For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రపంచకప్: ధోనీ బ్రాండ్ వ్యాల్యూ పెరగనుందా, జడెజా కొత్త హీరో

|

న్యూఢిల్లీ: ప్రపంచ కప్ 2019 సెమీ ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో భారత్ అనూహ్యంగా ఓటమిపాలైంది. భారత్ టాప్ ఆర్డర్ వికెట్లన్నీ టపటపా రాలిపోయాయి. దీంతో భారత్ 100 నుంచి 150 పరుగుల తేడాతో ఓడిపోతుందని అందరూ భావించారు. అదే సమయంలో కోట్లాది మంది భారతీయ అభిమానులకు ధోనీ ఉన్నాడనే విశ్వాసం. ఆ తర్వాత జడెజా రెచ్చిపోయి ఆడాడు. బెస్ట్ ఫినిషర్ ధోనీ మాత్రం అభిమానులు ఆశించిన మేర ఆకట్టుకోలేదు. కానీ మంచి స్టాండ్ ఇచ్చాడు. ఏడో వికెట్‌కు ధోనీ - జడెజాలు 100కు పైగా పరుగులు జోడించారు. దారుణ పరాభవం తప్పదనే స్థాయి నుంచి జడెజా దూకుడు, ధోనీ స్టాండింగ్ కారణంగా న్యూజిలాండ్ 18 పరుగుల తేడాతో గెలిచింది. దీంతో భారత్‌కు ఘోర పరాభవం తప్పింది.

ఫారెన్ ట్రిప్స్, కరెంట్ బిల్స్ ఎక్కువవైతే ఐటీఆర్ పైల్ చేయాలిఫారెన్ ట్రిప్స్, కరెంట్ బిల్స్ ఎక్కువవైతే ఐటీఆర్ పైల్ చేయాలి

ధోనీ-జడెజా బ్రాండ్ వ్యాల్యుపై ఎలా...

ధోనీ-జడెజా బ్రాండ్ వ్యాల్యుపై ఎలా...

ఈ ప్రపంచ కప్‌లో ధోనీ ఆటతీరు కారణంగా ఆయన త్వరలో రిటైర్మెంట్ ప్రకటించవచ్చుననే చర్చ సాగుతోంది. దీంతో పాటు ఆయన బ్రాండ్ పైన ఏ మేరకు ప్రభావం పడుతుందనే అంశంపైనా చర్చ సాగుతోంది. ముఖ్యంగా బుధవారం నాటి ధోనీ-జడెజా ఆటతీరు వారి బ్రాండ్స్ పైన ప్రభావం చూపిస్తుందని చెబుతున్నారు. ధోనీ ఆటతీరుపై కొందరు విమర్శలు గుప్పిస్తుండగా, మరికొందరు సమర్థిస్తున్నారు. జడెజాకు మాత్రం ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. వీరి బ్రాండ్ వ్యాల్యూ అంశంపై ఇంగ్లీష్ మీడియాలో ఓ కథనం వచ్చింది.

ధోనీ ఎప్పటికీ బ్రాండ్ అంబాసిడరే!

ధోనీ ఎప్పటికీ బ్రాండ్ అంబాసిడరే!

బ్రాండ్ ధోనీ గ్రేట్ అని, అది అలాగే ఉంటుందని, అతని వ్యూహాలు, సామర్థ్యం, ప్రశాంతచిత్తం, అతని ప్రదర్శననే అతనిని విన్నర్‌గా, లీడర్‌గా, చాంపియన్‌గా నిలుపుతుందని బ్రాండ్ ఎక్స్‌పర్ట్ సంసికా మార్కెటింగ్ కన్సల్టెంట్ జగదీప్ కపూర్ అన్నారు. ధోనీని బ్రాండ్‌గా చూపించేందుకు అన్ని కంపెనీలు ఇప్పటికీ ఆసక్తి చూపిస్తాయని అభిప్రాయపడ్డారు.

జడెజా

జడెజా

అదే సమయంలో జడెజాపై ప్రశంసలు కురిపించారు. ఇలాంటి ప్లేయర్స్ పట్ల కూడా బ్రాండ్స్ మొగ్గు చూపుతాయని, అతనిపై పెట్టుబడి పెట్టేందుకు ఇష్టపడతాయని చెప్పారు. జడెజా ఓ ఫైటర్ అని, గ్రేట్ బ్యాట్సుమెన్, గ్రేట్ ఫీల్డర్, గ్రేట్ బౌలర్, గ్రేట్ ఆల్ రౌండర్ అన్నారు. ఇలాంటి వ్యక్తిని తమ అంబాసిడర్‌గా బ్రాండ్స్ ఇష్టపడతాయని చెప్పారు. బుధవారం అతను ఆడిన మ్యాచ్.. ఓటమి దశలోను పోరాట పంథాను ఎంచుకున్నాడని, ఇలాంటి వారి పట్ల బ్రాండ్స్ ఆసక్తి చూపిస్తాయన్నారు.

ధోనీ తన ప్రయత్నం చేశారు

ధోనీ తన ప్రయత్నం చేశారు

స్ట్రాటెజిక్ బ్రాండ్ కన్సల్టెంట్ డైరెక్టర్ డింపుల్ గుప్తా మాట్లాడుతూ... జడెజా ఎప్పటికీ గుర్తుంచుకునే విధంగా ఆడాడని చెప్పారు. రోహిత్ శర్మ్, విరాట్ కోహ్లీ వంటి టాప్ ఆర్డర్ అవుటయ్యాక క్రికెట్ ఫ్యాన్స్ ఆశలు ధోనీ పైనే ఉన్నాయని గుర్తు చేశారు. ధోనీ తన ప్రయత్నాలు తాను చేశాడని చెప్పారు. మరికొన్ని ఓవర్లు ఉండి ఉంటే ఫలితం భిన్నంగా ఉండేదన్నారు. అయితే, జడెజా, జస్ప్రీత్ బూమ్రా వంటి వారు బ్రాండ్స్‌కు కొత్త ముఖాలు అవుతాయా అంటే.. కావొచ్చునని అభిప్రాయపడ్డారు. క్లిష్టపరిస్థితుల్లో బాగా ఆడేవారిపట్ల కూడా బ్రాండ్స్ ఆసక్తి కనబరుస్తాయన్నారు.

ధోనీ రిటైర్మెంట్‌కు సమయం వచ్చిందా?

ధోనీ రిటైర్మెంట్‌కు సమయం వచ్చిందా?

ధోనీ రిటైర్మెంట్ ప్రకటించేందుకు ఇదే సమయమని ఇండస్ట్రీలోని ఓ సీనియర్ వ్యాఖ్యానించారట. వయస్సు పెరిగిందని, ఇదే మేజర్ ఫ్యాక్టర్ అంటున్నారు. ఆటకు ఫిట్‌నెస్ ఎంతో ముఖ్యమన్నారు. ఇక, బ్రాండ్స్ కూడా రవీంద్ర జడెజా, జస్ప్రీత్ బూమ్రా వంటి వారి వైపు చూడవచ్చునని చెప్పారు. బుధవారం నాటి అతని ప్రదర్శన బాగానే ఉందని, అందుకే బ్రాండ్స్ అతని పట్ల ఆసక్తి కనబరుస్తాయని చెబుతున్నారు. ఏళ్ళుగా అతను వివిధ బ్రాండ్స్‌తో కలిసి పని చేశారు. కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఆటోమొబైల్స్, రిటైల్, లైఫ్ ఇన్సురెన్స్ తదితర బ్రాండ్స్‌తో కలిసి పని చేశారు.

మోస్ట్ ఇన్‌ఫ్లుయెన్స్ స్పోర్ట్స్ పర్సనాలిటీ

మోస్ట్ ఇన్‌ఫ్లుయెన్స్ స్పోర్ట్స్ పర్సనాలిటీ

ధోనీ వరల్డ్ బెస్ట్ క్రికెటర్‌లలో ఒకరు. వరల్డ్ మోస్ట్ ఇన్‌ఫ్లూయెన్స్ స్పోర్ట్స్ పర్సనాలిటీస్‌లలో ముందుంటాడు. 2016 ఫోర్బ్స్ లిస్ట్‌లో 10వ స్థానంలో నిలిచాడు. 2016లో ధోనీ నెట్ వర్త్ 31 మిలియన్ డాలర్లు. సమాచారం మేరకు అతను రూ.8 కోట్ల నుంచి రూ.12 కోట్లు తీసుకున్నాడు. ఏటా అతని సంపాదన రూ.120 కోట్ల నుంచి రూ.150 కోట్లుగా ఉంటుందని అంచనా. స్నిక్కర్స్, డ్రీమ్ 11, శాంసంగ్, బూస్ట్, లావా, ఓరియెంట్, డాబుర్ వంటి ఎన్నో కంపెనీలకు ఎండోర్స్ చేసారు. పెప్సీకి ధోనీ 11 ఏళ్లపాటు అంబాసిడర్‌గా ఉన్నాడు. 2005 నుంచి అతను ఈ కంపెనీతో కలిసి పని చేశాడు.

English summary

ప్రపంచకప్: ధోనీ బ్రాండ్ వ్యాల్యూ పెరగనుందా, జడెజా కొత్త హీరో | Dhoni and Jadeja's brand value soars as India go down fighting in World Cup

Dhoni’s run out shocked fans the most. Many of the dejected supporters took to their social media handle to express sadness and anger, criticising the former skipper for being too slow.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X