For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బడ్జెట్ ఎఫెక్ట్: భారీగా పతనమైన మార్కెట్లు, 800 పాయింట్లకు పైగా నష్టపోయిన సెన్సెక్స్

|

ముంబై: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం (జూలై 5) ప్రవేశ పెట్టిన బడ్జెట్ ప్రభావం నేటి (సోమవారం 8, జూలై) మార్కెట్ పైన పడింది. కేంద్ర బడ్జెట్ ప్రతికూలతలకు తోడు ఆసియా మార్కెట్ల బలహీన సంకేతాల కారణంగా మన మార్కెట్లు ఈ వారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఇవే కాకుండా ఏప్రిల్ - జూన్ త్రైమాసిక ఫలితాలపై దృష్టిపెట్టి ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తుండటం మార్కెట్‌పై ప్రభావం పడింది.

ఆరంభంలోనే సూచీలు కుప్పకూలాయి. మార్కెట్ ప్రారంభంలో బీఎస్ఈ సెన్సెక్స్ 400 పాయింట్లకు పైగా పతనమైంది. ఎన్ఎస్ఈ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 11,700 మార్కును కోల్పోయింది. ఉదయం పది గంటలకు ముందు సెన్సెక్స్ 402 పాయింట్లు నష్టపోయి 39,111 వద్ద, నిఫ్టీ 123 పాయింట్లు కోల్పోయి 11,687 వద్ద ట్రేడ్ అయింది. ఓ దశలో సెన్సెక్స్ 600 పాయింట్లు నష్టపోయింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 68.58గా ట్రేడ్ అయింది. ఆటో షేర్లు నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి.
ఆసియా మార్కెట్లు రెండు శాతం పడిపోయాయి.

Sensex tanks 600 points: five factors that dragged the market

ఉదయం గం.10.47 ని.లకు బీఎస్ఈ సెన్సెక్స్ 480.34 లేదా 1.22 శాతం పడిపోయి 39,033.05 గా ఉంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 150.95 పాయింట్లు లేదా 1.28 శాతం నష్టపోయి 11,660.20 వద్ద ట్రేడ్ అయింది. ఉదయం నుంచే మార్కెట్లు ఒత్తిడిలో ఉన్నాయి. సాయంత్రానికి సెన్సెక్స్ 800 పాయింట్లకు పైగా నష్టపోయింది. నిఫ్టీ 250 పాయింట్లకు పైగా నష్టపోయింది. కేంద్ర బడ్జెట్ ఇన్వెస్టర్లను తీవ్రంగా నిరాశపరిచింది. దశాబ్ద కాలంలో ఇంత దారుణంగా పడిపోవడం ఇది రెండోసారి.

మధ్యాహ్న సమయానికి.. యస్ బ్యాంకు 4.4 శాతం లాభపడింది. భారతీ ఇన్‌ఫ్రాటెల్, హెచ్‌సీఎల్ టెక్, సన్ ఫార్మా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ కూడా లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. హీరో మోటో కార్ప్ 5 శాతం నష్టపోయింది. మారుతీ సుజుకీ ఇండియా 2.8 శాతం, టాటా మోటార్స్ లిమిటెడ్ 2.6 శాతం, బజాజ్ ఆటో 2 శాతం, మహింద్రా అండ్ మహింద్రా 1 శాతం నష్టపోయింది. మార్కెట్లు నష్టాల బాటపట్టడానికి పలు కారణాలు ఉన్నాయి.

లిస్టెడ్ కంపెనీలో మినిమం పబ్లిక్ షేర్ హోల్డింగ్ 25 శాతం నుంచి 35 శాతానికి పెంచుతున్నట్లు బడ్జెట్‌లో పేర్కొన్నారు. ఈ ప్రభావం మార్కెట్లపై కనిపించింది. ఇలాంటివి అమలు చేసేందుకు ఏడాది రెండేళ్లు పట్టవచ్చు. ఇందుకు సెబీ ఏ విధంగా ముందుకు వెళ్తుందనే అంశంపై ఆధారపడి ఉంటుంది. ఇది కాకుండా బైబ్యాక్ కేసుల్లో 20 సాతం ట్యాక్స్ ప్రతిపాదన చేశారు. అలాగే, ఆసియా మార్కెట్ల ప్రభావం పడింది.

షాంఘై కాంపోసిట్ ఇండెక్స్ 2.5 శాతం నష్టపోయింది. హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్ సెంగ్, దక్షిణ కొరియా కోస్పి 1.8 శాతం పడిపోయింది. జపాన్ నిక్కీ 1.01 శాతం, తైవాన్ టైయెక్స్ 0.53 శాతం నష్టపోయింది. మరోవైపు, డాలర్‌తో రూపాయి విలువ 21 పైసలు పడిపోయింది, క్రూడాయిల్ ధర పది శాతం పెరిగింది. ఈ ప్రభావం మార్కెట్ల పైన పడింది.

English summary

బడ్జెట్ ఎఫెక్ట్: భారీగా పతనమైన మార్కెట్లు, 800 పాయింట్లకు పైగా నష్టపోయిన సెన్సెక్స్ | Sensex tanks 600 points: five factors that dragged the market

Benchmark equity indices opened weak on Monday, as Dalal Street continued to react to Budget fine prints even as stronger jobs data in the US dashed hopes of aggressive rate cuts by the US Fed and geopolitical tensions in West Asia triggered a spike in crude oil prices, driving the rupee lower.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X