For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చైనాతో మనకు పోలిక... ఆర్ధిక వృద్ధిలో దూసుకుపోతామా?

By Jai
|

పార్లమెంట్ లో ప్రవేశ పెట్టిన ఆర్ధిక సర్వే నివేదిక ప్రకారం... ప్రస్తుతం భారత దేశం ఒకప్పుడు చైనా వేగంగా అభివృద్ధి చెందిన క్రమంలో సాగుతున్నట్లు కనిపిస్తోంది. ప్రధాన ఆర్ధిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రమణియణ్ నివేదిక ప్రకారం ఈ విషయం స్పష్టమవుతోంది. ఏటా 7 % వృద్ధి రేటుతో భారత దేశం వచ్చే 5 ఏళ్ళ లో 5 ట్రిలియన్ (5 లక్షల కోట్లా అమెరికా డాలర్లు ... అంటే సుమారు రూ 3.5 కోట్ల కోట్లు ) డాలర్ల స్థాయికి చేరుకొని ప్రపంచం లోనే మూడో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా ఆవిర్భవించే అవకాశం ఉన్నట్లు ఆర్ధికవేత్తల అభిప్రాయం. ఇదే జరిగితే నిజంగానే భారత్ ... గత రెండు దశాబ్దాల్లో చైనా ఎంత వేగంగా అభివృద్ధి చెందినదో ... మనమూ అలాగే దూసుకు పోయే అవకాశం ఉంది.

1987 నుంచి 2017 వరకు మధ్య కాలం లో పొదుపు, పెట్టుబడులు, ఎగుమతుల్లో వృద్ధి అనే మూడు ప్రధాన అంశాలతో వృద్ధిని నమోదు చేసిందని ఆర్ధిక సర్వే నివేదికలో సుబ్రమణియం పేర్కొన్నారు. అలాగే... ఇప్పుడు భారత దేశం కూడా సరిగ్గా అదే దిశలో పయనిస్తోందని తెలిపారు. ప్రధాని మోడీ తోలి 5 ఏళ్ళ పాలనా సమయం లో భారత లో పొదుపు, పెట్టుబడుల తో పాటుగా ఎగుమతుల్లో భారీ వృద్ధి నమోదు అయినట్లు అయన అభిప్రాయం. ఇదే మరో 5 ఏళ్ళ పాటు కొనసాగే అవకాశం ఉందని నమ్మకం.

విద్యార్థులకు గుడ్‌న్యూస్: తెలుగు భాషలో బ్యాంకింగ్ పరీక్షలువిద్యార్థులకు గుడ్‌న్యూస్: తెలుగు భాషలో బ్యాంకింగ్ పరీక్షలు

చైనా పెటుబడి ఆధారిత వ్యవస్థ

చైనా పెటుబడి ఆధారిత వ్యవస్థ

చైనా ఇప్పటికీ పెట్టుబడి ఆధారిత ఆర్ధిక వ్యవస్థేనని .... అదే ప్రక్రియ 20017 వరకూ కొనసాగిందని సుబ్రమణియం స్పష్టం చేసారు. మంచో చెడో... మనకు పోటీ దారుగా కానీ... ఆదర్శమే కానీ ... చైనా తో మనం పోల్చి చూసుకోవాల్సిందే. ఎందుకంటె... పొరుగు దేశానికి మనకు జనాభా, విస్తీర్ణం, కొనుగోలు శక్తి, వినియోగం, ఎగుమతులు, దిగుమతులు, మిలిటరీ బడ్జెట్ వంటి అనేక అంశాల్లో సారూప్యత ఉంది. ఆర్థిక వ్యవస్థ గమనం లోనూ రెండు దేశాలు రైలు పట్టాల వాలే దేనికి అదే ఒక మార్గం లో పయనిస్తున్నాయి. ఇతర దేశాల్లో పెట్టుబడుల విషయం లోనూ, ఎగుమతులు లేదా దిగుమతుల ద్వారా ప్రపంచం లోని చాల దేశాలను ప్రభావితం చేయగలిగే సత్తా సమానంగా కాకున్నా రెండిటికీ ఉంది.

భారత్‌లోనే ఎక్కువ యువత

భారత్‌లోనే ఎక్కువ యువత

ఇక పొతే , మన దేశం ప్రపంచం లోనే అత్యంత ఎక్కువ యువకులు ఉన్న దేశాల్లో ముందు ఉన్నది. బాగా పనిచేసే శ్రామిక శక్తి కలిగిన 20-59 ఏళ్ళ వయస్సు జనాభా దాదాపు 50% ఉంది. ఇది 2041 లో 59% క్కి చేరుకొని ... పీక్ లెవెల్ లోకి వెళుతుందని... అది సరిగ్గా ఇప్పటి చైనా లేదా థాయిలాండ్ దేశాల స్థితిని ప్రతిబింభిస్తుందని కృష్ణమూర్తి సుబ్రమణియం వెల్లడించారు.

చైనా తరహాలో భారత్...

చైనా తరహాలో భారత్...

కాబట్టి, వచ్ఛే 5 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళ లో భారత్ దేశ ఆర్ధిక వ్యవస్థ పూర్తిగా చైనా తరహాలో ముందుకు సాగుతుందన్నది ఆయన సారాంశం. ఇందుకు భారత్ దేశంలో రాజకీయ అస్థిరత కూడా తక్కువేనని.. అమెరికా, చైనా, ఎఉరోపెయన్ దేశాలతో పోల్చితే మన దేశం ఈ విషయం లో చాల మెరుగ్గా ఉందన్నారు. అందుకే అభివృద్ధిలో వచ్చే 5 ఏళ్ళు భారత్ దే హవా అన్నమాట.

English summary

చైనాతో మనకు పోలిక... ఆర్ధిక వృద్ధిలో దూసుకుపోతామా? | Economic Survey wants India to follow China's shining example

Even as India gets ready to embark on that $5-trillion in 5 years GDP quest, China continues to remain the big elephant in the room — be it as a role model, a rival, or a partner in the shared dream of the Asian century.
Story first published: Friday, July 5, 2019, 7:37 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X