For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కార్పొరేట్ టాక్స్ తగ్గింపు ... మెరుగైన వృద్ధికి ఊతం?

By Jai
|

ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్.. బడ్జెట్ ప్రతిపాదనల్లో ప్రధానమైనది కార్పొరేట్ టాక్స్ 25% నికి తగ్గింపు. సుదీర్ఘ కాలంగా భారత కార్పొరేట్ రంగం దీనిని ప్రతిపాదిస్తోంది. కొన్నేళ్ల క్రితమే కార్పొరేట్ పన్ను రేటును క్రమంగా 25% నికి తగ్గించాలన్నది భారత ప్రభుత్వ యోచన. అయితే అమలులో మాత్రం దాని ప్రభావం ఇప్పటి వరకు తక్కువేనని చెప్పాలి. కానీ ఈ బడ్జెట్ ద్వారా ... ఆర్ధిక మంత్రి ఈ దిశగా పూర్తి స్పష్టతను ఇవ్వడం శుభసూచకమే. ఇప్పటి వరకు రూ 250 కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీలకు పరిమితంగా ఈ టాక్స్ రేటు వర్తిస్తోంది. అయితే, దాని పై రకరకాల సెస్సులు, సర్చార్జీలు బడటంతో పెద్దగా ప్రయోజం కనిపించే లేదు.

ఈ బడ్జెట్ ప్రభావం మీపై ఎలా ఉంటుంది.. ఇవి తెలుసుకోండిఈ బడ్జెట్ ప్రభావం మీపై ఎలా ఉంటుంది.. ఇవి తెలుసుకోండి

99 శాతం కంపెనీలను 25% పన్ను..

99 శాతం కంపెనీలను 25% పన్ను..

భారత దేశంలో సుమారు పాతిక లక్షలకు పైగా రిజిస్టర్డ్ కంపెనీలు ఉన్నాయి. దాదాపు 7,000 కంపెనీలు స్టాక్ మార్కెట్లలో నమోదయ్యాయి. నిర్మల సీతారామన్ కొత్తగా ప్రతిపాదించిన పన్ను వాళ్ళ దాదాపు 99.3% కంపెనీలు దీంతో లబ్ది పొందనున్నాయి. రూ 400 కోట్ల టర్నోవర్ వరకు అన్ని కంపెనీలు కేవలం 25% పన్ను చెల్లిస్తే సరిపోతుంది. ప్రస్తుత పన్ను రేటుతో పోల్చితే కనీసం 7-8% వరకు పన్ను రేటు వాళ్ళ మేలు జరుగుతుంది. ఒక వేళా సర్చార్జీలు, సెస్సులు కలిపినా కూడా 30% లోపు కార్పొరేట్ టాక్స్ ఉన్నట్లు అవుతుంది. తద్వారా దాదాపు ప్రతి కంపెనీకి నికర లాభం పెరిగే అవకాశం ఉంటుంది.

ఆర్ధిక వ్యవస్థపై సానుకూల ప్రభావం...

ఆర్ధిక వ్యవస్థపై సానుకూల ప్రభావం...

ఇటీవల కాలంలో మందగిస్తున్న ఆర్ధిక వ్యవస్థకు చెక్ పెట్టడం తో పాటు, దీర్ఘకాలం లో కార్పొరేట్ టాక్స్ తగ్గింపు వాళ్ళ సానుకూల ఫలితాలు వస్తాయండం లో ఎలాంటి సందేహాలు అక్కరలేదు. ఎందుకంటే, కార్పొరేట్ కంపెనీలకు అధిక లాభాదాకత ఉంటె, అవి కొత్త మూలధన పెట్టుబడులకు దోహద పడతాయి. తద్వారా మరింత ఎక్కువ మందికి ఉపాధి లభిస్తుంది. అది వినియోంగాన్ని పెంచుతుంది. ఇలా ఆర్థిక వ్యవస్థ గొలుసు పటిష్టమవుతుంది. అంతే కాకుండా భారత కంపెనీలు ప్రపంచ విపణిలో పోటీపడి గెలవాలంటే వాటికి ఆర్ధిక బలం ఎంతైనా అవసరం. కార్పొరేట్ టాక్స్ తగ్గింపు ఫలితమే రెండేళ్లలోనే స్పష్టంగా కనిపించనుంది. ఆ మేరకు మన కంపెనీలు అన్ని రంగాల్లోనూ దూసుకుపోవటం ఖాయంగా కనిపిస్తోంది.

