For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

SBI షాక్: 10 మంది ఎగవేతదారుల పేర్లు విడుదల చేసి, హెచ్చరిక

|

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ సంస్థ బ్యాంకు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (SBI) డిఫాల్టర్లపై సీరియస్ చర్యలకు దిగింది. తాజాగా పది మంది ఉద్దేశ్య పూర్వక ఎగవేతదారులపై కొరడా ఝుళిపించింది. పలుమార్లు హెచ్చరించినా రుణాలు చెల్లించకపోవడంతో పదిమందితో కూడిన జాబితాను శుక్రవారం వెలువరించింది. తక్షణమే బకాయిలు చెల్లించాలని లేదంటే తీవ్రమైన చర్యలు ఉంటాయని హెచ్చరించింది.

ఈ మేరకు పదిమంది పెద్ద డిఫాల్టర్ల పేర్లు రివీల్ చేసింది. ఇందులో ఫార్మాస్యూటికల్స్, జ్యువెల్లరీ, పవర్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ తదితర రంగాలకు చెందిన వారు ఉన్నారు. ఎక్కువమంది ముంబైకి చెందిన డిఫాల్టర్లు ఉన్నారు. కఫ్ పరేడ్ - స్ట్రెస్‌డ్ అసెట్స్ మేనేజ్‌మెంట్ బ్రాంచ్ 1 (SAM-1) ఈ నోటీసులు జారీ చేసింది.

దారి ఇవ్వకుంటే రూ.10వేలు, రూ.1 లక్ష వరకు ఫైన్దారి ఇవ్వకుంటే రూ.10వేలు, రూ.1 లక్ష వరకు ఫైన్

SBI reveals names of 10 big wilful defaulters, warns of legal action

దాదాపు రూ.1,500 కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉందని పేర్కొంది. రాబోయే పదిహేను రోజుల్లో వడ్డీ, ఇతర చార్జీలతో సహా బకాయిలు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. లేని పక్షంలో చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించింది.

డిఫాల్టర్లలో స్పాన్కో లిమిటెడ్ కంపెనీకి చెందిన రుణాలు రూ.3,47,30,46,322, కాలిక్స్ కెమికల్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ రుణాలు రూ.3,27,81,97,772, ఇస్పాట్ లిమిటెడ్ రుణాలు రూ.2,87,30,52,225, ఆరో గోల్డ్ రుణాలు రూ.229,05,43,248 ఉన్నాయి. ఇమ్రాన్ ఖాన్, మొహమ్మద్ ఐ ఖాన్ డైరెక్టర్లుగా ఉన్న ఎక్సెల్ మెటల్ ప్రాసెసర్ రూ.61.26 కోట్లు, మిగతా కంపెనీలు వరుసగా రూ.56.73 కోట్లు, రూ.53.79 కోట్లు, రూ.32.71 కోట్లు, రూ.29.51 కోట్లు, రూ.27.80 కట్లుగా ఉంది.

English summary

SBI షాక్: 10 మంది ఎగవేతదారుల పేర్లు విడుదల చేసి, హెచ్చరిక | SBI reveals names of 10 big wilful defaulters, warns of legal action

The State Bank of India on Friday revealed the names of 10 new big ticket firms and their top officials and declared them as wilful defaulters.
Story first published: Friday, June 28, 2019, 16:57 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X