For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ట్యాంకర్ స్వాధీనం, పెరిగిన చమురు ధరలు: నిలకడగా పెట్రోల్ ధరలు

|

బ్రిటిష్ ఆయిల్ ట్యాంకర్‌ను ఇరాన్ మిలటరీ దళాలు సీజ్ చేసిన నేపథ్యంలో మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో హైటెన్షన్ నెలకొని ఉంది. దీంతో సోమవారం నాడు చమురు ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారెల్‌‌కు 0.8 శాతం లేదా 51 సెంట్లు పెరిగి $62.98గా ఉంది. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ (WTI) క్రూడాయిల్ బ్యారెల్‌కు 15 సెంట్లు లేదా 0.3 శాతం పెరిగి $55.78గా ఉంది. అంతకుముందు వారం WTI 7 శాతం, బ్రెంట్ క్రూడాయిల్ 6 శాతం పడిపోయాయి.

ఆయిల్ ధరలకు మద్దతు

ఆయిల్ ధరలకు మద్దతు

పర్షిషన్ గల్ఫ్‌లో ఉద్రిక్తతల నేపథ్యంలో చమురు ధరలకు మద్దతు లభిస్తోందని, కానీ డిమాండ్ లేకపోవడం, అమెరికా చమురు నిల్వలు పెరగడంతో చమురు చార్ట్స్ బేరిష్‌గా ఉన్నాయని సీనియర్ మార్కెట్ అనలిసస్ట్ ఎడ్వార్డ్ మోయా అన్నారు. ఈ నెల ప్రారంభంలో బ్రిటన్‌.. ఇరానియన్ నౌకను స్వాధీనం చేసుకుంది. గల్ఫ్‌లో బ్రిటిషన్ జెండా ఉన్న ఆయిల్ ట్యాంకర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఇరాన్ తెలిపింది.

ఇరాన్ వర్సెస్ బ్రిటన్

ఇరాన్ వర్సెస్ బ్రిటన్

దీనిపై చర్చించేందుకు సోమవారం బ్రిటన్ అత్యవసర ప్రతిస్పందన కమిటీ సమావేశం జరగనుంది. అంతేకాకుండా తన నౌకలకు చాలా దగ్గరగా ఎగురుతున్న ఇరానియన్ డ్రోన్లను అమెరికా నాశనం చేస్తుందని యునైటెడ్ స్టేట్స్ పరిపాలన అధికారి తెలిపారు. ఇరాన్ డ్రోన్‌ను హార్ముజ్ జలసంధిలో నాశనం చేశామని అమెరికా ప్రకటించింది. దీనిని ఇరాన్ ఖండించింది. మొత్తంగా డిమాండ్ మందగించడం, అంతర్జాతీయంగా మార్కెట్లలో అవాంతరాల కారణంగా ధరలు గణనీయంగా పెరుగుతాయని అంచనా వేయడం లేదని ఐఈఏ అధికారి తెలిపారు.

యథాతథంగా పెట్రోల్, డీజిల్ ధరలు

యథాతథంగా పెట్రోల్, డీజిల్ ధరలు

కాగా, దేశీయ ఇంధన ధరల్లో సోమవారం ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.77.90 వద్ద స్థిరంగా ఉంది. డీజిల్ ధర రూ.72.14గా ఉంది. అమరావతిలో పెట్రోల్ ధర రూ.77.58, డీజిల్ రూ.71.49, విజయవాడలో పెట్రోల్ రూ.77.23, డీజిల్ రూ.71.17గా ఉంది.

లోన్స్ చాలా ఈజీ... ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తే ప్రయోజనాలెన్నోలోన్స్ చాలా ఈజీ... ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తే ప్రయోజనాలెన్నో

English summary

ట్యాంకర్ స్వాధీనం, పెరిగిన చమురు ధరలు: నిలకడగా పెట్రోల్ ధరలు | Oil prices gain as Gulf tanker seizure raises tensions

Oil prices rose on Monday amid high tensions in the Middle East after a British tanker was seized by the Iranian military at the end of last week. Brent crude futures were up 51 cents, or 0.8%, at$62.98 a barrel by 0042 GMT.
Story first published: Monday, July 22, 2019, 11:18 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X