For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బడ్జెట్ 2019: సంపన్నులపై సర్‌చార్జ్, వారందరికీ రాయితీలు

|

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఈ బడ్జెట్‌లో సామాన్యులకు ఊరట కల్పించారు. అదే సమయంలో సంపన్నులపై సర్‌చార్జ్ పేరుతో భారం మోపారు. కోట్ల రూపాయలు సంపాదిస్తున్న వారిపై సర్‌చార్జ్ వసూలు చేస్తున్నారు. రూ.2 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు సంపాదనపై 3 శాతం, రూ.5 కోట్ల కంటే ఎక్కువ సంపాదనపై 7 శాతం విధిస్తున్నారు. ఇక, రూ.కోటికి మించి నగదు విత్ డ్రా చేస్తే రెండు శాతం టీడీఎస్ చెల్లించాలి.

బడ్జెట్ ఎఫెక్ట్: పెరగనున్న పెట్రోల్-డీజిల్ ధరలు, ప్రభుత్వానికి ఇలా ప్రయోజనం..బడ్జెట్ ఎఫెక్ట్: పెరగనున్న పెట్రోల్-డీజిల్ ధరలు, ప్రభుత్వానికి ఇలా ప్రయోజనం..

సామాన్యులకు ఊరట.. భారం

సామాన్యులకు ఊరట.. భారం

సామాన్యులు ఎక్కువగా ఉపయోగించే వస్తువులపై ధరలు తగ్గుతున్నాయి. చైనా వస్తువులపై భారం మోపుతున్నారు. మధ్య తరగతి వారికి ఇంటి రుణాలపై గుడ్ న్యూస్ చెప్పారు. అదే సమయంలో పెట్రోల్, డీజిల్‌పై రూ.1 చొప్పున సెస్ విధించడం ద్వారా భారం మోపుతున్నారు. ఎన్నారైలకు ఆధార్ కార్డు సరళతరం చేశారు. ఐటీ రిటర్న్స్ సహా ఎక్కడైనా పాన్ కార్డ్ లేదా ఆధార్ కార్డ్ వినియోగించే వెసులుబాటు కల్పించారు. డిజిటల్ చెల్లింపులపై పన్ను రద్దు చేశారు. బంగారం ధరలు మాత్రం భారీగా పెరగనున్నాయి. విద్యుత్ వాహనాలు ప్రోత్సహించేలా కాలుష్య కారకాలు తగ్గించేలా చర్యలు చేపట్టారు. ఎలక్ట్రానిక్ వెహికిల్స్‌పై ఊరట కల్పించారు.

ఆ రిటైల్ వ్యాపారులకు పెన్షన్ స్కీం

ఆ రిటైల్ వ్యాపారులకు పెన్షన్ స్కీం

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఈటీఎఫ్‌ల్లో పెట్టుబడులు పెట్టే చిల్లర మదుపరులకు ఈఎల్ఎస్ఎస్‌లో లభించేటువంటి ప్రయోజనాలు సమకూరనున్నాయి. ప్రస్తుతం ఇందులో పెట్టుబడులు పెడితే సెక్షన్ 80సీ కింద రూ.1.50 లక్షల వరకు ఆదాయపుపన్ను రాయితీ లభిస్తుంది. రిటైల్

ప్రభుత్వం.. రిటైల్ ట్రేడర్స్‌కు, షాప్ కీపర్స్‌కు కొత్త పథకం ప్రవేశ పెడుతోంది. డిక్లరేషన్‌ను అనుసరించి 30 మిలియన్ల రిటైల్ ట్రేడర్స్‌కు పెన్షన్ స్కీం వర్తింప చేయనున్నారు. ఏడాదికి రూ.1.5 కోట్ల టర్నోవర్ కంటే తక్కువ కలిగిన వారికి ఇది వర్తిస్తుంది.

కార్పోరేట్ పన్నుపై గుడ్ న్యూస్

కార్పోరేట్ పన్నుపై గుడ్ న్యూస్

25 శాతం కార్పోరేట్ పన్ను పరిధిని రూ.250 కోట్ల టర్నోవర్ నుంచి రూ.400 కోట్లకు పెంచారు. ఇది చిన్నతరహా పరిశ్రమలకు మేలు కలిగించే అంశం. స్టార్టప్స్ కోసం కొత్త టీవీ ఛానల్ తేనున్నారు. బంగారంపై ఇప్పటి వరకు ఉన్న 10 శాతం సుంకాన్ని 12.5 శాతంగా చేశారు. రూపాయి బలహీనపడటం, చమురు ధరలు తక్కువగా ఉండటంతో బంగారం ధర భారీగా పెరిగింది. ఈ దెబ్బతో మరింత పెరిగే అవకాశముంది.

స్వయం సహాయక బృందాలకు తీపి కబురు

స్వయం సహాయక బృందాలకు తీపి కబురు

స్వయం సహాయక బృందాలకు తీపి కబురు అందించారు. వీరికి ముద్ర యోజన వర్తిస్తుంది. ఒక్కొక్కరికి రూ.1 లక్ష ముద్ర రుణాలు ఇవ్వనున్నారు. జన్ ధన్ ఖాతా ఉన్న మహిళలకు రూ.5వేల వరకు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం కల్పించనున్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఈజ్ ఆఫ్ లివింగ్... రైతులకు కూడా చెందాలని కేంద్రం ఆశిస్తోంది. జీరో బడ్జెట్ వ్యవసాయాన్ని రైతులు ఆశ్రయించాలని కేంద్రమంత్రి సూచించారు. రైతులకు ఇది కొత్త మోడల్ కావాలన్నారు. దీంతో రైతుల ఆదాయం రెట్టింపవుతుందన్నారు.

English summary

బడ్జెట్ 2019: సంపన్నులపై సర్‌చార్జ్, వారందరికీ రాయితీలు | Highlights of Union Budget 2019-20

Finance Minister Nirmala Sitharaman presented the maiden budget of Narendra Modi 2.0 government in the Lok Sabha on Friday.
Story first published: Friday, July 5, 2019, 19:10 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X