For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

15 రోజుల్లో చెల్లించండి: ఆంధ్రప్రదేశ్‌కు ఎన్టీపీసీ లీగల్ హెచ్చరికలు

|

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎన్టీపీసీ, సోలార్ ఎనర్జీ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (SECI)లు షాకిచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. టారిఫ్‌ల పునఃసమీక్షపై లీగల్‌గా ముందుకు సాగుతామని ఎన్టీపీసీ, ఎస్ఈసీఐలు ఏపీ పవర్ డిస్ట్రిబ్యూషన్ యుటిలిటీకి హెచ్చరికలు జారీ చేశాయి. సోలార్ ప్లాంట్స్ టారిఫ్ టారిఫ్‌పై సమీక్షలను తప్పుబట్టాయి.

NTPC, SECI గైర్హాజరు

NTPC, SECI గైర్హాజరు

టారిఫ్ పునఃసమీక్షలపై సోమవారం నాడు చర్చించాలన్న రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై ఈ రోజు చర్చించాలని నిర్ణయించింది. కానీ ఈ సమావేశానికి గైర్హాజరు అవుతున్నట్లు ఈ రెండు కేంద్ర ప్రభుత్వ కంపెనీలు నిర్ణయించాయి. పునరుత్పాదక ఇంధన కర్మాగారాల నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను యూనిట్‌కు టారిఫ్‌ను రూ.2.44కు తగ్గించాలని జూలై 12, జూలై 17వ తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఆరోపణలను NTPC, SECI పాయింట్ టు పాయింట్ వైజ్ ఖండిస్తూ లేఖలు పంపించాయి.

పునఃసమీక్షకు నో..

పునఃసమీక్షకు నో..

ఓ సీనియర్ ఎన్టీపీసీ అధికారి ఒకరు ఓ ఇంగ్లీష్ మీడియా ఛానల్‌తో మాట్లాడుతూ... నాన్-పేమెంట్ అంశం లీగల్ యాక్షన్‌కు దారి తీస్తుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలియజేసినట్లు చెప్పారు. అలాగే, స్టేట్ రెగ్యులేటరీ కమిషన్ అప్రూవల్ ద్వారా కాంట్రాక్టులు కుదిరాయని, కాబట్టి టారిఫ్‌పై అనుమానాలు అవసరం లేదని అభిప్రాయపడ్డారు. కాగా, టారిఫ్‌పై పునఃసమీక్ష జరిపే అంశంపై చర్చల కోసం జగన్ ప్రభుత్వం విండ్ ఎనర్జీ డెవలపర్స్, ఇతర స్టేక్ హోల్డర్స్‌ను ఆహ్వానించింది. జూలై 15న మొదటి సమావేశం, ఈ రోజు (జూలై 22) రెండో సమావేశానికి ఆహ్వానించింది. ఎన్టీపీసీ, ఎస్ఈసీఐలకు కూడా అధిక టారిఫ్‌లపై పునఃసమీక్ష చర్చలకు రావాలని జగన్ ప్రభుత్వం ఆహ్వానించింది.

టారిఫ్..

టారిఫ్..

స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ ఓసారి టారిఫ్‌కు ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత వాటిని తిరిగి పునృఃసమీక్షించేందుకు ఓపెన్ చేయలేమని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పవర్ సేల్ అగ్రిమెంట్ (PSA)ను కచ్చితంగా గౌరవించాలని SECI స్పష్టం చేసింది. PSAలను గౌరవించాలని సదర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్‌ను తాము కోరుతున్నామని కోరింది. అలాగే, నెలకు 1.25 శాతం లేట్ పేమెంట్ సర్‌ఛార్జ్‌ను నివారించుకునేందుకు, లీగల్ చర్యలు లేకుండా ఉండేందుకు ఇన్వాయిస్, పెండింగ్ పేమెంట్స్‌ను 15 రోజుల్లో ప్రాసెస్ చేయాలని కోరింది.

English summary

15 రోజుల్లో చెల్లించండి: ఆంధ్రప్రదేశ్‌కు ఎన్టీపీసీ లీగల్ హెచ్చరికలు | NTPC, SECI threaten legal action against Andhra Pradesh

NTPC and Solar Energy Corp of India (SECI) have threatened Andhra Pradesh power distribution utilities of legal action and have denied renegotiation of tariffs from solar plants, saying the demand does not hold any valid ground.
Story first published: Monday, July 22, 2019, 17:57 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X