For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఏసీ, చైనా ఐటమ్స్... ధరలు పెరిగేవి ఇవే, డిఫెన్స్ సహా ధరలు తగ్గేవి ఇవే

|

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ ఆధారంగా ఇక నుంచి కొన్ని ధరలు పెరిగితే, మరికొన్నింటి ధరలు తగ్గనున్నాయి. ఆదాయపన్ను పరిమితిలో ఎలాంటి మార్పులు చేయని బడ్జెట్... తొలిసారి గృహ రుణం తీసుకుని ఇల్లు కట్టుకునే వారికి ప్రోత్సాహకాలు ప్రకటించారు. ఎలక్ట్రిక్ వాహనాలపై రాయితీలు ఇస్తున్నారు. బంగారంపై కస్టమ్స్ సుంకాన్ని 10 శాతం నుంచి 12.50 శాతానికి పెంచారు. ఈ బడ్జెట్ వివిధ వస్తువుల ధరలపై ప్రభావ చూపనుంది.

ఇల్లు కొనేవారికి భారీ ఊరట: రూ.3.5 లక్షల వరకు ఆదాయపన్ను మినహాయింపుఇల్లు కొనేవారికి భారీ ఊరట: రూ.3.5 లక్షల వరకు ఆదాయపన్ను మినహాయింపు

ఏసీలు, జీడిపప్పు సహా పెరిగినవి ఇవి

ఏసీలు, జీడిపప్పు సహా పెరిగినవి ఇవి

తాజా బడ్జెట్ ప్రకారం వీటి ధరలు పెరగనున్నాయి. సీసీ టీవీ, పెట్రోల్, డీజిల్, జీడిపప్పు, బంగారం, ఇంపోర్టెడ్ పుస్తకాలు, వెండి, ,ీట్లు, రోల్స్, డిస్క్, ప్యాడ్ వంటి ఆటో పార్ట్స్, ప్లాస్టిక్ వస్తువులు, ఫిల్టర్ సిగరేట్లు, కార్లు, సీడీలు, డీవీడీలు, సెరామిక్ రూఫింగ్ టైల్స్, డిజిటల్ వీడియో రికార్డర్స్, హుక్కా, ఏసీలు, స్ప్లిట్ ఏసీలు, లౌడ్ స్పీకర్లు, మెటల్ డోర్లు, కిటికీలు, న్యూస్ ప్రింట్, ఆయిల్ ఫిల్టర్స్, ఆప్టిక్ ఫైబర్ కేబుల్స్, ప్రింటెడ్ బుక్స్, రబ్బరు, టైర్లు, మేగజైన్లు, కార్ల అద్దాలు, రేర్ వ్యూ గ్లాస్, మోటార్ బైక్స్‌కు వేసే తాళాలు.

చైనా వస్తువులు సహా మరిన్ని పెరిగేవి...

చైనా వస్తువులు సహా మరిన్ని పెరిగేవి...

పీవీసీ పైపులు, వినైల్ ఫ్లోరింగ్, మెటల్ ఫిట్టింగ్, స్టెయిన్‌లెస్ స్టీల్ ఉత్పత్తులు, ఫర్నీచర్, సింథటిక్ రబ్బర్, మార్బుల్ ల్యాప్స్, ఆప్టికల్ ఫైబర్ కేబుల్, ఐపీ కెమెరా, డిజిటల్ వీడియో రికార్డర్స్, చైనా బొమ్మలు, స్విచ్‌లు, గుట్కాలు, జీడి పిక్కలు, సిరామిక్ టైల్స్, అలాయ్ స్టీల్ వైర్, స్టోన్ క్రషర్ ప్లాంట్స్, ఆయిల్/ఎయిర్ ఫిల్టర్లు, బైక్ హార్న్స్, కార్ల విండో స్క్రీన్ వైపర్.

ఇంటి రుణాలు సహా తగ్గేవి...

ఇంటి రుణాలు సహా తగ్గేవి...

పరుపులు, సైరామిక్ టైల్స్, ఎలక్ట్రిక్ బోర్డులు, ఎలక్ట్రిక్ వాహనాలు, ఇంటి రుణాలు, తోలు ఉత్పత్తులు, డిఫెన్స్ పరికరాలు, హెయిర్ ఆయిల్, మార్బుల్స్, గ్రానైట్, పెయింట్స్, ఫ్లైవుడ్, షాంపూలు, టూత్ పేస్ట్, సెల్ ఫోన్ ఛార్జర్లు, సెటాప్ బాక్సులు, మొబైల్ ఫోన్లలో వినియోగించే లిథియం బ్యాటరీలు, చార్జింగ్ సైకిల్స్ తగ్గనున్నాయి.

హ్యాండ్ బ్యాగ్‌లు, జార్‌లు, పాల ఉత్పత్తులు, ప్లాస్టిక్ పాత్రలు, పంపులు, శానిటరీ ఉత్పత్తులు, సూట్‌కేసులు, చాక్లెట్లు, మిక్సర్, రిఫ్రిజిరేటర్, వాచ్‌లు, గోడ గడియారాలు, వాటర్ హీటర్లు, బల్బులు, ఫ్యాన్లు, గాజు వస్తువులు, రెయిన్ కోట్లు, ఎలక్ట్రానిక్ మిషనరీస్, వెదురు ఉత్పత్తులు, బయో ఉత్పత్తులు, ఏటీఎం మిషన్లు, ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్లు కూడా తగ్గనున్నాయి.

English summary

ఏసీ, చైనా ఐటమ్స్... ధరలు పెరిగేవి ఇవే, డిఫెన్స్ సహా ధరలు తగ్గేవి ఇవే | Budget 2019: What will get cheaper and expensive

Here are List of Cheaper and Expensive (Costlier) Items in Union Budget 2019-20.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X