For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెరిగిన కోడిగుడ్ల ధరలు, రిటైల్ మార్కెట్లో రూ.6 వరకు చేరిక

|

కోడి గుడ్ల ధరలు మళ్ళీ పెరిగాయి. సామాన్యుడి ఫేవరేట్ నాన్ వెజ్ ఐటెం ప్రియం ఐంది. రెండు నెలలుగా రూ 4 స్థాయిలో అందుబాటులో ఉన్న ధరలు మళ్ళీ అమాంతం పెరిగిపోయాయి. ప్రస్తుతం మార్కెట్లో రిటైల్ గుడ్డు ధర రూ 5.50 నుంచి రూ 6 పలుకుతోంది. వాతావరం చల్లబడటం తో పాటు ఉత్తరాది నుంచి డిమాండ్ పెరగడంతో ఆ ప్రభావం గుడ్ల ధరలపై పడిందని పౌల్ట్రీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. సహజంగా ఎండాకాలంలో కోడి గుడ్ల కు డిమాండ్ తగ్గుతుంది. మరీ ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో గుడ్ల వినియోగం అసాధారంగా తగ్గి పోతుంది. ఎండా కాలంలో గుడ్లను వినియోగించడం వాళ్ళ ఒంట్లో వేడి చేస్తుందని వారు నమ్ముతారు. అందుకే, ఒక్క సరిగా కోడిగుడ్లను డిమాండ్ పడిపోయి, ధరలు కూడా తగ్గుతాయని పౌల్ట్రీ నిపుణులు వెల్లడిస్తున్నారు.

రూ.500తో ఫ్లిప్‌కార్ట్ కోబ్రాండెడ్ క్రెడిట్ కార్డురూ.500తో ఫ్లిప్‌కార్ట్ కోబ్రాండెడ్ క్రెడిట్ కార్డు

ఫారం గాటు ధర తక్కువే...

ఫారం గాటు ధర తక్కువే...

నిజానికి ఫారం గేటు వద్ద కోడి గుడ్డు హైదరాబాద్ లో రూ 3.95 లభిస్తుండగా... హోల్సేల్ వ్యాపారాలు దానిని ఒక్కో గుడ్డుకు రూ 4.55 చొప్పున విక్రయిస్తున్నారు. ఇక కిరానా షాపులు, చికెన్ సెంటర్లు, ఇతరత్రా చిన్న షాపుల్లో కోడి గుడ్డును ఒక్కోటి రూ 5.50 నుంచి రూ 6 చొప్పున అమ్ముతున్నారు. వేసవి కాలంలో కోళ్ల మరణాలు అధికంగా ఉండంతో గుడ్ల ఉత్పత్తి తగ్గిపోయింది. అలాగే ఉన్న కోళ్లు సైతం తక్కువ దాణా తీసుకొని, ఎక్కువ నీటిని తీసుకొంటాయి. దీంతో కోడి గుడ్ల ఉతపట్టి ప్రభావితం అవుతుంది. అయితే, ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు కోడి గుడ్ల ఉత్పత్తికి అనుకూలంగా ఉన్నాయని పౌల్ట్రీ రైతులు వెల్లడిస్తున్నారు.

అధిక వినియోగం....

అధిక వినియోగం....

జూన్ నెల నుంచి పాఠశాలలు, కాలేజీలు తెరుచు కోవటం తో ఒక్క సరిగా కోడిగుడ్లను డిమాండ్ పెరుగుతుందని పౌల్ట్రీ అసోసియేషన్ వర్గాలు పేర్కొంటున్నారు. సహజంగానే ఈ సీజన్లో లంచ్ బాక్స్ లోకి ఎగ్ కర్రీ, ఉడికించిన కోడిగుడ్లను వాడతారని వివరణ ఇచ్చారు.

దేశం లో మూడో వంతు ఇక్కడే....

దేశం లో మూడో వంతు ఇక్కడే....

మొత్తం దేశంలో ఉత్పత్తి అయ్యో కోడిగుడ్లలో మూడో వంతు మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉత్పత్తి అవుతాయి. రోజుకు సగటున 25 కోట్ల కోడి గుడ్లు ఉత్పత్తి జరుగుతుండగా... అదే మోతాదులో వినియోగం కూడా ఉంటోంది. అంటే... దేశంలో రోజులు దాదాపు 25 కోట్ల కోడి గుడ్లు హాం ఫట్ అవుతున్నాయన్నమాట. మన తెలుగు రాష్ట్రాల్లో ఉత్పత్తి అయ్యే కోడిగుడ్లను సగం వరకు ఇక్కడే వినియోగిస్తుండగా... మిగితా సగం కోడిగుడ్లు వివిధ రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. ఉత్తరాది రాష్ట్రాలకు మన వద్ద నుంచి అధికంగా కోడిగుడ్లు ఎగుమతి అవుతాయి.

పెరుగుతున్న దాణా ఖర్చులు...

పెరుగుతున్న దాణా ఖర్చులు...

పౌల్ట్రీ రంగంలో దాణా ఖర్చులు అధికం అవుతున్నాయి. మొక్క జూన్న, సోయాబీన్ ధరలు అంతకంతకూ పెరుగుతుండటం తో ఆ ప్రభావం కోడిగుడ్ల ఉత్పత్తి వ్యయాలు పెరిగేందుకు కారణం అవుతోంది. అందుకే, మార్కెట్లో కోడిగుడ్ల ధరలు మెరుగ్గా ఉన్నప్పటికీ... పౌల్ట్రీ రైతులకు దక్కేది మాత్రం అంతంతే నాని వారు వాపోతున్నారు. ప్రభుత్వం ధరలను స్థిరీకరించాలని వారు కోరుకొంటున్నారు.

Read more about: egg markets market
English summary

పెరిగిన కోడిగుడ్ల ధరలు, రిటైల్ మార్కెట్లో రూ.6 వరకు చేరిక | Egg prices hike, Rs.6 in Retail markets

A crunch in supply, made more conspicuous by the sudden surge in demand, has led to a sharp hike in egg price across city markets.
Story first published: Monday, July 15, 2019, 13:08 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X