For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వరుసగా ఐదో నెల తగ్గిన మారుతీ ఉత్పత్తి, 15.6 శాతం తగ్గిన కార్లు

|

మారుతీ సుజుకీ ఇండియా వాహనాల ఉత్పత్తి వరుసగా అయిదో నెల తగ్గింది. ఆటోమొబైల్స్ సేల్స్ క్రమంగా తగ్గుతోన్న విషయం తెలిసిందే. ముఖ్యమంగా పాసింజర్ కారు కేటగిరీ సేల్స్ భారీగా పడిపోయాయి. దీంతో ఈ వాహనాల ఉత్పత్తిని తగ్గించింది. గత ఏడాదితో పోల్చితే పాసింజర్ కారు కేటగిరీ వాహనాల ఉత్పత్తి తగ్గింది.

<strong>జూలై1 నుంచే మార్పు.. రైల్వే టైంటేబుల్, RTGS-NEFT ఛార్జీలు</strong>జూలై1 నుంచే మార్పు.. రైల్వే టైంటేబుల్, RTGS-NEFT ఛార్జీలు

తగ్గిన మారుతీ సుజుకీ ఉత్పత్తి

తగ్గిన మారుతీ సుజుకీ ఉత్పత్తి

2018 జూన్ నెలలో పాసింజర్ కారు కేటగిరీ వాహనాల ఉత్పత్తి 1,31,068 ఉండగా, ఈ ఏడాది జూన్ నెలలో కేవలం 1,09,641 మాత్రమే ఉత్పత్తి చేసింది మారుతీ సుజుకీ ఇండియా. అంటే గత ఏడాదితో పోలిస్తే ఈ ఉత్పత్తి 16.34 శాతం తగ్గింది. గత ఏడాది జూన్ నెలలో ఆల్టో వంటి చిన్న కార్లను 29,131 ఉత్పత్తి చేస్తే, ఈ ఏడాది జూన్‌లో 15,087 మాత్రమే ఉత్పత్తి చేసింది. ఇది ఏకంగా 48.2 శాతం పడిపోయింది.

భారీ కోత

భారీ కోత

ఇక కాంపాక్ట్ సెగ్మెంట్ స్విఫ్ట్, వాగన్ ఆర్, డిజైర్ కార్ల ప్రొడక్షన్ గత ఏడాది కంటే 1.46 శాతం మాత్రమే తగ్గింది. గత ఏడాది జూన్ నెలలో వీటి ఉత్పత్తి 67,426 ఉండగా, ఈ ఏడాది 66,436గా ఉంది. యుటిలిటీ వెహికిల్ సెగ్మెంట్‌లో కొన్నాళ్ల క్రితం వరకు మంచి వృద్ధి ఉంది. కానీ ఇప్పుడు ఈ వాహనాల ఉత్పత్తి కూడా 5.26 శాతం కోత పడింది. గత ఏడాది 18,023 యూనిట్లు ఉత్పత్తి చేయగా, ఈ ఏడాది 17,074లకు పరిమితమైంది. వ్యాన్ల ఉత్పత్తిలో 27.87 శాతం కోత విధించి, 8,501లకు పరిమితమైంది.

ఏ నెలలో ఎంత తగ్గిందంటే

ఏ నెలలో ఎంత తగ్గిందంటే

మొత్తంగా మారుతీ సుజుకీ కార్ల ఉత్పత్తి ఈ కేలండర్ ఇయర్‌లో క్రమంగా తగ్గుతోంది. ఫిబ్రవరిలో 8 శాతం, మార్చిలో 20.9 శాతం, ఏప్రిల్‌లో 10 శాతం, మేలో 18 శాతం ఉత్పత్తి తగ్గించింది. మొత్తంగా గత ఏడాది జూన్ నెలలో మొత్తం 1,32,616 వాహనాలను ఉత్పత్తి చేసిన మారుతీ సుజుకీ ఇండియా, ఈ ఏడాది జూన్‌లో 15.6% తగ్గించి 1,11,917 వాహనాలను మాత్రమే తీసుకు వచ్చింది.

తగ్గిన ఆటో అమ్మకాలు

తగ్గిన ఆటో అమ్మకాలు

ఆర్థిక రంగం అంతంతగా ఉండటం, మరోవైపు వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటంతో ఆటోమొబైల్ సంస్థల అమ్మకాలు తగ్గాయి. మారుతి సుజుకీ, పాటు మహీంద్రా అండ్‌ మహీంద్రా, టాటా మోటర్స్ వంటి కంపెనీలు కూడా డిమాండ్‌ లేకపోవడంతో ఉత్పత్తిని తగ్గించాయి. మే నెలలో మొత్తం ప్యాసింజర్ వాహన అమ్మకాలు పద్దెనిమిదేళ్ల కనిష్టానికి పడిపోయాయి. సెప్టెంబర్ 2001 తర్వాత వాహన విక్రయాలో ఇంత తగ్గడం ఇదే మొదటిసారి. ఇదిలా ఉండగా, మార్కెట్లో మారుతి సుజుకీ షేర్లు సోమవారం ఉదయం నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి.

English summary

వరుసగా ఐదో నెల తగ్గిన మారుతీ ఉత్పత్తి, 15.6 శాతం తగ్గిన కార్లు | Amid declining sales, Maruti cuts production in June for fifth month in a row

The month of June witnessed a drop in the vehicle production by Maruti Suzuki India making it the fifth consecutive month the company is resorting to cut in production.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X