For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Q1లో ఎస్బీఐ, ప్రభుత్వ సంస్థల్లో వాటా తగ్గించుకున్న LIC, ఆ కంపెనీల్లో పెట్టుబడి

|

న్యూఢిల్లీ: భారతదేశపు అతిపెద్ద సంస్థాగత పెట్టుబడిదారు లైఫ్ ఇన్సురెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (LIC) జూన్ త్రైమాసికంలో సెలక్టెడ్ బ్యాంకులతో పాటు వ్యవసాయ రసాయన, ఫార్మా, FMCG స్టాక్‌లను పెంచుకుంది. జూన్ 28 నాటికి దేశీయ ఈక్విటీ బెంచ్ మార్క్ సెన్సెక్స్ స్వల్పంగా 1.87 శాతం పెరిగి 39,395 కు చేరుకుంది. టెలికం, పవర్, మైనింగ్, పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు, NBFC, పవర్ జనరేషన్, చమురు సంస్థలలోని షేర్లను LIC తగ్గించుకుంది. అదే సమయంలో ప్రైవేటు రంగ రుణదాతలు వైపు దృష్టి సారించింది.

జీవన్ సరళ్: LIC రూ.1 లక్ష కోట్ల ఫ్రాడ్ పిల్, విచారణకు సుప్రీం కోర్టు నో జీవన్ సరళ్: LIC రూ.1 లక్ష కోట్ల ఫ్రాడ్ పిల్, విచారణకు సుప్రీం కోర్టు నో

కొటక్ మహీంద్రాలో పెరిగిన షేర్లు

కొటక్ మహీంద్రాలో పెరిగిన షేర్లు

కార్పొరేట్ డేటాబేస్ ఏస్ ఈక్విటీ నుండి వచ్చిన సమాచారం ప్రకారం.. కొటక్ మహీంద్రా బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్ షేర్ హోల్డింగ్స్ పెరిగాయి. ఇటీవలి జూన్ త్రైమాసికంలో ఫెడరల్ బ్యాంక్ షేర్లు 46.25 శాతం పెరిగి రూ.384.21 కోట్లకు చేరుకుంది. ఇది మంచి వృద్ధి. ఫెడరల్ బ్యాంకు, కొడక్ మహీంద్రా బ్యాంకు షేర్లు జూలై 17 వరకు ఇయర్ టు డేట్ పది శాతం, 22 శాతం లాభపడ్డాయి. సెన్సెక్స్ బెంచ్‌మార్క్ 7 శాతం లాభపడింది.

ఎల్ఐసీ వాటాను పెంచుకున్న కంపెనీలు

ఎల్ఐసీ వాటాను పెంచుకున్న కంపెనీలు

ఎల్ఐసీ క్వార్టర్ 1లో (ఏప్రిల్ - జూన్) పలు కంపెనీల్లో తన వాటాను పెంచుకుంది. UPL, Bliss GVS Pharma, Blue Dart Express, Havells India, The Federal Bank, Adani Ports and Special Economic Zone, Kotak Mahindra Bank, GAIL (INDIA), Bank of Baroda, ITC, Granules India, Gillette Indiaలలో స్టేక్ పెంచుకుంది. బ్యాంక్ ఆఫ్ బరోడాలో స్టేక్ పెంచుకున్న ఎల్ఐసీ సిండికేట్ బ్యాంకు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబా నేషనల్ బ్యాంక్, SBIలలో తగ్గించుకోవడం గమనార్హం.

ఎల్ఐసీ వాటాను తగ్గించుకున్న కంపెనీలు

ఎల్ఐసీ వాటాను తగ్గించుకున్న కంపెనీలు

పవర్ గ్రిడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్, ఎన్టీపీసీ, ఎన్ఎండీసీ, స్టీల్ అథారిటీ ఆప్ ఇండియా, ఎంటీఎన్ఎల్, నేషనల్ అల్యూమినియం కంపెనీ, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, షిప్పింగ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యాక్సిస్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ ఇండియా, వెల్‌స్పన్ కార్ప్, హిందూస్తాన్ చాపర్, ఆయిల్ ఇండియా, వాక్‌రంగీ, మిష్రా దతు నిగమ్, పంజాబ్ నేషనల్ బ్యాంకు, తంబలోలి కాపిటల్, ఒరిస్సా మినరల్ డెవలప్‌మెంట్ కంపెనీ, ఎంపైర్ ఇండస్ట్రీస్, ఎస్వీ గ్లోబల్ మిల్స్‌లో వాటాలు తగ్గించుకుంది.

వాటాలు ఇలా తగ్గాయి..

వాటాలు ఇలా తగ్గాయి..

ఎల్ఐసీ క్వార్టర్ 1లో పలు కంపెనీల్లో తమ వాటాను తగ్గించుకుంది. MTNLలో అంతకుముందు క్వారాటర్ 18.49 శాతంగా ఉంటే, జూన్ క్వార్టర్‌కు దానిని 14.56 శాతానికి తగ్గించుకుంది. పవర్ గ్రిడ్‌లో 7.50% నుంచి 4.89%, BHELలో 14.13% నుంచి 11.67%, NMDCలో 14.72% నుంచి 12.89%, షిప్పింగ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాలో 11.91% నుంచి 10.32% తగ్గించుకుంది.

వెల్స్‌పన్ కార్ప్, Nalco, NTPC, SAIL, పైసాలో డిజిటల్, OMDC, తంబోలీ కాప్టల్, ఆయిల్ ఇండియా, SV గ్లోబల్ మిల్‌లోను వాటాలు తగ్గించింది.

English summary

Q1లో ఎస్బీఐ, ప్రభుత్వ సంస్థల్లో వాటా తగ్గించుకున్న LIC, ఆ కంపెనీల్లో పెట్టుబడి | LIC bought into some interesting names in Q1, but sold SBI, PNB

Life Insurance Corporation of India (LIC), India’s largest domestic institutional investor, raised bets on select banks as well as agrochemical, pharma and FMCG stocks during June quarter.
Story first published: Tuesday, July 23, 2019, 10:21 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X