For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డెబిట్ కార్డులు 10 కోట్లు తగ్గాయ్ .. ఆ కార్డులే కారణం..

|

చలామణిలో ఉన్న డెబిట్ కార్డుల సంఖ్య భారీగా తగ్గి పోయింది. ఈ ఏడాది మార్చి నుంచి మే మధ్య కాలంలో డెబిట్ కార్డుల సంఖ్య దాదాపు 10 శాతం (10 కోట్లు) తగ్గిపోయింది. దీంతో మొత్తం కార్డుల సంఖ్య 92.4 కోట్ల నుంచి 82.4 కోట్లకు తగ్గింది. ఇందుకు కారణం ఏమిటంటే బ్యాంకులు పాత డెబిట్ కార్డుల స్థానంలో కొత్త మాగ్నెటిక్ స్ట్రిప్ ఆధారిత కార్డులను జారీ చేస్తున్నాయి. కాబట్టి పాత కార్డులు పని చేయడం లేదు. కొన్ని బ్యాంకులు తమ కస్టమర్లకు కొత్త కార్డులను ఇప్పటికే జారీ చేశాయి. మరి కొన్ని బ్యాంకులు ఈ కార్డుల జారీ ప్రక్రియను కొనసాగిస్తున్నాయి.

ఆ ఖాతాల్లో వేల కోట్లు... అలా పెరిగిపోతున్నాయ్..ఆ ఖాతాల్లో వేల కోట్లు... అలా పెరిగిపోతున్నాయ్..

Debit cards drop sharply by 10 crore in March - May

క్రెడిట్ కార్డులు పెరిగాయ్..

* క్రెడిట్ కార్డుల సంఖ్య క్రమంగా పెరిగిపోతోంది. మార్చి - మే మధ్యకాలంలో క్రెడిట్ కార్డుల సంఖ్య 10 లక్షలు పెరగడంతో మొత్తం కార్డుల సంఖ్య దాదాపు 5 కోట్ల స్థాయికి చేరుకుంది.

* మే నెలలో క్రెడిట్ కార్డుల సంఖ్య 3.86 కోట్ల నుంచి 4.89 కోట్లకు చేరుకుంది.

* క్రెడిట్ కార్డుల విషయంలో హెచ్ డీ ఎఫ్ సి బ్యాంక్ నెంబర్ వన్ స్థానంలో ఉంది. మే చివరి నాటికి ఈ బ్యాంకు క్రెడిట్ కార్డుల సంఖ్య 1.26 కోట్లుగా ఉంది. ఎస్ బీ ఐ 87 లక్షల కార్డులను జారీ చేసింది. యాక్సిస్ బ్యాంకు కార్డులు 62 లక్షలుగా ఉన్నాయి.

* పంజాబ్ నేషనల్ బ్యాంక్ డెబిట్ కార్డుల సంఖ్య 5.2 కోట్లు తగ్గింది. బ్యాంక్ అఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా కార్డుల సంఖ్య వరుసగా 2.2 కోట్లు, 1.9 కోట్లు తగ్గాయి.

*పాత కార్డుల స్థానంలో కొత్త కార్డులను జారీ చేస్తున్న కారణంగా మొత్తం కార్డుల సంఖ్య తగ్గినట్టు గణాంకాల ద్వారా తెలుస్తోందని.. కానీ కొత్త కార్డుల తాజా గణాంకాలు చూస్తే సంఖ్య పెరిగే అవకాశం ఉందని బ్యాంకింగ్ వర్గాలు చెబుతున్నాయి.

* క్రెడిట్ కార్డుల మాదిరిగా చిప్ కలిగిన డెబిట్ కార్డులను కస్టమర్లకు జారీ చేయాలని బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. ఈ కార్డుల ద్వారా లావాదేవీలు సురక్షితంగా నిర్వహించడానికి అవకాశం ఉంటుంది.

పీ ఓ ఎస్ లలో ఎక్కువగా వినియోగం

* వ్యాపారాలు, వ్యాపార సంస్థలు వినియోగించే పాయింట్ ఆఫ్ సేల్ (పీ ఓ ఎస్) యంత్రాల వద్ద క్రెడిట్ కార్డుల వినియోగం బాగా పెరిగిపోతోంది.

* గత మే నెలలో క్రెడిట్ కార్డు వినియోగదారులు 17. కోట్ల స్వైపింగ్స్ చేశారు. వీటి విలువ రూ. 61,300 కోట్లు.

* ఇదే కాలంలో ఏటీఎం లావాదేవీల విలువ రూ. 400 కోట్లుగా ఉంది.

* మార్చి నుంచి ఏప్రిల్ వరకు డెబిట్ కార్డుల ద్వారా ఏటీఎం లావాదేవీల సంఖ్య 89 కోట్ల నుంచి 81 కోట్లకు తగ్గిపోయింది.

English summary

డెబిట్ కార్డులు 10 కోట్లు తగ్గాయ్ .. ఆ కార్డులే కారణం.. | Debit cards drop sharply by 10 crore in March - May

Debit cards in circulation dropped by nearly 10%, or 10 crore cards, between March and May, declining from 92.4 crore to 82.4 crore as more banks replaced magnetic stripe based cards with chip-based versions.
Story first published: Monday, July 15, 2019, 7:59 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X