For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎలక్ట్రిక్ కార్లు కొంటే రూ.1.5 లక్ష ప్రయోజనం

By Chanakya
|

విద్యుత్ వాహనాలను ప్రోత్సహించేందుకు కేంద్రం అద్భుతమైన పథకాన్ని ప్రవేశపెట్టింది. దేశంలో కాలుష్యాన్ని నియంత్రించేందుకు, పెట్రోల్ - డీజిల్ వాహనాల వాడకాన్ని తగ్గించేందుకు మంచి ప్రోత్సాహాన్ని ప్రకటించింది. ఎవరైనా రుణంపై ఎలక్ట్రిక్ వాహనాన్ని కొనుగోలు చేస్తే, దానిపై కట్టే వడ్డీలో రూ.1.5 లక్షను ఆదాయపు పన్ను మినహాయింపును ఇవ్వబోతున్నారు.

బడ్జెట్ ఎఫెక్ట్: పెరగనున్న పెట్రోల్-డీజిల్ ధరలు, ప్రభుత్వానికి ఇలా ప్రయోజనం..బడ్జెట్ ఎఫెక్ట్: పెరగనున్న పెట్రోల్-డీజిల్ ధరలు, ప్రభుత్వానికి ఇలా ప్రయోజనం..

 ఎంత ప్రయోజనం

ఎంత ప్రయోజనం

మీరు ఎలక్ట్రిక్ వాహనాన్ని లోన్ ద్వారా తీసుకున్నారని అనుకుందాం. దానిపై మీరు నెలనెలా ఈఎంఐ కడ్తారు. అందులో ప్రిన్సిపుల్ అమౌంట్‌తో పాటు వడ్డీ కూడా ఉంటుంది. ఈ బడ్జెట్ తర్వాత మీరు ఒకటిన్నర లక్ష వరకూ చెల్లించే వడ్డీ మొత్తానికి ఐటి డిడక్షన్ పొందొచ్చు. ఒకవేళ మీరు 5 శాతం ట్యాక్స్ శ్లాబులో ఉంటే గరిష్టంగా రూ.ఏడున్నర వేలు, ఇరవై శాతం ట్యాక్స్ శ్లాబులో ఉంటే రూ.30 వేలు, 30 శాతం ట్యాక్స్ శ్లాబులో ఉంటే రూ.45 వేల వరకూ ఏటా గరిష్టంగా ప్రయోజనం ఉంటుంది.

అయితే మొత్తం లోన్ టర్మ్‌లో రూ.2.5 లక్షల వరకూ వడ్డీ రాయితీని పొందొచ్చు. ఇప్పుడు హౌసింగ్ లోన్‌పై ఎలాంటి విధానం అమలవుతోందో ఇక్కడ కూడా అదే పద్ధతిలో వడ్డీ రాయితీని పొందే వీలుంది.

ఫేమ్ పథకానికి రూ.10 వేల కోట్లు

ఫేమ్ పథకానికి రూ.10 వేల కోట్లు

ఫేమ్ 2 పథకానికి కేంద్రం ఈ బడ్జెట్లో రూ.10 వేల కోట్లు కేటాయించింది. దీని కింద సదరు వాహనాల తయారీకి రాయితీతో పాటు బ్యాటరీ స్టేషన్ల ఏర్పాటు, ఛార్జింగ్ పాయింట్లు వంటి అంశాలకు ఖర్చు చేయబోతున్నారు. జాతీయ రహదారుల పథకాన్ని కూడా పూర్తి స్థాయిలో నవీకరిస్తున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో ఎలక్ట్రిక్ వాహనాలకు అవసరమైన మౌలిక సదుపాయాలను మరింతగా పెంచబోతున్నారు.

ఎలక్ట్రిక్ కార్లు ఉన్నాయా

ఎలక్ట్రిక్ కార్లు ఉన్నాయా

ప్రస్తుతం దేశంలో మహీంద్రా ఈ వెరిటో, మహీంద్రా ఈ2 ఓ ప్లస్,టాటా టిగోర్ వాహనాలు ఎలక్ట్రిక్ శ్రేణిలో ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి.

English summary

ఎలక్ట్రిక్ కార్లు కొంటే రూ.1.5 లక్ష ప్రయోజనం | Union Budget 2019: Modi govt bats for Electric Vehicles

The Indian auto industry is set to witness a sea change as leading car companies across the world are now preparing to bring their electric car models to India.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X