For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

విశాఖకు తగ్గుతున్న విమాన సర్వీసులు .. అలా లేకపోవటమే కారణం

|

విశాఖ ప్రజలకు ఒక కొత్త చిక్కొచ్చిపడింది. విశాఖపట్నం విమానాశ్రయం నుంచి ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నా కూడా విమాన సర్వీసులు రోజురోజుకీ తగ్గుముఖం పట్టాయి. లాభదాయకంగా లేదనే కారణంతోనే విశాఖకు పలు విమాన సర్వీసులను నిలిపివేస్తూ విమానయాన కంపెనీలు నిర్ణయం తీసుకుంటున్నాయి.

లాభసాటిగా లేక విశాఖకు విమాన యాన సర్వీసులు రద్దు

లాభసాటిగా లేక విశాఖకు విమాన యాన సర్వీసులు రద్దు

ఏ వ్యాపారమైనా, సేవలు అందించడంతో పాటు గా ఆశించేది ముఖ్యంగా లాభమే. అలా లాభదాయకంగా లేనప్పుడు వ్యాపారం చేయడంలో ఎలాంటి అర్థం వుండదు. అందుకే సరిగ్గా ఇదే సూత్రంతో పనిచేస్తున్నాయి పలు విమానయాన సంస్థలు. తమకు ఏ మార్గంలో డిమాండ్ ఉందో ఆ మార్గం వైపు కే సర్వీసులను మళ్లించి సేవలందిస్తున్నాయి. విశాఖలో లాభదాయకంగా విమానయాన సంస్థలకు ఆదాయం లేక పోవడంతో పలు సర్వీసులను ఇప్పటికే నిలిపివేశాయి విమానయాన సంస్థలు.

 ప్రయాణికుల విజ్ఞప్తిని పట్టించుకోని విమాన యాన సంస్థలు

ప్రయాణికుల విజ్ఞప్తిని పట్టించుకోని విమాన యాన సంస్థలు

ఇటీవల శ్రీలంక ఎయిర్ లైన్స్ తన సర్వీస్ అంత లాభదాయకంగా లేకపోవడంతో రద్దు చేసుకుంది. వయబులిటీ గ్యాప్ ఫండింగ్ అందించవలసిందిగా ప్రభుత్వాన్ని కోరిన ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో తన సర్వీసును నిలిపివేసింది. అయితే విశాఖలో శ్రీలంకకు వాణిజ్య సంబంధాలు ఉండడంతో ఒక విమానయాన సంస్థ మాత్రం 14 మంది ప్రయాణించే ఒక చిన్న విమానాన్ని నడపటానికి ముందుకు వచ్చింది.

ఇక ఎయిరిండియా కూడా తన అనుబంధ సంస్థ అయిన ఎయిర్ అలయన్స్ ద్వారా నిర్వహించే విశాఖపట్నం విజయవాడ తిరుపతి విమాన సర్వీసును రద్దు చేసింది. ఎయిర్ ఇండియా చైర్మన్ ను ఢిల్లీలో విమాన ప్రయాణికులు సంఘం కలిసి విన్నవించిన ఆ సర్వీసును పునరుద్ధరించే ఆలోచన లో ఎయిర్ ఇండియా లేదు.

విశాఖకు విమానయాన కంపెనీలు గుడ్ బై చెప్తున్నాయన్న ఆందోళనలో ప్రయాణికులు

విశాఖకు విమానయాన కంపెనీలు గుడ్ బై చెప్తున్నాయన్న ఆందోళనలో ప్రయాణికులు

ఇక ఇటీవల విశాఖపట్నం నుండి కొచ్చిన్ వెళ్లే సర్వీసును కూడా రద్దు చేశారు. ఇక స్పైస్ జెట్ కూడా తన కోల్ కత్తా విమాన సర్వీసులు రద్దు చేసుకుంది. సంక్షోభంలో ఉన్న జెట్ ఎయిర్వేస్ ఢిల్లీ ముంబై సర్వీసులను నిలిపివేసింది. ఇక తాజాగా ఇండిగో ఎయిర్లైన్స్ కూడా హైదరాబాద్, చెన్నై నగరాలకు ఆగస్ట్ నుంచి సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. మరి ఈ సర్వీసులను ఆ తర్వాత కొనసాగిస్తారో లేదో కూడా నెలకొంది. ఇక ప్రయాణికులు సేవలను, విమాన సర్వీసులను పునరుద్ధరించాలని కోరుతున్నప్పటికీ విమానయాన సంస్థలు అంతగా స్పందిస్తున్న దాఖలాలే లేవు. దీంతో విశాఖకు విమానయాన కంపెనీలు గుడ్ బై చెప్తున్నాయా అన్న అనుమానం కలుగుతోంది.

English summary

విశాఖకు తగ్గుతున్న విమాన సర్వీసులు .. అలా లేకపోవటమే కారణం | Visakha Declining Airlines .. The reason is that ..

Vishakha has given a new impetus to the people. Passenger traffic from Visakhapatnam airport has increased significantly, but airlines have been decreasing their services day by day. Airlines are making the decision to suspend several flights to Vishakha on the grounds that it is not profitable. Many airlines services are diverted towards whatever route they are in demand. Many services have already been discontinued due to lack of revenue for airlines in Visakha
Story first published: Saturday, July 20, 2019, 13:20 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X