సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ పదవి పూర్తిగా రాజకీయంగా మారిందని, ఆ పదవి చేపట్టే వారికి ఆ దేశ రాజకీయాల పట్ల కూడా అవగాహన ఉండాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మాజీ గవర్నర్ రఘురాం రాజన్ అన్నారు. అలాగే బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ (BOE) గవర్నర్ పదవికి దరఖాస్తు చేసినట్లుగా వచ్చిన వార్తలను ఆయన కొట్టిపారేశారు. ఈ మేరకు ఆయన ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ గవర్నర్ పదవి రేసులో రాజన్ కూడా ఉన్నారని గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

మంచి ఉద్యోగంలో ఉన్నాను..
తాను యూనివర్సిటీ ఆఫ్ చికాగోలో మంచి పోస్టులో ఉన్నానని, సెంట్రల్ బ్యాంక్ ప్రొఫెనల్ కంటే విద్యావేత్తగా ఉండటమే తనకు ఇష్టంగా ఉందని రఘురాం రాజన్ వెల్లడించారు. విద్యావేత్తగా తన ఉద్యోగం పట్ల పూర్తి సంతృప్తిగా ఉన్నానని చెప్పారు. ఇది డిప్లమాటిక్ సమాధానం కాదని, తాను నిజమే చెబుతున్నానని అన్నారు. తాను తన ఉద్యోగం పట్ల సంతృప్తిగా ఉన్నానని, ఏ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోలేదని చెప్పారు.

లోతైన అవగాహన లేదు
ఇటీవల సెంట్రల్ బ్యాంక్ ఉద్యోగం మరింత రాజకీయంగా మారిందని రఘురాం రాజన్ తెలిపారు. ఈ పదవి కోసం ఆ దేశ రాజకీయాలను, దానిని ఎలా నావిగేట్ చేయాలో అర్థం చేసుకోగలిగి ఉండాలన్నారు. అక్కడి వారు ఎవరిని కోరుకుంటారో వారిని పరిగణలోకి తీసుకుంటారన్నారు. యునైటెడ్ కింగ్ డమ్ పాలిటిక్స్, బ్రెగ్జిట్ అంశంపై అవగాహన గురించి స్పందిస్తూ.. తాను బయటివాడినని (ఆ దేశం వాడిని కాదు), ఆ దేశం రాజకీయాలు, ఇతర అంశాల గురించి తనకు కొద్దిగా తెలుసునని, లోతైన అవగాహన లేదన్నారు. ఇంగ్లాండ్ పైన పూర్తి అవగాహనన ఉన్న వ్యక్తి అయితేనే ఆ పదవిని సమర్థవంతంగా నిర్వహిస్తారన్నారు.

రాజకీయ జోక్యం పెరుగుతోంది
బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ గవర్నర్ మార్క్ క్యార్నీ పదవీ కాలం జనవరితో ముగుస్తోంది. ఆ స్థానంలో రఘురామ్ రాజన్‌ను నియమించే అవకాశాలు ఉన్నట్లు ఊహాగానాలు వినిపించాయి. బ్రెగ్జిట్ నేపథ్యంలో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ పైన తీవ్ర రాజకీయపరమైన ఒత్తిళ్లు ఉండే అవకాశముందని, అందుకే ఆ పదవికి తాను దరఖాస్తు చేసుకోలేదన్నారు. పలు దేశాల కేంద్ర బ్యాంకు వ్యవహారాల్లో ఇటీవల రాజకీయ జోక్యం పెరిగిపోతుందన్నారు. ఐరోపా సమాఖ్య నుంచి బ్రిటన్ వైదొలగనున్న నేపథ్యంలో ఆ దేశం తీవ్ర ఆర్థిక ఒడిదొడుకులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ స్థాయి అనుభవం ఉన్న వ్యక్తిని నియమించాలని బ్రిటన్ భావిస్తోంది. దాని కోసం వేట ప్రారంభించింది. ఇప్పటి వరకు 30మంది అందుకు పోటీ పడుతున్నట్లు సమాచారం.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications