క్రిస్టీ సంస్థ వేలంలో గోల్గొండ వజ్రం ఆర్కాట్ II రూ.23.5 కోట్లు పలికింది. ఆర్కాట్ రాజుకు చెందిన ఈ వజ్రంతో పాటు హైదరాబాద్‌కు చెందిన నిజాం రాజుల ఆభరణాలను కూడా ఈ సంస్థ వేలం వేసింది. ఈ ఆభరణాలకు కళ్లు చెదిరే ధరలు పలికాయి. క్రిస్టీ సంస్థ న్యూయార్క్‌లో పలు ఆభరణాలు వేలం వేసింది. దీంతో రూ.70 కోట్ల వరకు రాబట్టింది.

రూ.23.5 కోట్లు పలికిన ఆర్కాట్ కింగ్ వజ్రం
ఇందులో ఆర్కాట్ II వజ్రమే రూ.23.5 కోట్లు (3,375,00 డాలర్లు) రాబట్టింది. ఇది ఒకప్పుడు ఆర్కాట్ నవాబు వద్ద ఉండింది. నిజాంకు చెందిన మరో వజ్రాల నెక్లెస్ రూ.17 కోట్లు, 33 వజ్రాలు ఉన్న మరో నెక్లెస్ రూ.10.5 కోట్లు పలికింది. ఆర్కాట్ II వజ్రాన్ని యజమానుల్లో గ్రేట్ బ్రిటన్ జార్జ్ III సతీమణి క్వీన్ చార్లోట్ కూడా ఉన్నారు. 17 కేరట్ల ఆర్కాట్ డైమండ్ తొలుత నవాబుల వద్ద ఉంది. ఆ తర్వాత ఇది బ్రిటిష్ రాయల్ ఫ్యామిలీ వద్దకు చేరింది.

బరోడా మహారాణి బ్రేస్‌లెట్ ధర రూ.11.4 కోట్లు
బరోడా మహారాణి సీతాదేవి ధరించిన ఆభరణాలు కూడా క్రిస్టీ సంస్థ వేసిన వేలంలో అధిక ధర పలికాయి. పచ్చపూసలు, వజ్రాలు, ప్లాటినమ్ పొదిగిన బరోడా మహారాణి బ్రేస్‌లెట్ రూ.11.4 కోట్లు పలికింది. 'మహారాజాస్ అండ్ ముఘల్స్ మాగ్నిఫికెన్స్' పేరుతో ఈ వేలాన్ని నిర్వహించింది క్రిస్టీ సంస్థ. ఖతార్ రాయల్ ఫ్యామిలీకి చెందిన ఆల్ థానీకి చెందిన 400 రాజవస్తువులను కూడా వేలం వేసింది.

రాముడు, సీత, హనుమంతుడు పెండెంట్ ధర రూ.5.12 కోట్లు
జెమ్ సెట్ మోడల్ ప్యారట్‌ను కూడా ఈ సంస్థ వేలం వేసింది. ఇది రూ.7.21 కోట్లు పలికింది. ఇండోర్ మహారాజా యశ్వంత్ రావు హోల్కర్ IIకు చెందిన ఆభరణంతో ఈ వేలం ప్రారంభమైంది. ఈ మహారాజు ఇంగ్లాండ్‌లో చదువుకున్నారు. అతను తన సతీమణితో కలిసి అబ్రాడ్‌లోనే ఎక్కువగా ఉన్నారు. ఇతనికి చెందిన రాయల్ నెక్లెస్ ధర రూ.1.44 కోట్లు ($206,250) పలికింది. దీని ధర రూ.42 లక్షలు పలుకుతుందని భావిస్తే దాదాపు మూడున్నర రెట్లు పలకడం గమనార్హం. జైపూర్ రాజమాతా గాయత్రి దేవి డైమండ్ రూ.4.45 కోట్లు పలికింది. అలాగే, శ్రీరామచంద్రుడు, సీతాదేవీ, హనుమంతుడు కలిగిన పెండెంట్ రూ.5.12 కోట్లు పలకడం గమనార్హం. ముంబైకి చెందిన జెవెల్లరీ హౌస్ భగత్ రూపొందించిన డైమండ్ నెక్లెస్, మరో వజ్రాభరణం వరుసగా రూ.11.8 కోట్లు, రూ.1.5 కోట్లు పలికింది.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..



Click it and Unblock the Notifications