వాషింగ్టన్: హెచ్1బీ వీసాతో అమెరికాలో పనిచేస్తున్న ఇండియన్ టెక్కీలకు శుభవార్త. ఇక నుంచి పర్మినెంట్ రెసిడెన్సీ స్టేటస్ కోసమిచ్చే గ్రీన్‌కార్డ్ వారికి మరింత సులువు కానుంది. ప్రతి ఏడాది 26 వేలమందికి గ్రీన్ కార్డ్ జారీ చేస్తోంది. ఈ కోటా కింద ఇప్పటి వరకు 7 శాతం హెచ్1బీ వీసా హోల్డర్స్‌కు ఇస్తోంది. ఇప్పుడు ఏడు శాతం నిబంధనను తొలగించడంతో ఈజీ కానుంది. గ్రీన్ కార్డు కోసం వివిధ దశల్లో ఎదురుచూస్తున్న వారికి ప్రాసెసింగ్ వేగవంతం కానుంది.

7 శాతంకు చెల్లుచీటి
అమెరికాలో 3,00,000 మంది ఇండియన్ H1B టెంపరరీ వర్క్ వీసా హోల్డర్స్ ఉన్నారు. ఇందులో చాలామంది గ్రీన్ కార్డ్ ప్రాసెస్ వివిధ దశల్లో ఉంది. ఓ ఏడాదిలో 7 శాతం మంది H1B హోల్డర్స్‌కు మాత్రమే గ్రీన్ కార్డ్ ఇచ్చే నిబంధన ఇప్పటి వరకు ఉంది. ప్రతి ఏటా అమెరికా ప్రభుత్వం 26వేల మందికి గ్రీన్ కార్డులు జారీ చేస్తుంది. ఏడు శాతం మందికి మాత్రమే గ్రీన్ కార్డు జారీ చేస్తుండటంతో భారతీయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అమెరికాలో శాశ్వత నివాస హోదా కోసం భారతీయులు 25 ఏళ్ల నుంచి 95 ఏళ్ల వరకు నిరీక్షించాల్సిన పరిస్థితులు ఉన్నాయని కొద్దికాలం క్రితం ఓ నివేదిక వెల్లడించింది.

85 శాతం, 90 శాతం వరకు ఇండియ్, చైనీయులకు
ఇటీవల అమెరికా 7 శాతం నిబంధనను తొలగించింది. కొత్త నిర్ణయాల ప్రకారం రానున్న రెండేళ్లలో వరుసగా 85 శాతం వరకు ఆంక్షలు ఉండవు. అంటే, రానున్న రెండేళ్లలో 85 శాతం వరకు భారతీయులు, చైనీయులకు ఇస్తారు. మూడో సంవత్సరం 90 శాతం కేటాయిస్తారు. అలాగే పెండింగులో ఉన్న దరఖాస్తులు తగ్గించాలని నిర్ణయించారు. ది ఫెయిర్‌నెస్ హైస్కిల్డ్ ఇమ్మిగ్రేషన్ చట్టం 2019 ప్రకారం పై నిబంధనలు తీసుకువచ్చారు.

ఐటీ కంపెనీల స్వాగతం
ఈ బిల్లును బుధవారం 435 సభ్యుల యూఎస్ హౌస్‍లో 365-65 ఓట్లతో బిల్లు పాస్ అయింది. హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఆమోదం లభించింది. సెనేట్ ఆమోదం అనంతరం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేయాలి. టాప్ ఐటీ కంపెనీలు అన్నీ కూడా ఈ బిల్లును స్వాగతిస్తున్నాయి. అమెజాన్, మైక్రోసాఫ్ట్ ఈ బిల్లును స్వాగతించాయి. ప్రతిభను ప్రోత్సహించడం బిజినెస్‌కు, ఆర్థిక వ్యవస్థకు మంచిదని మైక్రోసాఫ్ట్ ప్రెసిడెంట్ బ్రాడ్ స్మిత్ అన్నారు. బిల్లుకు మద్దతు తెలిపిన రిప్రజెంటేటివ్స్‌కు థ్యాంక్స్ అని అమెజాన్ ట్వీట్ చేసింది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?



Click it and Unblock the Notifications