For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇంట్రెస్టింగ్: రుణాలు ఇచ్చేందుకు మాల్యాకు HDFC నో ఎలా చెప్పిందంటే?

|

న్యూఢిల్లీ: భారత్‌లోని వివిధ బ్యాంకుల నుంచి వేలకోట్ల రుణాలు తీసుకొని, వాటిని చెల్లించకుండా విజయ్ మాల్యా లండన్‌లో తలదాచుకుంటోన్న విషయం తెలిసిందే. ఆయనకు రుణాలు ఇచ్చి, తిరిగి చెల్లింపుల కోసం ఆయన వెంట పడుతున్నాయు వివిధ బ్యాంకులు. కానీ HDFC మాత్రం మాల్యాకు రుణం ఇవ్వలేదు. దీంతో ఆయన చుట్టు తిరిగే బాధలు తప్పాయి. ఇదే విషయాన్ని బ్యాంకు ఎండీ, సీఈవో ఆదిత్యపూరి సూచిస్తున్నారు.

రూ.13 లక్షల ఆదాయమున్నా ట్యాక్స్ చెల్లించక్కరలేదు!రూ.13 లక్షల ఆదాయమున్నా ట్యాక్స్ చెల్లించక్కరలేదు!

వృత్తిలోకి వ్యక్తిగత స్నేహం లాగొద్దు

వృత్తిలోకి వ్యక్తిగత స్నేహం లాగొద్దు

మన వ్యక్తిగత స్నేహాన్ని, బ్యాంకింగ్‌తో ముడిపెట్టవద్దని ఆదిత్యపూరి సూచనలు చేశారు. అంటే పర్సనల్ ఫ్రెండ్‌షిప్‌ను వృత్తిలోకి తీసుకు రావొద్దని హితవు పలికారు. ఈ నేపథ్యంలో ఆయన.. విజయ్ మాల్యాకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు రుణం ఎలా తిరస్కరించిందో వెల్లడించారు. ఓ బ్యాంకర్ ఓ వ్యక్తితో కలిసి కాఫీ తాగవచ్చునని కానీ మీరు ఏం అనుకుంటారో అదే చేయాలని వ్యాఖ్యానించారు. ఆదిత్య పూరి ప్రస్తుతం ప్రస్తుతం హెచ్‌డీఎఫ్‌సీ ఎండీ, సీఈవోగా ఉన్నారు.

మీరు రిస్క్ అయితే...

మీరు రిస్క్ అయితే...

తన చిరకాల మిత్రుడు పరేష్ సుక్తాంకర్ దీనినే ఆచరించారని ఆదిత్యపూరి చెప్పారు. మీరు నాకు ఎంతో మంచి స్నేహితుడు అయినప్పటికీ మీరు రిస్క్‌గా మారితే, మీకు ఓ కాఫీ ఇచ్చి పంపిస్తానని, అంతేకానీ అప్పు ఇవ్వడం మాత్రం నాకు రిస్కేనని ఆయన అన్నారు. అక్షరాలా మాల్యా విషయంలో ఇదే పాటించామని చెప్పారు. అసలేం జరిగిందో కూడా ఈ సందర్భంగా చెప్పారు.

కాఫీ ఇచ్చి పంపించా... తిరస్కరించారు

కాఫీ ఇచ్చి పంపించా... తిరస్కరించారు

విజయ్ మాల్యాకు సంబంధించిన వారు తన వద్దకు లోన్ కోసం వచ్చారని, వారికి తాను కాఫీ ఇచ్చానని, ఆ తర్వాత మీ లోన్ అంశాన్ని పరిశీలిస్తానని చెప్పి పంపించానని ఆదిత్య పూరి గుర్తు చేసుకున్నారు. అనంతరం వారి లోన్ విజ్ఞప్తి అంశాన్ని పరేష్ సుక్తాంకర్‌కు పంపించానని, ఆయనకు మాల్యా గురించి అర్థమై, దానిని తిరస్కరించారని చెప్పారు.

ఆదిత్యపూరిపై కోపంగా మాల్యా

ఆదిత్యపూరిపై కోపంగా మాల్యా

ఆ తర్వాత తనకు ఫోన్ కాల్ చేసిన ప్రతిసారి, తనతో మాల్యా కోపంగా మాట్లాడేవాడని ఆదిత్యపూరి గుర్తు చేసుకున్నారు. కానీ స్నేహం వేరు, బ్యాంకింగ్ (వృత్తి) వేరు అని, ఈ రెండింటిని జత చేయవద్దన్నారు. స్నేహం.. బ్యాంకింగ్ అనే రెండు కత్తులు ఒకే ఒరలో ఇమడవన్నారు. ప్రముఖ జర్నలిస్ట్ తమల్ బంధోపాద్యాయ రచించిన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మాట్లాడారు. కాగా, హెచ్‌డీఎఫ్‌సీ NPAల విషయంలో స్పష్టమైన విధానంతో ఉంది. అనందుకే ఎన్పీఏలు అతి తక్కువగా ఉన్నాయి. పదేళ్ల నుంచి నికర లాభాల్లో ఇరవై శాతం వృద్ధి ఉంది. 2019 మార్చి క్వార్టర్లో 23 శాతం వృద్ధి రేటు ఉంది.

English summary

ఇంట్రెస్టింగ్: రుణాలు ఇచ్చేందుకు మాల్యాకు HDFC నో ఎలా చెప్పిందంటే? | When HDFC Bank refused loan to Vijay Mallya

Noted banker Aditya Puri has advised his peers to clearly separate personal friendships from banking and cited how his bank turned down a loan request from the now fugitive businessman Vijay Mallya.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X