For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

'రుణాల విషయంలో జాగ్రత్తగా ఉంటున్నాం'

|

ముంబై: మూలధన సమీకరణకు యాక్సిస్ బ్యాంకు ఓ తీర్మానం చేసిందని యాక్సిస్ బ్యాంకు ఎండీ అండ్ సీఈవో అమితాబ్ చౌదరి ఓ టీవీ ఛానల్‌తో చెప్పారు. మూలధన సమీకరణకు ఎన్నో కారణాలు ఉంటాయని చెప్పారు. ఓవరాల్ కేపిటల్ రేషియో రైట్ లెవల్లో ఉందని చెప్పడానికి కూడా సమీకరించవచ్చునని చెప్పారు. ఆర్థిక వ్యవస్థలో కొత్త సమస్యలు కనిపిస్తున్నాయని, రుణాల పంపిణీ జాగ్రత్తగా వ్యవహరించాలని నిర్ణయించినట్లు చెప్పారు.

అమెరికా-భారత్ ట్రేడ్ టాక్స్: ట్రంప్ గేమ్ ఆడుతున్నారా, ఏం కోరుకుంటున్నారు?అమెరికా-భారత్ ట్రేడ్ టాక్స్: ట్రంప్ గేమ్ ఆడుతున్నారా, ఏం కోరుకుంటున్నారు?

రుణాల జారీ నెమ్మదించినందున...

రుణాల జారీ నెమ్మదించినందున...

ఓ వైపు అధిక NPAల సమస్య నుంచి బ్యాంకులు బయటపడుతూ, రుణాల జారీ నెమ్మదించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక రంగంలో ఏర్పడుతున్న పరిణామాలతో ఒత్తిళ్లకు సంబంధించి కొత్త సంకేతాలు కనిపిస్తున్నాయన్నారు. తాము జాగ్రత్తగా వ్యవహరిస్తున్నామని చెప్పారు. రియల్ ఎస్టేట్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు ఆందోళన కలిగిస్తున్న అంశాలు అన్నారు.

మంచి స్థితిలో ఎన్నో NBFC కంపెనీలు

మంచి స్థితిలో ఎన్నో NBFC కంపెనీలు

అయితే NBFCలోను ఎన్నో కంపెనీలు మంచి స్థితిలో ఉన్నాయని ఆయన చెప్పారు. తాము మరీ రిస్క్ చేయదలుచుకోవడం లేదని స్పష్టం చేశారు. తమ రిస్క్ నిర్వహణ విధానాలు సరిగ్గా ఉండాలని భావిస్తున్నామన్నారు. అదే సమయంలో తమ ప్రధాన వ్యాపార రిస్క్ తీసుకొని, రుణాలను ఇవ్వడాన్న బాగా తగ్గించుకుంటుందని భావించవద్దన్నారు.

సూక్ష్మ పరిశీలన

సూక్ష్మ పరిశీలన

NBFC సమస్యలు ఏడాది అవుతున్నా ఇంతవరకు పరిష్కారం లభించలేదని, కొన్ని కంపెనీలు బాగానే పని చేస్తున్నాయని, ఈ విషయంలో సూక్ష్మ పరిశీలన అవసరమన్నారు. ఇది వ్యవస్థాపరమైన అంశంగా మారుతుందని తాము భావించడం లేదన్నారు. ఇబ్బందులను అధిగమించేందుకు వ్యవస్థకు సమయం పడుతుందన్నారు.

English summary

'రుణాల విషయంలో జాగ్రత్తగా ఉంటున్నాం' | Axis Bank will look at raising capital when the right opportunity arises, says CEO

Axis Bank has taken an enabling resolution to raise capital. Amitabh Chaudhry, MD and CEO, Axis Bank says.
Story first published: Friday, July 12, 2019, 14:46 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X