For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఏం చెల్లించారో చెప్పండి: గూగుల్‌కు ఇండియా షాక్! స్మార్ట్‌ఫోన్ మేకర్స్‌కు CCI లేఖలు

|

న్యూఢిల్లీ: ప్రముఖ సెర్చింజన్ కంపెనీకి గూగుల్‌కు షాక్! గూగుల్ ఆండ్రాయిడ్ భారత మార్కెట్లోకి ఇతరులను రాకుండా అడ్డుకుంటుందనే ఫిర్యాదులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గూగుల్ ఆపరేటింగ్ సిస్టమ్ పైన కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI) దర్యాఫ్తు ప్రారంభించింది. గూగుల్‌తో ఒప్పందాలకు సంబంధించిన వివరాలను ఇవ్వాలని హ్యాండ్‌సెట్ గ్రూప్ కంపెనీలను ఆదేశించింది. మొబైల్ తయారీదారులు, గూగుల్ మధ్య ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం (OS) మార్కెట్ వాటా ఆరోపణల నేపథ్యంలో ఒప్పంద వివరాలు కోరింది.

ట్రంప్‌కు మోడీ దెబ్బకు దెబ్బ, ట్రేడ్ హీట్: ఇండియా దిగుమతులివే.. ఏ దేశం నుంచి ఎంత అంటే?ట్రంప్‌కు మోడీ దెబ్బకు దెబ్బ, ట్రేడ్ హీట్: ఇండియా దిగుమతులివే.. ఏ దేశం నుంచి ఎంత అంటే?

గూగుల్‌కు యూరోపియన్ యూనియన్ భారీ జరిమానా

గూగుల్‌కు యూరోపియన్ యూనియన్ భారీ జరిమానా

మార్చి 2019 నాటికి భారత్ మార్కెట్లో ఆండ్రాయిడ్ వాటా 99 శాతం. ఆండ్రాయిడ్ మార్కెట్ ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేసిన కేసులో దోషిగా తేలడంతో యూరోపియన్ యూనియన్ గత ఏడాది గూగుల్‌కు 5 బిలియన్ డాలర్ల (4.3 బిలియన్ యూరోలు) జరిమానా విధించింది. గూగుల్ 2011 నుంచి దుర్వినియోగం చేస్తోందని యూరోపియన్ కమిషన్ గుర్తించింది. గూగుల్ ప్లే యాప్ స్టోర్, ఆండ్రాయిడ్ డివైస్‌లతో పాటు గూగుల్ సెర్చ్, క్రోమ్ బ్రౌజర్‌ను తప్పనిసరిగా ప్రీ-ఇన్‌స్టాల్ చేయాలని మ్యానుఫ్యాక్చరర్స్‌పై ఒత్తిడి చేసి దుర్వినియోగం చేసినట్లుగా గుర్తించింది.

గూగుల్‌కు ఏం చెల్లించారో చెప్పండి...

గూగుల్‌కు ఏం చెల్లించారో చెప్పండి...

శాంసంగ్, షియోమీ, కార్బన్, లావా సహా పలు స్మార్ట్ ఫోన్ హ్యాండ్‌సెట్ తయారీ కంపెనీలకు CCI డైరెక్టర్ జనరల్ లేఖ రాసినట్లుగా తెలుస్తోంది. గూగుల్‌తో ఆయా కంపెనీలకు ఉన్న ఒప్పందాలు, నిబంధనలు తెలియజేయాలని అందులో అడిగారని తెలుస్తోంది. గత ఎనిమిదేళ్లుగా (ఏప్రిల్ 2011) మొబైల్ యాప్స్, సేవలను ఉపయోగించడానికి గూగుల్ ఏదైనా ఆంక్షలు విధించిందో లేదో కూడా యాంటీ ట్రస్ట్ రెగ్యులేటర్ తెలుసుకోవాలనుకుంటోంది. అలాగే, ఆండ్రాయిడ్ OS, గూగుల్ మొబైల్ సర్వీస్‌లు ఉపయోగించుకున్నందుకు.. సెర్చింజన్‌కు చెల్లించిన లైసెన్స్ ఫీ, రాయాల్టీ పేమెంట్స్ వివరాలు ఏప్రిల్ 2011 నుంచి ఇయర్లీ బేసిస్‌గా ఇవ్వాలని CCI అడిగింది. ఈ మేరకు యాంటీ ట్రస్ట్ రెగ్యులేటర్ గత నెలలో సంబంధిత కంపెనీలకు లేఖ రాసింది.

గూగుల్‌పై ఇది రెండోసారి

గూగుల్‌పై ఇది రెండోసారి

ఆయా కంపెనీలకు స్పందించేందుకు రెండు వారాల సమయం ఇచ్చారు. అయితే, CCI నోటీసులపై సంబంధిత కంపెనీలు స్పందించాల్సి ఉంది. మరోవైపు, విచారణకు సహకరిస్తామని గూగుల్ తెలిపింది. గూగుల్ ఎగ్జిక్యూటివ్స్‌ను.. రెగ్యులేటర్ ముందు విచారణకు హాజరు కావాలని కోరే అవకాశముంది. గూగుల్ యాక్టివిటీస్ పైన CCI విచారణ చేయడం ఇది రెండోసారి. కాగా, 2012లో గూగుల్ దుర్వినియోగం చేసిందనే ఫిర్యాదుపై విచారణ జరిపి, గత ఏడాది ఫిబ్రవరిలో రూ.136 కోట్ల జరిమానా విధించింది. దీనిపై గూగుల్ స్పందించలేదు. ఇదిలా ఉండగా.. అమెరికా - భారత్ మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కాలిఫోర్నియా ప్రధానకేంద్రంగా గల గూగుల్‌ను నియంత్రించి అమెరికా చర్యలను కట్టడి చేయాలని భారత్ భావిస్తున్నట్లుగా కనిపిస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి.

English summary

ఏం చెల్లించారో చెప్పండి: గూగుల్‌కు ఇండియా షాక్! స్మార్ట్‌ఫోన్ మేకర్స్‌కు CCI లేఖలు | CCI asks handset companies for info on agreements with Google

The CCI has asked handset companies the details of their agreements with Google or its group companies as the anti-trust regulator expands the scope of its investigation into the accusations of abuse of market power by the Android OS.
Story first published: Friday, June 21, 2019, 14:48 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X