For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫ్రెషర్స్‌కు 10,000 ఉద్యోగాలు: 12వ తరగతి పాసైన వారికి HCLలో ఉద్యోగాలు

|

న్యూఢిల్లీ: 2019-20 ఆర్థిక సంవత్సరంలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ 10,000 మందికి పైగా ఉద్యోగులను తీసుకోవాలని చూస్తోంది. దేశవ్యాప్తంగా రిక్రూట్మెంట్ చేసుకోనుంది. 12వ తరగతి చదివినవారితో పాటు గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లను తీసుకోనుంది. ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్ స్ట్రీమ్‌ నుంచి ప్రెషర్స్‌ను తీసుకోనుంది. ఈ మేరకు దేశవ్యాప్తంగా రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తుంది.

కేవలం నోయిడాలోనే దాదాపు 3వేల మంది ఫ్రెషర్స్‌ను తీసుకోనుంది. ఇందులో 2018-19లో 12వ తరగతి పాసైన వారిని వెయ్యి మందిని తీసుకుంటుంది. పన్నెండవ తరగతి పాసైన విద్యార్థులకు వేతనంతో పాటు ఏడాది పాటు ట్రెయినింగ్ ఉంటుంది. గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అయితే ఆరు నెలల శిక్షణ ఉంటుంది. ఎంట్రెన్స్ టెస్ట్ తర్వాత పాసైన వారికి రూ.2 లక్షల ఫీజు ఉంటుంది.

HCL looking to hire over 10,000 freshers,

ట్రెయినింగ్ తర్వాత ఫ్రెషర్లు హెచ్‌సీఎల్‌లో చేరవచ్చునని, శిక్షణ సమయంలో స్టైఫండ్ వస్తుందని హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అండ్ ప్రోగ్రామ్ డైరెక్టర్ (న్యూ విస్తాస్) సంజయ్ గుప్తా తెలిపారు.

అభ్యర్థుల నుంచి వంద శాతం నిబద్ధత, జవాబుదారీతనం ఉందని నిర్ధారించుకునేందుకు తాము ట్రెయినింగ్ కోసం నామినల్ ఫీజు వసూలు చేస్తున్నామని చెప్పారు. గత రెండు సంవత్సరాలు ఇలా రిక్రూట్ చేసుకుంటే మంచి ఫలితాలు వచ్చాయని, అందుకే మూడో ఏడాది కూడా కొనసాగిస్తున్నట్లు చెప్పారు. గ్రాడ్యుయేషన్ చేసిన వారి కంటే 12వ తరగతి పాసైన వారు మెరుగ్గా రాణిస్తున్నారన్నారు.

ఇంతకుముందు రెండేళ్లలో 500 మంది ఫ్రెషర్ 12వ తరగతి విద్యార్థులను హెచ్‌సీఎల్ తీసుకుంది. స్కూల్ నుంచి ఎంపిక చేసిన వారికి బిట్స్ శస్త్ర యూనివర్సిటీ సహకారంతో హెచ్‌సీఎల్‌ డిజైనింగ్‌ అండ్ కంప్యూటింగ్‌లో బ్యాచిలర్స్‌ డిగ్రీని అందుకొనే అవకాశం కల్పిస్తోంది. నోయిడా క్యాంపస్ కోసం జులై 6-7 తేదీల్లో అభ్యర్థుల ఎంపికను నిర్వహిస్తారు. వీరికి ట్రైనింగ్‌తో పాటు హెచ్‌సీఎల్‌లో కచ్చితంగా ఉద్యోగం ఉంటుంది.

బ్యాంకుల కంటే మంచి ఆఫర్, ఇలా మీ డబ్బు రెండింతలు అవుతుందిబ్యాంకుల కంటే మంచి ఆఫర్, ఇలా మీ డబ్బు రెండింతలు అవుతుంది

English summary

ఫ్రెషర్స్‌కు 10,000 ఉద్యోగాలు: 12వ తరగతి పాసైన వారికి HCLలో ఉద్యోగాలు | HCL looking to hire over 10,000 freshers,

Running into the third year of mega recruitment drive for entry level talent, HCL Technologies is looking at hiring over 10000 freshers this fiscal (2019-20). This pool will be hired from across India including school pass-outs (who have completed class 12), graduates and post graduates from engineering and non-engineering streams.
Story first published: Wednesday, June 26, 2019, 18:03 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X