ఫ్రెంచ్ ఆటో దిగ్గజం రెనాల్ట్... మొట్టమొదటి మల్టీపర్పస్ వెహికల్ (ఎంపివి)ని లాంఛ్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ వాహనాన్ని ఢిల్లీలో మొట్టమొదటగా ప్రదర్శించడాన్ని చూస్తే... ఇక్కడి మార్కెట్‌పై ఎంత గురిపెట్టిందో స్పష్టంగా అర్థమవుతోంది. ఇప్పటికే డస్టర్, క్విడ్ కార్ల సక్సెస్‌తో మంచి ఊపు మీద ఉన్న రెనాల్ట్.. ట్రైబర్‌పై కూడా అంతకంటే ఎక్కువ ఆశలే పెట్టుకుంది. ఇప్పుడు మార్కెట్లో ఉన్న ఈ సెగ్మెంట్ కార్లతో పోలిస్తే 20 శాతం తక్కువకే కాంపిటీటివ్ రేట్‌తో దూసుకువస్తున్నట్టు రెనాల్ట్ ప్రకటించింది.

ట్రైబర్ ఫీచర్స్
సబ్ 4 మీటర్ సెగ్మెంట్లో అనేక ఫీచర్స్‌ను లోడ్ చేసింది రెనాల్ట్
ఈ 7 సీటర్ కారులో అనేక ఇంటీరియర్ ఫీచర్స్‌ను యాడ్ చేశారు
ప్రధానంగా ఇండియన్ మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని డిజైన్ చేశారు
చెన్నైలోని ప్లాంట్‌లో కొత్త ట్రైబర్ ఉత్పత్తి కాబోతోంది

సీటింగ్.. మూడు వరుసల్లో సీటింగ్ ఏర్పాటు
ఆఖరి వరుసలో కూర్చున్న వాళ్లకు కూడా పవర్‌ఫుల్ ఏసీ, ఛార్జింగ్ సాకెట్స్
మూడో సీట్‌ను అవసరమనుకుంటే తీసేసి మళ్లీ సులువుగా బిగించుకోవచ్చు.
వెనుక సీట్లను తీసేస్తే 625 లీటర్ల బూట్ స్పేస్ (ప్రస్తుతం ఎర్టిగాలో 550 లీటర్లు, స్విఫ్ట్‌లో 268 లీటర్ల బూట్ స్పేస్ మాత్రమే)
మూడు వరుసల్లో కూర్చున్న అందరికీ సీట్ బెల్టులు
కూల్డ్ గ్లోవ్ బాక్స్, నీళ్లు లేదా ఇతర లిక్విడ్స్‌ను చల్లగా ఉంచుకునేందుకు

సేఫ్టీ
నాలుగు ఎయిర్ బ్యాగ్స్. ప్యాసింజర్, డ్రైవర్‌కు ఒక్కోటి, మధ్యలో మరో రెండు ఎయిర్ బ్యాగ్స్రెండో వరుసలో కూర్చున్న వాళ్లకు కూడా బాటిల్ హోల్డర్స్

ఎంటర్‌టైన్మెంట్
8 అంగుళాల టచ్ స్కీన్ ఇన్ఫోటైన్మెంట్
యాపిల్ ప్లే, యాండ్రాయిడ్ ఆటో ఫీచర్స్‌తో కనెక్టివిటీ
స్టార్ట్ - స్టాప్ బటన్

ఇంజన్
1 లీటర్ త్రీ సిలిండర్ పెట్రోల్ ఇంజన్
71 బిహెచ్‌పి, 96 ఎన్ఎం టార్క్
5 స్పీడ్ మ్యానువల్, ఆటో గేర్స్

డిజైన్
హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్ కంటే పెద్దది
182 MM గ్రౌండ్ క్లియరెన్స్
కెర్బ్ బరువు 947 కేజీలు
3.99 మీటర్ల పొడవు
1.73 మీటర్ల వెడల్పు
1.64 మీటర్ల ఎత్తు
ప్రొజెక్టర్ లెన్స్, పగటి పూట నడిచే ఎల్ఈడీ డేలైట్స్

రేటెంత
ఇంకా దీనిపై స్పష్టత లేదు. ఇది గ్లోబల్ లాంఛ్ కాబట్టి మన ఇండియన్ రోడ్లపై రావడానికి కూడా ఈ ఏడాది ఆఖరి వరకూ ఆగాల్సిందే. ధర సుమారు రూ. 6-7 లక్షల మధ్య ఉండే అవకాశం ఉందని మార్కట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications