీపీ 6.1% నుంచి 6 శాతానికి పరిమితం కానుందని IMF తన నివేదికలో వెల్లడించింది. అదే సమయంలో అమెరికా వృద్ధి అంచనాలు మాత్రం 2019 లో 2.3% నుంచి 2.6% శాతానికి పెంచడం విశేషం. అగ్రరాజ్యం 2020 లో కూడా 1.9% వృద్ధి రేటును కొనసాగిస్తుందని IMF అభిప్రాయపడింది. ఇదే సమయంలో 2019 లో జపాన్ జీడీపీ 1 శాతం నుంచి 0.9 శాతానికి పరిమితమవుతుంది పేర్కొంది. బ్రెజిల్ కూడా 2019 లో కేవలం 0.8% వృద్ధిని నమోదు చేస్తుందని తెలిపింది. గతం లో బ్రెజిల్ జీడీపీ పెరుగుదల అంచనా 2.1% కావడం గమనార్హం.

English summary

భారత్ వృద్ధి రేటు అంచనాలు తగ్గించిన ఐఎంఎఫ్ | IMF projects slower growth rate for India

The IMF further cut its annual growth forecast for India, as it expects weaker domestic demand to limit an economic recovery.
Story first published: Wednesday, July 24, 2019, 10:17 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X