For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కుబేరుల్లో 3వ స్థానానికి పడిపోయిన బిల్ గేట్స్, 13వ స్థానంలో ముఖేష్ అంబానీ

|

వాషింగ్టన్: ప్రపంచ కుబేరులు ఎవరు అంటే మనకు గుర్తుకు వచ్చేది జెఫ్ బెజోస్, బిల్ గేట్స్. గతంలో గేట్స్ స్థానాన్ని బెజోస్ దక్కించుకున్నారు. ఇప్పటి వరకు బెజోస్ ప్రపంచ కుబేరుల్లో మొదటి వాడు అయితే, బిల్ గేట్స్ రెండోవాడు. ఇప్పుడు ఆ రెండో స్థానం కూడా ఫ్రెంచ్ బిలియనీర్ బెర్నార్డ్ అర్నాల్ట్‌కు దక్కింది. ఇతను లగ్జరీ గూడ్స్ మార్కెట్ LVMH (LVMHF) సీఈవో. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో తొలిసారి అర్నాల్డ్ రెండోస్థానంలో నిలిచారు. ఏడేళ్ల క్రితం బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌ ప్రారంభమైంది. నాటి నుంచి గేట్స్ రెండో స్థానం కూడా కోల్పోవడం మొదటిసారి.

ఫారెన్ కరెన్సీ బాండ్ అంటే ఏమిటి, ఆరెస్సెస్ వాదన సరైనదేనా?ఫారెన్ కరెన్సీ బాండ్ అంటే ఏమిటి, ఆరెస్సెస్ వాదన సరైనదేనా?

అర్నాల్డ్ నెట్ వర్త్ 108 బిలియన్ డాలర్లు

అర్నాల్డ్ నెట్ వర్త్ 108 బిలియన్ డాలర్లు

ఈ ఇండెక్స్ ప్రకారం ప్రస్తుతం అర్నాల్డ్ నెట్ వర్త్ 108 బిలియన్ డాలర్లు. గత ఏడాదిలోనే 39 బిలియన్ డాలర్లు అతని ఆస్తులకు యాడ్ అయ్యాయి. అదే సమయంలో మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్ 107 బిలియన్ డాలర్లు. ఫోర్బ్స్ మిలియనీర్ల జాబితాలో కూడా వీరి పేర్లు ఉన్నాయి. బ్లూంబర్గ్ విడుదల చేసిన ప్రపంచంలోని 500ల ధనికుల జాబితాలో ఒక వ్యక్తి ఒక ఏడాది సంపాదనలో టాప్‌ ప్లేస్‌లో నిలిచాడు అర్నాల్ట్.

అలా చేయకుంటే గేట్స్ టాప్

అలా చేయకుంటే గేట్స్ టాప్

అదే సమయంలో జెప్ బెజోస్ 125 బిలియన్ డాలర్లతో మొదటి స్థానంలో ఉన్నాడు. కాగా, బ్లూమ్‌బర్గ్ ఇండెక్స్ ప్రకారం బిల్ గేట్స్ కనుక తన ఆస్తులను దాతృత్వం కోసం ఇవ్వకుంటే ఇప్పటికీ ఆయనే మొదటి స్థానంలో ఉంటాడు. ఈ సాఫ్టువేర్ గురు (బిల్ గేట్స్) 35 బిలియన్ డాలర్లను దాతృత్వ కార్యకలాపాలకు వినియోగిస్తున్నాడు. తన బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్ కోసం డొనేట్ చేస్తున్నాడు. ఈ ముగ్గురు ఆస్తుల విలువతో ఎస్‌&పీలో నమోదైన 500 లిస్టెడ్ కంపెనీల ఆస్తులు కూడా సరితూగడం లేదని పేర్కొంది.

నాలుగో స్థానంలో మెకంజీ

నాలుగో స్థానంలో మెకంజీ

అమెరికా చీఫ్ జెఫ్ బెజోస్‌తో విడాకులు తీసుకున్న ఆయన మాజీ భార్య మెకంజీ ధనిక మహిళల జాబితాలో నాలుగో స్థానంలో ఉంది. ఆమె నికర ఆస్తులు 40.3 బిలియన్ డాలర్లుగా ఉంది. మొత్తంగా అయితే 22వ స్థానంలో ఉన్నారు. ప్రపంచంలో అత్యంత ధనిక మహిళ ఫ్రాంకోయిస్.

భారత్‌లో ముఖేష్ అంబానీయే టాప్

భారత్‌లో ముఖేష్ అంబానీయే టాప్

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ బారత్‌లో అత్యంత ధనికుడిగా నిలిచారు. ఆయన ఆస్తుల విలువ 51.8 బిలియన్ డాలర్లు. ప్రపంచవ్యాప్తంగా ఆయన 13వ స్థానంలో ఉన్నారు. ముఖేష్ అంబానీ స్థానంలో విప్రో అధినేత అజీమ్ ప్రేమ్ జీ 20.5 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో నిలిచారు. ప్రపంచవ్యాప్తంగా ఈయన 48వ ర్యాంకును కైవసం చేసుకున్నారు. HCL టెక్ శివనాడార్ 92వ స్థానంలో, కొటక్ మహీంద్రా ఎండీ ఉదయ్ కొటాక్ 96వ స్థానంలో ఉన్నాడు.

English summary

కుబేరుల్లో 3వ స్థానానికి పడిపోయిన బిల్ గేట్స్, 13వ స్థానంలో ముఖేష్ అంబానీ | LVMH boss Bernard Arnault overtakes Bill Gates as world's second richest person

Bill Gates is no longer the world's second richest person. That title now belongs to French billionaire Bernard Arnault.
Story first published: Thursday, July 18, 2019, 13:44 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X