For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎయిర్‌టెల్, ఐడియా కంటే జియో ఆదాయమే ఎక్కువ!

|

2018-19 ఆర్థిక సంవత్సరంలోని నాలుగో క్వార్టర్ (జనవరి - మార్చి)లో రిలయన్స్ జియో రెవెన్యూ.. ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాల కంటే ఎక్కువగా ఉంది. ముఖేష్ అంబానీ నేతృత్వంలోని జియో అడ్జెస్టెడ్ గ్రాస్ రెవెన్యూ (AGR) 3.76 శాతం పెరిగి రూ.9,838.91గా ఉంది. భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా రెవెన్యూ వరుసగా 8.07 శాతం తగ్గి రూ.5,920.22 కోట్లు, 1.25 శాతం తగ్గి రూ.7,133.40 కోట్లుగా ఉంది.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు NPS బెనిఫిట్స్కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు NPS బెనిఫిట్స్

జియో క్వార్టర్ టు క్వార్టర్

జియో క్వార్టర్ టు క్వార్టర్

డిసెంబర్ త్రైమాసికంలో 14.63 శాతం వృద్ధి సాధించిన జియో క్వార్టర్ టు క్వార్టర్ పరంగా ఆశించిన వేగాన్ని అందుకోలేకపోయింది. డిసెంబర్ త్రైమాసికం కంటే జనవరి త్రైమాసికం గ్రోత్ రేట్ తక్కువగా ఉంది. 2019 ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌లో AGR పరంగా జియో లార్జెస్ట్ టెల్కో. సబ్‌స్క్రైబర్లను యాడ్ చేసుకుంటున్న వాటిల్లో జియో ముందుంది. ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా తమ కస్టమర్లను కోల్పోతున్నాయి.

ఆయా టెల్కోలకు యూజర్లు

ఆయా టెల్కోలకు యూజర్లు

ఏప్రిల్ చివరి నాటికి 315 మిలియన్ల జియో యూజర్లు ఉండగా, వొడాఫోన్ ఐడియాకు 393 మిలియన్ల యూజర్లు, భారతీ ఎయిర్‌టెల్‌కు 322 మిలియన్ యాజర్లు ఉన్నారు. ప్రభుత్వానికి చెందాల్సిన లైసెన్స్, ఇతర ఛార్జీల వాటా AGR ఆధారంగానే నిర్ణయం కానుండగా, మొత్తం టెలికం సర్వీసెస్ AGRలో యాక్సెస్ సేవల వాటా 72 శాతంగా ఉంది. టెలికం సెక్టార్ AGR అతి స్వల్పంగా 0.34 శాతం తగ్గి మార్చి క్వార్టర్‌లో రూ.35,932 కోట్లుగా ఉంది.

మార్చి క్వార్టర్‌లో లైసెన్స్ ఫీజు రూ.2,888 కోట్లు కాగా, అంతక్రితం త్రైమాసికంలో రూ.2,890 కోట్లుగా ఉంది.

స్వల్పంగా పడిపోయిన వసూళ్లు

స్వల్పంగా పడిపోయిన వసూళ్లు

మార్చి త్రైమాసికంలో లైసెన్స్ ఫీజు, వసూళ్లు స్వల్పంగా పడిపోయాయి. పోటీ తీవ్రత అధికంగా ఉండటం, పెరిగిన రుణస్థాయి, రుణ సర్వీసింగ్ కోసం మూలధన ఇన్ఫ్యూజన్‌పై పాత క్యారియర్‌ల కొనసాగింపు, టెలికం కంపెనీల మధ్య పోటీ కారణంగా వంటివి కారణాలు. కాగా, మార్చి త్రైమాసికంలో ఈ రంగ పనితీరుపై ట్రాయ్ నివేదిక విడుదల చేసింది. దీని ప్రకారం మార్చి చివరి నాటికి సబ్‌స్క్రైబర్ల సంఖ్య 118.35 కోట్లకు పడిపోయింది. ARPU వైర్‌లెస్ సేవల పరంగా మార్చి త్రైమాసికానికి 1.80 శాతం పెరిగి, రూ.71.39కి చేరుకుంది.

English summary

ఎయిర్‌టెల్, ఐడియా కంటే జియో ఆదాయమే ఎక్కువ! | Jio leads over Voda Idea, Airtel on revenue front in Jan-Mar quarter

Reliance Jio Infocomm consolidated its lead over the country's two older carriers on revenue in the March quarter, FY19, during which the government’s licence fee and spectrum usage charge (SUC) collections fell marginally sequentially, data collated by the telecom regulator showed.
Story first published: Thursday, July 11, 2019, 12:40 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X