విదేశీ పెట్టుబడులకు ఊతం...

విదేశీ పెట్టుబడులకు ఊతం...

తక్కువ కార్పొరేట్ టాక్స్ ఉన్న దేశాల్లో పెట్టుబడులకు విదేశీ సంస్థలు అధికంగా పెట్టుబడులు పెడతాయి. ఇప్పటికే భారత్ ఆర్ధిక సంస్కరణల్లో భాగంగా మెరుగైన విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తోంది. చైనా తో పోల్చితే ఇది తక్కువైనప్పటికీ.... గతంతో పోల్చే బాగా మెరుగైనట్లేనని చెప్పొచ్చు. కార్పొరేట్ టాక్స్ ప్రయోజనాలను పూర్తి స్థాయిలో ఉపయోగించుకొనేందుకు విదేశీ కంపెనీలు కొత్త మార్గాలను కూడా అన్వేషింశే అవకాశం ఉంది. ఒకే కంపెనీ తో భారీగా టర్నోవర్ సంధించే బదులు ఎక్కువ అనుబంధ కంపెనీలను నెలకొల్పే సూచనలు ఉన్నాయి. ఈ సూత్రం కేవలం విదేశీ కంపెనీలకే కాకుండా ... భారత కంపెనీలకు కూడా వర్తిస్తుంది. కొత్త ప్రాజెక్టులను అనుబంధ సంస్థల ద్వారా చేపట్టే అవకాశం అధికంగా ఉంటుందని టాక్స్ నిపుణులు పేర్కొంటున్నారు.

స్టార్టప్ కంపెనీలకూ ప్రయోజనమే...

స్టార్టప్ కంపెనీలకూ ప్రయోజనమే...

ఇప్పటికె స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించేందుకు చాలా నిర్ణయాలు తీసుకొన్న సర్కారు... ఇక ముందు కూడా మెరుగైన ప్రోత్సహాన్ని అందించనుంది. ఏంజెల్ టాక్స్ రద్దు తో పాటు, స్టార్టుప్ వాల్యుయేషన్ పై ఎలాంటి ప్రశ్నలు ఉండవని, స్టార్టప్ లో పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లకు వేధింపులు అసలు ఉండబోవని... పన్ను చెల్లింపుల విషయంలో కూడా ఆదాయ పన్ను శాఖ ఉదార స్వభావం చూపుతుందని పాల్మెన్ట్ సాక్షిగా నిర్మల సీతారామన్ చెప్పారు. దీనికి తోడు కార్పొరేట్ టాక్స్ తగ్గింపు వాళ్ళ ఈటెల కాలంలో వాల్యుయేషన్ పరంగా యునికార్న్ సంస్థలుగా ఆవిర్భవించిన వాటికి, కొత్తగా క్లబ్ లో చేరే ప్రాసెస్ లో ఉన్న విజయమంతమైన స్టార్టుప్ కంపెనీలకు కూడా టాక్స్ తగ్గింపు ఆశ దీపంగా కనిపించనుంది. చాల స్టార్టుప్ కంపెనీలు నష్టాల్లోనే ఉన్నప్పటికీ... వచ్చే 2-3 ఏళ్లలో పెద్ద ఎత్తున స్టార్టుప్ కంపెనీలు లాభాల బాటనా పయనించే అవకాశం ఉన్నట్లు ఏంజెల్ ఇన్వెటర్లు చెబుతున్నారు. మొత్తంగా అన్ని రకాల కంపెనీలకు, అలాగే ఆర్ధిక వ్యవస్థకు కార్పొరేట్ టాక్స్ తగ్గింపు వాళ్ళ ప్రయోజనం కలగనుందన్నమాట.

English summary

కార్పొరేట్ టాక్స్ తగ్గింపు ... మెరుగైన వృద్ధికి ఊతం? | Corporate tax proposals to fuel new India

Finance minister Nirmala Sitharaman presented her maiden budget amidst soaring expectations of reviving investment sentiment, accelerating economic growth as well as providing tax incentives and rate cuts.
Story first published: Tuesday, July 9, 2019, 12:16 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X