For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

BSNLను బెయిలవుట్ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు, వ్యూహాత్మకంగా..

|

న్యూఢిల్లీ: తీవ్ర ఆర్థిక ఇబ్బందులలో కూరుకుపోయిన ప్రభుత్వ రంగ టెలికం కంపెననీలు బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్‌లను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని తెలుస్తోంది. ఇందులో భాగంగా రూ.74,000 కోట్ల బెయిలవుట్ ప్లాన్‌ను పరిశీలిస్తోందని సమాచారం. ఈ కంపెనీలను కాపాడేందుకు ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళనుందని తెలుస్తోంది.

రైల్వే టిక్కెట్ దాదాపు ఉచితం!!: SBI కార్డుతో ఇలా చేయండి...రైల్వే టిక్కెట్ దాదాపు ఉచితం!!: SBI కార్డుతో ఇలా చేయండి...

రుణాల్లో టాప్ 3 ప్రభుత్వ కంపెనీలు

రుణాల్లో టాప్ 3 ప్రభుత్వ కంపెనీలు

ఇందులో భాగంగా వేలాది మంది ఉద్యోగులకు ఆకర్షణీయమైన ఎగ్జిట్ ప్యాకేజీని ప్రకటించనుందని తెలుస్తోంది. ఇందులో భాగంగా వీఆర్ఎస్ తీసుకునే వారికి 5 శాతం అదనపు కంపెన్షేషన్/ఎక్స్‌గ్రేషియా ఇచ్చేందుకు సిద్ధమవుతోందని తెలుస్తోంది. రుణాల విషయంలో ప్రభుత్వం రంగ సంస్థల్లో బీఎస్ఎన్ఎల్ మొదటి స్థానంలో ఉండగా, ఎంటీఎన్ఎల్ మూడో స్థానంలో ఉంది. 2019 ఆర్థిక సంవత్సరం నాటికి బీఎస్ఎన్ఎల్‌కు రూ.13,804 కోట్ల రుణాలు, ఎంటీఎన్ఎల్‌కు రూ.3,398 కోట్ల రుణాలు ఉన్నాయి. రుణాల్లో ఎయిరిండియా రెండో స్థానంలో ఉంది.

బెయిలవుట్ కోసం ఇలా...

బెయిలవుట్ కోసం ఇలా...

ఈ బెయిలవుట్ స్కీంలో రూ.20,000 కోట్లను 4G స్పెక్ట్రమ్స్ కోసం, రూ.40,000 కోట్లను వీఆర్ఎస్ కోసం అందించేందుకు కేటాయిస్తారని ప్రతిపాదన. రూ.13,000 కోట్లను మూలధన వ్యయంగా అందిస్తారు. అలాగే, ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సును 60 నుంచి 58 ఏళ్లకు తగ్గించడం ద్వారా ఖర్చును తగ్గించాలని చూస్తోంది. ఇందుకు ఆకర్షణీయ వీఆర్ఎస్ ప్యాకేజీ అందించనుంది.

మూసివేత సులభం కాదు

మూసివేత సులభం కాదు

పీఎస్‌యూ మూసివేత అంత సులభం కాదని, దీనికి రూ.1.2 లక్షల కోట్లు ఖర్చుతుందని ప్రభుత్వం చెబుతోంది. ఇది సాధ్యం కాని అంశమని చెబుతోంది. టెలికం రంగంకు ఉన్న ఒత్తిళ్ల కారణంగా ఇందులో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ రాకపోవచ్చునని, అయితే జాయింట్ వెంచర్‌కు అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. కాగా, బీఎస్ఎన్ఎల్ ఆర్థిక ఇబ్బందులలో ఉన్న విషయం తెలిసిందే. ఇక్కడ స్టాఫ్ ఖర్చు చాలా ఎక్కువగా ఉంది.

భారత్ సంచార్ నిగం లిమిటెడ్ (BSNL) ఆర్థిక పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోంది. విపరీతమైన పోటీని తట్టుకోలేక దాదాపుగా చేతులెత్తేసిన సంస్థ అప్పుల ఊబిలోకి కూరుకుపోయింది. ఉద్యోగుల జీతాలకు కూడా డబ్బులు చెల్లించలేని పరిస్థితి. దీంతో 2018-19 ఆర్థిక సంవత్సరంలో బీఎస్ఎన్ఎల్ సంస్థ ఏకంగా రూ.14000 కోట్ల నష్టాన్ని మూటగట్టుకుంది.

English summary

BSNLను బెయిలవుట్ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు, వ్యూహాత్మకంగా.. | Govt considers Rs.74,000 crore bailout for MTNL, BSNL

In an attempt to rescue ailing state-owned telecom companies BSNL and MTNL, the government is considering an Rs 74,000-crore bailout plan.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X