For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రూ.15,000 కోట్ల స్కాం: బాలీవుడ్ నటుడు డినో మోరియాకు సమన్లు

|

న్యూఢిల్లీ: స్టెర్లింగ్ బయోటెక్ - సదేశరా కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) డీజే అఖీల్, బాలీవుడ్ యాక్టర్ డినో మోరియాకు సమన్లు జారీ చేసింది. ఈ మేరకు ఇంగ్లీష్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ స్కాంకు సంబంధించిన విచారణలో హాజరు కావాలని వారికి నోటీసులు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. స్టెర్లింగ్ బయోటెక్ వ్యవహారంలో వీరిద్దరికి డబ్బులు ముట్టినట్లు ఆరోపణలు రావడంతో ఈడీ విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.

నీరవ్ మోడీ PNB స్కాం కంటే మరో పెద్ద కుంభకోణం నీరవ్ మోడీ PNB స్కాం కంటే మరో పెద్ద కుంభకోణం

ఈ చెల్లింపుల గురించి డినో మోరియా, అఖీల్‌ను ఈడీ ప్రశ్నించనుందని చెబుతున్నారు. డినో మోరియా బాలీవుడ్ నటుడు. అతను పలు హిందీ సినిమాలతో పాటు తమళ, మలయాళ బాషల్లో నిటంచాడు. అఖీల్ ప్రముఖ డీజే. ఈ సమన్లపై వీరిద్దరి స్పందంచాల్సి ఉంది.

Sterling Biotech case: ED summons Dino Morea, DJ Aqeel in Rs 15,000 crore scam

కాగా, గుజరాత్‌కు చెందిన స్టెర్లింగ్ బయెటెక్ లిమిటెడ్ (SBL), ఆ కంపెనీ ప్రమోటర్లు బ్యాంకులను భారీ ఎత్తున చీటింగ్ చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి SBL కంపెనీ, ప్రమోటర్లు నితిన్ సందేశర, చేతన్ సందేశర, దీప్తి సందేశరపై కేసు నమోదయింది.

వీరు రూ.15,000 కోట్ల మేరకు మోసాలకు పాల్పడినట్లుగా వార్తలు వచ్చాయి. ఇది పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేసిన నీరవ్ మోడీ స్కాం కంటే పెద్దది అని చెబుతున్నారు. గత వారం ఈడీ పీఎంఎల్ఏ కింద రూ.9,778 కోట్ల ఆస్తులను ఫ్రీజ్ చేసింది. అంతకుముందు ఏడాది రూ.4,700 కోట్ల ఆస్తులను సీజ్ చేసింది. నితిన్, చేతన్, దీప్తిలు రూ.8,100 మేర బ్యాంకులను మోసం చేశారని కూడా ఆరోపణలు ఉన్నాయి.

స్టెర్లింగ్‌ గ్రూపు ప్రధాన ప్రమోటర్లు రుణంగా తీసుకున్న నిధులను నైజీరియాలోని తమ చమురు వ్యాపారానికి మళ్లించడమే కాకుండా వ్యక్తిగత అవసరాలకూ వాడుకున్నారని ఈడీ తెలిపింది. ప్రస్తుతం వీరు పరారీలో ఉన్నారు. వీరికి ఉన్నత స్థాయి రాజకీయ నేతలతో మంచి పరిచయాలు ఉన్నాయనే ఆరోపణలపై ఈడీ, సీబీఐ, ఇన్‌కం ట్యాక్స్ విభాగం దర్యాప్తు చేస్తున్నాయి.

ఆరోపణలు ఉన్న నితిన్ సందేశర, చేతన్ సందేశర, హితేశ్ పటేల్‌లను రప్పించే చర్యలు ఈడీ చేపట్టింది. మరోవైపు, వారి కుటుంబం అల్బేనియాలో ఉన్నట్లుగా గుర్తించినట్లుగా తెలుస్తోంది. నితిన్ సందేశర-చేతన్ సందేశరల సోదరుడు హితేష్ పటేల్.

షెల్ కంపెనీలకు డమ్మీ డైరెక్టర్లను నియమించడంలో హితేష్ పటేల్ కీలకంగా వ్యవహరించాడని ఆరోపణలు ఉన్నాయి. ఇలా మనీ లాండరింగ్‌కు పాల్పడ్డారు. స్టెర్లింగ్ బయోటెక్ కేసులో హితేష్‌కు నాన్ బెయిలబుల్ వారంట్ ఇష్యూ చేశారు. స్టెర్లింబ్ బయోటెక్, డైరెక్టర్లు తదితరుల పైన సీబీఐ 2017లో కేసు నమోదు చేసింది.

English summary

రూ.15,000 కోట్ల స్కాం: బాలీవుడ్ నటుడు డినో మోరియాకు సమన్లు | Sterling Biotech case: ED summons Dino Morea, DJ Aqeel in Rs 15,000 crore scam

The ED has summoned DJ Aqeel and Bollywood actor Dino Morea in connection with the Sandesara case. India Today has learnt that both the Bollywood personalities have been asked to join the probe as payments were made to them using the proceeds of crime.
Story first published: Monday, July 1, 2019, 14:09 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X