For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంకుకు రూ.325 కోట్ల నిధులు, సరళ్ జీవన్ బీమా యోజన ఆఫర్

|

భారతి ఎయిర్‌టెల్, భారతి ఎంటర్‌ప్రైజెస్ కంపెనీలు ఎయిర్‌టెల్ పేమెంట్ బ్యాంకుకు రూ.325 కోట్ల నిధులు సమకూర్చాయి. భారతీ ఎయిర్‌టెల్ నుంచి రూ.260 కోట్లు, భారతీ ఎంటర్‌ప్రైజెస్ నుంచి రూ.65 కోట్ల నిధులను షేర్ల రూపంలో అందించినట్లు రెగ్యులేటరీ సంస్థలకు పంపిన ప్రకటనలో తెలిపింది. రానున్న కాలంలో పేమెంట్ బ్యాంక్ కార్యకలాపాలు మరింత విస్తరించేందుకు ఎక్కువగా ఇన్వెస్ట్ చేయనున్నట్లు పేమెంట్స్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్-సీఈవో అనుబ్రత బిశ్వాస్ తెలిపారు.

తాము ఇప్పటికే అయిదు లక్షల రిటైల్ బ్యాంకింగ్ పాయింట్ల ద్వారా భారీ సంఖ్యలో కస్టమర్లను సాధించినట్లు తెలిపారు. తమ నెట్ వర్క్ ద్వారా సరళ్ జీవన్ బీమా యోజన పాలసీని చేయడానికి భారతీ ఆక్సాతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపింది. భారత ప్రభుత్వం డిజిటల్ ఇండియాపై ప్రత్యేక దృష్టి సారించిందని, దీంతో డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్ దిశగా సాగుతోందన్నారు. ఎయిర్‌టెల్ పేమెంట్ బ్యాంక్ కూడా వేగంగా పెరుగుతోందన్నారు.

నెలకు రూ.10వేలు ఇన్వెస్ట్ చేయడం ద్వారా రూ.1కోటి సంపాదన!నెలకు రూ.10వేలు ఇన్వెస్ట్ చేయడం ద్వారా రూ.1కోటి సంపాదన!

Bharti Airtel, Bharti Enterprises infuse Rs.325 crore in payments bank

డిజిటల్ సేవల కోసం పేమెంట్ బ్యాంక్ బలమైన వేదికగా మారుతుందని, ఇందుకోసం తాము మరిన్ని పెట్టుబడులు పెడతామని చెప్పారు. ఇదిలా ఉండగా, భారతీ ఆక్సా లైఫ్ ఇన్సురెన్స్‌తో ఎయిర్‌టెల్ పేమెంట్ బ్యాంక్ జత కట్టింది. సరళ్ జీవన్ బీమా యోజన పాలసీని ఆఫర్ చేస్తున్నారు. ఇది లైఫ్ టర్మ్ ఇన్సురెన్స్ ప్లాన్. కన్స్యూమర్లు రూ.3 లక్షలు లేదా రూ.5 లక్షల ప్రీమియంలను ఎంచుకోవచ్చు. 18-55 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన వారు వైద్య పరీక్షలు లేకుండా ఈ బీమా తీసుకోవచ్చు.

English summary

ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంకుకు రూ.325 కోట్ల నిధులు, సరళ్ జీవన్ బీమా యోజన ఆఫర్ | Bharti Airtel, Bharti Enterprises infuse Rs.325 crore in payments bank

Bharti Airtel and Bharti Enterprises have injected about Rs 325 crore in Airtel Payments Bank, as per regulatory documents.
Story first published: Wednesday, July 3, 2019, 12:30 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X