For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బ్యాంకు ఫ్రాడ్: 12 రాష్ట్రాల్లో, 18 నగరాల్లో సీబీఐ స్పెషల్ డ్రైవ్

|

న్యూఢిల్లీ: బ్యాంకింగ్ మోసాలకు సంబంధించి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) మంగళవారం దేశవ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది. ఇందులో భాగంగా 14 కేసులు నమోదు చేసింది. 12 రాష్ట్రాల్లోని 14 నగరాల్లో 50కి పైగా సోదాలు నిర్వహించింది. బ్యాంకు మోసాలకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న పలు కంపెనీల డైరెక్టర్లు, ప్రమోటర్లపై స్పెషల్ డ్రైవ్ చేపట్టింది.

బ్యాంక్ మోసాలు, స్కాంలకు సంబంధించి స్పెషల డ్రైవ చేపట్టిన సీబీఐ దేశవ్యాప్తంగా సోదాలు నిర్వహిస్తోందని, వివిధ కంపెనీలు, వాటి ప్రమోటర్లు, బ్యాంక్ అధికారులతో కలిపి సోదాల అనంతరం 14 కేసులు నమోదు చేశామని ఓ అధికారి తెలిపారు. ఈ సోదాలు ఇంకా కొనసాగుతున్నాయని చెప్పారు. నిందితులకు సంబంధించి 14 కేసులు నమోదు చేశామని, ఇందులో పలు కంపెనీలు, ప్రమోటర్లు, డైరెక్టర్లు ఉన్నారని చెప్పారు.

బ్యాంకులు, బీమాల్లో క్లెయిమ్ చేయని డిపాజిట్స్ రూ.32,000బ్యాంకులు, బీమాల్లో క్లెయిమ్ చేయని డిపాజిట్స్ రూ.32,000

CBI, Indias premier investigating agency, has raided corporate loan defaulters in 12 states

ఢిల్లీ, ముంబై, లుథియానా, థానే, వల్సాద్, పుణే, పళని, గయ, గుర్గావ్, చండీఘడ్, బోపాల్, సూరత్, కోలార్ తదితర నగరాల్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాలకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు దాదాపు రూ.640 కోట్ల మేర బ్యాంకు మోసాలకు పాల్పడ్డట్లుగా ఆరోపణలు ఉన్నాయి.

పెద్ద పెద్ద కార్పోరేట్ కంపెనీలు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని చెల్లించలేదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.71,500 కోట్ల బ్యాంక్ ఫ్రాడ్‌కు గాను 6,800 కేసులు నమోదయ్యాయి. 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ.1,06,000 కోట్లను ప్రభుత్వం బ్యాంకులకు ఇన్ఫ్యూజ్ చేసింది.

English summary

బ్యాంకు ఫ్రాడ్: 12 రాష్ట్రాల్లో, 18 నగరాల్లో సీబీఐ స్పెషల్ డ్రైవ్ | CBI, India's premier investigating agency, has raided corporate loan defaulters in 12 states

The Central Bureau of Investigation (CBI) Tuesday raided more than 50 places in 18 different cities across 12 states/UTs in a countrywide action relating to bank cases.
Story first published: Tuesday, July 2, 2019, 15:07 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X