For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

1.46 కోట్ల ఐటీ రిటర్న్స్ ఫైల్, 90.8 లక్షలమంది ఐటీఆర్1 ట్యాక్స్ పేయర్స్

|

న్యూఢిల్లీ: జూలై 16వ తేదీ వరకు 1.46 కోట్ల ఇన్‌కం టాక్స్ రిటర్న్స్ ఫైల్ అయ్యాయి. ఇందులో 50 లక్షల ఆదాయంవరకు ఉన్న ఇండివిడ్యువల్స్‌వి 90.8 లక్షలు. కేవలం జూలై 16వ తేదీ రోజునే 7.94 లక్షల మంది రిటర్న్స్ సమర్పించారని, ఇందులో 5.26 లక్షలు ఐటీఆర్1 లేదా సహజ్ అని రెవెన్యూ శాఖ వెల్లడించింది.

రూ.50 లక్షల వరకు ఆదాయం ఉన్న రెసిడెంట్ ఇండివిడ్యువల్స్ ఐటీఆర్1 ఫైల్ చేస్తారు. శాలరైడ్, సొంతిల్లు, ఇతర మార్గాల ద్వారా ఆదాయం, రూ.5,000 లోపు వ్యవసాయ రాబడి మొత్తం కలిపి రూ.50 లక్షల లోపు ఆదాయం పొందుతున్న వారు ఐటీఆర్ 1 దాఖలు చేస్తారు. 9.68 లక్షల మందికి పైగా ఐటీఆర్2 దాఖలు చేశారు. బిజినెస్, ప్రొఫెషనల్‌గా ఎలాంటి ఆదాయం పొందని అవిభక్త హిందూ కుటుంబాలు (HUF) ఈ విభాగంలోకి వస్తాయి. ఇక జులై 16 వరకు ఐటీఆర్ 3లు 14.94 లక్షలు దాఖలయ్యాయి.

Over 1.46 crore IT returns filed so far, 90.8 lakh taxpayers file ITR1

ఐటీ రిటర్న్స్ ప్రక్రియను సులభతరం చేసేందుకు ప్రీ-ఫైల్డ్ ఐటీఆర్ పత్రాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇందులో ఏమైనా ఉంటే స్వల్ప మార్పులు చేసుకోవచ్చు. ప్రీ-ఫైల్డ్ పత్రాల వల్లే ఎక్కువ రిటర్న్స్ దాఖలు అవుతున్నట్లు అధికారులు తెలిపారు. ఐటీఆర్4 లేదా సుగమ్ దాదాపు 28 లక్షలు దాఖలైనట్లు తెలిపారు. అలాగే 24,000 సంస్థలు ఐటీఆర్ 6 దాఖలు చేశాయి. మొత్తంగా జూలై 16వ తేదీ నాటికి 1.46 కోట్ల ఐటీ రిటర్న్స్ దాఖలయినట్లు తెలిపారు.

ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేందుకు చివరి తేదీ జూలై 31. అయితే ఆడిటింగ్ కచ్చితంగా అవసరమైన కంపెనీలు, సంస్థల రిటర్న్స్ దాఖలుకు సెప్టెంబర్ 30వ తేదీ వరకు గడువు ఉంది. అలాగే, ఐటీ రిటర్న్స్‌లో మార్పులు చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను ఆదాయపన్ను శాఖ ఇప్పటికే ఖండించింది.

జాగ్రత్త!: గడువుదాటినా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయకుంటే జరిమానా ఇలా, జైలుశిక్షజాగ్రత్త!: గడువుదాటినా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయకుంటే జరిమానా ఇలా, జైలుశిక్ష

కాగా, ఐటీ రిటర్న్స్ ఫాంలో ఎలాంటి మార్పులు లేవని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్ (CBDT) మంగళవారం స్పష్టం చేసింది. ఆదాయ పన్ను రిటర్న్స్ ఫాంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయని, దీంతో ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడంలో పన్ను చెల్లింపుదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సోషల్ మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే అవన్నీ వట్టివేనని CBDT ఇటీవల కొట్టిపడేసింది.

English summary

1.46 కోట్ల ఐటీ రిటర్న్స్ ఫైల్, 90.8 లక్షలమంది ఐటీఆర్1 ట్యాక్స్ పేయర్స్ | Over 1.46 crore IT returns filed so far, 90.8 lakh taxpayers file ITR1

Over 1.46 crore income tax returns have been filed so far, of which 90.8 lakh have been filed by individuals with total income up to Rs.50 lakh.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X