For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పింక్ స్లిప్ ఇచ్చి హగ్‌తో ఓదార్చి క్యాబ్ ఇచ్చి పంపారు

By Chanakya
|

డాయిష్ బ్యాంక్. ప్రపంచంలోని అతిపెద్ద ఫైనాన్షియల్ సంస్థల్లో ఒకటి. జర్మనీకి చెందిన ఈ ప్రముఖ బ్యాంక్ ఇప్పుడు భారీ ఎత్తున ఉద్యోగులను తీసేస్తోంది. సింపుల్‌గా చేతిలో ఓ లెటర్ పెట్టి, హగ్ ఇచ్చి వాళ్లే క్యాబ్ బుక్ చేసి మరీ ఇంటికి పంపుతున్నాయి. ముఖ్యంగా సింగపూర్, హాంకాంగ్‌తో పాటు ఇండియాలోని చాలాచోట్ల ఇదే ఉద్యోగుల దుస్థితి. భారీ పునర్ వ్యవస్థీకరణ నేపధ్యంలో కంపెనీ తీసుకున్న అనేక చర్యలు రాబోయే రోజుల్లో సుమారు 18000 మంది ఉద్యోగులకు షాక్ ఇవ్వబోతున్నాయి.

ట్రేడింగ్ బంద్
డాయిష్ బ్యాంక్‌కు చెందిన ప్రధాన డివిజన్లు అయిన ఈక్విటీస్, ట్రేడింగ్ బిజినెస్‌లలో పెద్ద ఎత్తున అనేక డివిజన్లను తొలగిస్తోంది కంపెనీ. ముఖ్యంగా సిడ్నీ, హాంకాంగ్‌ యూనిట్లతో పాటు ఇండియాలోని బెంగళూరు వంటి ప్రాంతాల్లోనూ ఇదే స్థితి నెలకొందని ఉద్యోగులు భోరుమంటున్నారు. బోర్డ్ మీటింగ్ పూర్తైన తర్వాత గంటల వ్యవధిలోనే అనేక మంది ఉద్యోగులకు పింక్ స్లిప్ ఎన్వలప్ ఇవ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇంకా అనేక మంది ఉద్యోగుల డిసిగ్నేషన్స్ తగ్గించడం, అదనపు బాధ్యతలను కేటాయించడం కూడా ఆందోళనకు కారణమైంది. శాలరీ ప్యాకేజీల్లో కూడా కోత విధిస్తున్నట్టు చాలా మంది ఉద్యోగులకు మెయిల్స్ అందినట్టు తెలుస్తోంది. కొన్ని డిపార్ట్‌మెంట్లను ఏకంగా శాశ్వత ప్రతిపాదికన తొలగించాలని నిర్ణయం తీసుకోవడం కూడా ఈక్విటీ కమ్యూనిటీని ఆశ్చర్యపరుస్తోంది. ప్రపంచ వృద్ధి మందగిస్తున్న ఈ తరుణంలో ఆర్థిక వ్యవస్థపై నమ్మకం సడలేలా ఇలాంటి ఉద్యోగాల తొలగింపు ఆందోళనను రెట్టింపు చేస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

Bankers sent home as Deutsche starts slashing jobs

18 వేల మంది టార్గెట్
ఈక్విటీ, ట్రేడింగ్ విభాగాలను టార్గెట్ చేసిన డాయిష్ యాజమాన్యం దేశవ్యాప్తంగా వీటిని పూర్తిగా మూసేయాలని చూస్తోంది. బ్యాంక్ ఉద్యోగాల్లో కూడా ఆటోమేషన్ ద్వారా సుమారు 18 వేల మందిని ఇంటికి పంపాలని యోచిస్తోంది. అయితే వివిధ శాఖలను కత్తిరించిన తర్వాత కస్టమర్లు ఇంకా డాయిష్‌తో కొనసాగాలని ఎందుకు భావిస్తారని, ఉన్నవాళ్లు కూడా వెళ్లిపోతే మిగిలిన విభాగాలపై కూడా ప్రభావం పడి మొత్తం బ్యాంకు మనుగడకే ప్రమాదమని భావిస్తున్నారు. మొత్తానికి జర్మన్ దిగ్గజం డాయిష్‌లో జరుగుతున్న పరిణామాలను ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు తీక్షణంగా పరిశీలిస్తున్నాయి. రాబోయే ఆర్థిక మాంద్యానికి ఇది సంకేతమా అనే ఆలోచనలో పడ్డాయి.

గుజరాత్ గిఫ్ట్ సిటీకి బడ్జెట్లో భారీ గిఫ్టులు !గుజరాత్ గిఫ్ట్ సిటీకి బడ్జెట్లో భారీ గిఫ్టులు !

English summary

పింక్ స్లిప్ ఇచ్చి హగ్‌తో ఓదార్చి క్యాబ్ ఇచ్చి పంపారు | Bankers sent home as Deutsche starts slashing jobs

Summoned by HR to be handed a Deutsche Bank envelope, many of its staff across the world then left their desks for the last time on Monday, shown the door by their German employer within hours of a restructuring announcement.
Story first published: Tuesday, July 9, 2019, 14:05 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X