For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అప్పుల్లో డీహెచ్ఎఫ్ఎల్: మ్యూచువల్ ఫండ్స్‌లో వాటాను అమ్మేందకు సెబీ అనుమతి

|

తన 50 శాతం వాటాను ప్రుడెన్షియల్ ఫైనాన్షియల్‌కు అమ్మడం ద్వారా మ్యూచువల్ ఫండ్ వ్యాపారం నుంచి నిష్క్రమించడానికి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) అనుమతి వచ్చినట్లు అప్పుల్లో కూరుకుపోయిన దేవాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ (డిహెచ్‌ఎఫ్‌ఎల్‌) బుధవారం తెలిపింది. ఈ మేరకు డీహెచ్ఎఫ్ఎల్ ప్రుడెన్షియల్ ఫైనాన్సియల్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. మొత్తం 50శాతం వాటాలో డీహెచ్ఎల్‌ఎఫ్ సొంతంగా 17.12శాతం వాటాలను కలిగి ఉండగా మరో 32.88శాతం వాటా ఈ సంస్థ సబ్సిడరీ కంపెనీ డీహెచ్ఎఫ్ఎల్ అడ్వెజరీ మరియు ఇన్వెస్ట్‌మెంట్స్‌ కలిగి ఉంది.

" జూన్ 25న సెబీ డీపీఏఎంపీఎల్‌కు లేఖ రాసింది. సెబీ అన్ని అనుమతులు ఇస్తున్నట్లు లేఖలో పేర్కొంది.సెబీ నిబంధనలకు అనుగుణంగానే మ్యూచువల్ ఫండ్స్ నుంచి నిష్క్రమిస్తునాం."అని డీహెచ్ఎఫ్‌ఎల్ స్టాక్ ఎక్స్ ఛేంజ్‌కు తెలిపిన ఫైలింగ్‌లో పేర్కొంది.

DHFL

ఇదిలా ఉంటే మంగళవారం రోజున డీహెచ్ఎఫ్ఎల్ రూ.375 కోట్లు అప్పు చెల్లించాల్సి ఉండగా ఆ మొత్తంలో 40శాతం మాత్రమే చెల్ించేందుకు ముందుకొచ్చింది. ప్రస్తుతం ఆ సంస్థలో నిధుల కొరత కూడా తీవ్రంగా ఉండటంతో ఆర్థిక సంక్షోభం దిశగా సంస్థ పయనిస్తోంది. డీహెచ్ఎఫ్ఎల్ తీసుకున్న అప్పులను చెల్లించేందుకుగాను తమ ఆస్తులను అమ్మకానికి పెట్టింది అమ్మకం ద్వారా వచ్చిన డబ్బులతో అప్పులను చెల్లిస్తోంది డీహెచ్ఎఫ్ఎల్. రూ.375 కోట్లకు గాను 40శాతం మాత్రమే చెల్లించినట్లు చెప్పిన డీహెఎల్ఎఫ్... మరో రెండ్రోజుల్లో మిగతా రూ.225 కోట్లు చెల్లిస్తామని వెల్లడించింది.

English summary

అప్పుల్లో డీహెచ్ఎఫ్ఎల్: మ్యూచువల్ ఫండ్స్‌లో వాటాను అమ్మేందకు సెబీ అనుమతి | DHFL gets Sebi approval to exit mutual fund business

Debt-laden Dewan Housing Finance Corporation on Wednesday said it has received the Securities and Exchange Board of India's (Sebi) approval to exit its mutual fund business by selling its 50 per cent stake to Prudential Financial.
Story first published: Thursday, June 27, 2019, 0:34 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X