For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారీగా పతనమైన HDFC గ్రూప్ షేర్లు, కారణమిదే!

|

ముంబై: స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. నిఫ్టీ 11,400 దిగువకు చేరుకుంది. సెన్సెక్స్ కూడా 200 పాయింట్ల వరకు కోల్పోయింది. అయితే క్వార్టర్ 1లో 18 శాతం వృద్ధి నమోదు చేసిన HDFC, HDFC బ్యాంకు, HDFC లైఫ్ షేర్లు సోమవారం భారీగా నష్టపోయాయి. వీటి షేర్లు రెండు నుంచి ఆరు శాతం వరకు క్షీణించాయి.

HDFC హెచ్చరిక: మీ డబ్బు దొంగిలిస్తారు.. ఇలా చేయకండి!HDFC హెచ్చరిక: మీ డబ్బు దొంగిలిస్తారు.. ఇలా చేయకండి!

ఈ కేలండర్ ఇయర్లో హెచ్‌డీఎఫ్‌సీ గ్రూప్ షేర్లు 12 శాతం నుంచి 53 శాతం మేర లాభపడ్డాయి. షేర్లు అధిక వ్యాలుయ్యేషన్ వద్ద ట్రేడ్ అవుతున్న తరుణంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పూనుకున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు షేర్లు ఉదయం 3 శాతం నష్టపోయాయి.

D Street Buzz: HDFC Bank falls 3%

ఈ ప్రయివేటు సెక్టార్ బ్యాంకు ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుదల 21 శాతంగా నమోదు చేసింది. నెట్ ఇంటరెస్ట్ ఇన్‌కం 23 శాతం ఉండగా, వృద్ధి రేటు జూన్ త్రైమాసికానికి 17 శాతానికి పైగా నమోదు చేసింది.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుతో పాటు బజాజ్ ఫైనాన్స్, సిప్లా, అదానీ పోర్ట్, టైటాన్, ఐసీఐసీఐ బ్యాంకు, బజాజ్ ఆటో, బజాజ్ ఫిన్‌ సర్వ్‌, అమర్‌ రాజా, ఇంటర్ గ్లోబ్‌ ఏవియేషన్, ఐసీఐసీఐ లంబార్డ్‌, ఫ్యూచర్ లైఫ్ స్టైల్ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. పలు బ్యాంకులు కూడా నష్టాల్లో ప్రారంభమయ్యాయి. యస్ బ్యాంకు మాత్రం 7 శాతం లాభాల్లో ట్రేడ్ ప్రారంభించింది.

English summary

భారీగా పతనమైన HDFC గ్రూప్ షేర్లు, కారణమిదే! | D Street Buzz: HDFC Bank falls 3%

Shares of HDFC Bank fell nearly 3 percent intraday on July 22 after moderate weakness in Q1 asset quality and slow down in retail loan growth, but brokerages remain positive on the stock.
Story first published: Monday, July 22, 2019, 15:55 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X