For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అమ్మకానికి అనిల్ అంబానీ ఆస్తులు, రేటింగ్ మెరుగయ్యేనా?

|

అనిల్ అంబానీ రోడ్డు ప్రాజెక్టుల నుంచి రేడియో స్టేషన్ దాకా విక్రయించి, 3.2 బిలియన్ డాలర్ల మేర అంటే, రూ.21,700 కోట్లను సమీకరించి తన అప్పులను తగ్గించుకునేందుకు ప్లాన్ చేస్తోన్న విషయం తెలిసిందే. రిలయన్స్ ఇన్ఫ్రా ఆధీనంలోని 9 రోడ్డు ప్రాజెక్టుల విక్రయం ద్వారా రూ.9వేల కోట్లు, రిలయన్స్ కేపిటల్ రేడియో అమ్మకం ద్వారా రూ.1,200 కోట్లు, ఇతర వ్యాపారాల్లోని వాటాల అమ్మకం ద్వారా రూ.11,500 సమీకరించాలని భావిస్తోన్న విషయం తెలిసిందే. గత 14 నెలల్లో రూ.35వేల కోట్లు సమీకరించి, అప్పులు తీర్చినా 4 గ్రూప్ కంపెనీలకు ఇంకా రూ.93,900 కోట్ల రుణాలు ఉన్నాయి. విక్రయించి బయటపడాలని అనిల్ భావిస్తున్నారు.

వరుసగా ఆస్తులు విక్రయిస్తున్న అనిల్ అంబానీ, తాజాగా మరో దెబ్బవరుసగా ఆస్తులు విక్రయిస్తున్న అనిల్ అంబానీ, తాజాగా మరో దెబ్బ

ఏయే సంస్థకు ఏ మేర రుణాలు

ఏయే సంస్థకు ఏ మేర రుణాలు

రిలయన్స్ కేపిటల్ భారం రూ.38,900, రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రూ.17,800 కోట్లు, రిలయన్స్ నోవల్ అండ్ ఇంజినీరింగ్ రూ.7,000 కోట్లు, రిలయన్స్ పవర్ రూ.3,000 కోట్ల అప్పులు ఉన్నాయి. మొత్తంగా పెద్ద లిస్టెడ్ కంపెనీల రుణాలు 90వేల కోట్లకు పైగా ఉన్నాయి. ఆస్తులు విక్రయించి, రుణాలు చెల్లించడం ద్వారా క్రెడిట్ రేటింగ్స్ మెరుగుపడతాయని భావిస్తున్నారు.

తగ్గిన రేటింగ్స్

తగ్గిన రేటింగ్స్

వివిధ ఆస్తులు, వాటాలు విక్రయించడం ద్వారా వచ్చిన డబ్బుతో మొత్తం మీద గ్రూప్ కంపెనీల రుణాలు భారీగా తగ్గుతాయి. ఇది క్రెడిట్‌ రేటింగ్‌లు మెరుగయ్యేందుకు కొంత ఉపయోగపడుతుందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. రిలయన్స్‌ కేపిటల్ రేటింగ్‌ను బ్రిక్‌వర్క్ రేటింగ్స్‌ తగ్గించింది. ఇది కాకుండా కొన్ని లావాదేవీలపై గల అభ్యంతరాలకు సరైన స్పందన లభించలేదని ప్రైస్‌వాటర్‌ హౌస్‌కూపర్స్‌ ఆడిటర్ బాధ్యతల నుంచి తప్పుకుంది. కంపెనీ మాత్రం సరిగానే స్పందించామని చెప్పింది. రిలయన్స్ పవర్‌పై ఇక్రా ఆరు స్థానాల రేటింగ్ కోత వేసింది. రిలయన్స్ ఇన్ఫ్రాను డీ రేటింగ్‌కు తగ్గించింది.

ఇంటర్ క్రెడిటర్ అగ్రిమెంట్‌పై 16 సంస్థల సంతకాలు

ఇంటర్ క్రెడిటర్ అగ్రిమెంట్‌పై 16 సంస్థల సంతకాలు

మరోవైపు, రుణ పరిష్కార ఒప్పందం కోసం ఇంటర్ క్రెడిటర్ అగ్రిమెంట్ (ICA)పై 16 రుణసంస్థలు సంతకాలు చేశాయని రిలయన్స్ ఇన్ఫ్రా గురువారం వెల్లడించింది. 2020 నాటికి జీరో రుణాల స్థాయికి చేరుకోవాలని భావిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రిలయన్స్ ఇన్ఫ్రాకు రూ.5,900 కోట్ల వరకు అప్పులు ఉన్నాయి. రుణ పరిష్కారానికి 100 శాతం రుణ సంస్థలు అంగీకారం తెలిపినట్లు పేర్కొంది. రుణ పునర్‌వ్యవస్థీకరణ ప్రక్రియకు మొత్తం రుణ విలువలో 70 శాతం రుణాలు ఇచ్చిన సంస్థలు లేదా సంఖ్యాపరంగా 60 శాతం సంస్థలు ఇంటర్ క్రెడిటర్‌ అగ్రిమెంట్‌పై సంతకాలు చేయాల్సి ఉంటుందని ఆర్బీఐ జూన్ 7న జారీ చేసిన సర్క్యులర్ ద్వారా వెల్లడవుతోంది. ఈ సర్క్యులర్ ప్రకారం రుణ గ్రహీత ఏదేని రుణ సంస్థకు చెల్లింపుల్లో విఫలమైతే, ఆ రోజు నుంచి 30 రోజుల్లోగా రుణ ఖాతాను ఇతర రుణ సంస్థలు సమీక్ష చేయాల్సి ఉంటుంది. ఇదే సమీక్షాకాలం.

English summary

అమ్మకానికి అనిల్ అంబానీ ఆస్తులు, రేటింగ్ మెరుగయ్యేనా? | Anil Ambani plans Rs 21,700 crore asset sales to pare massive debt

Anil Ambani's major business interests in entertainment include 44 FM radio stations, nationwide DTH business, animation studios, and several multiplex cinemas throughout India.
Story first published: Friday, July 12, 2019, 9:32 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X