For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

'తొలి' గుడ్‌న్యూస్: ఎయిర్‌టెల్ పేమెంట్ బ్యాంక్‌తో APYకి సబ్‌స్క్రైబ్ కావొచ్చు

|

మీరు ఎయిర్‌టెల్ పేమెంట్ బ్యాంక్ కలిగి ఉన్నారా? అయితే మీకో గుడ్ న్యూస్! అటల్ పెన్షన్ యోజనలో చేరడానికి లేదా ఇందులో డబ్బులు జమ చేయడం ఈ పేమెంట్ బ్యాంక్ అకౌంట్ కలిగిన వారికి సులభం కానుంది. అటల్ పెన్షన్ యోజన (APY)ప్రభుత్వ పథకం. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA)దీనిని నిర్వహిస్తోంది. తన పేమెంట్ బ్యాంక్ వినియోగదారుల కోసం ఎయిర్‌టెల్ APYని అందుబాటులోకి తెచ్చింది.

రూ.42 చెల్లిస్తే రూ.1,000: అర్హత, ఫైన్, చెల్లింపు... APY గురించి పూర్తి వివరాలు.. రూ.42 చెల్లిస్తే రూ.1,000: అర్హత, ఫైన్, చెల్లింపు... APY గురించి పూర్తి వివరాలు..

తొలి పేమెంట్ బ్యాంక్

తొలి పేమెంట్ బ్యాంక్

తమ సేవింగ్స్ అకౌంట్ కస్టమర్లు.. అటల్ పెన్షన్ యోజన పథకాన్ని తెరవవచ్చునని, అలాగే డబ్బులు జమ చేయవచ్చునని ఎయిర్‌టెల్ పేమెంట్ బ్యాంక్ గురువారం వెల్లడించింది. ఈ ప్రభుత్వ పథకాన్ని ఆఫర్ చేస్తున్న తొలి పేమెంట్ బ్యాంక్ ఎయిర్‌టెల్ కావడం గమనార్హం. ఇది సులభ, సురక్షిత, కాగితపురహిత ప్రాసెస్ అని ఎయిర్‌టెల్ పేమెంట్ బ్యాంక్ తెలిపింది.

లక్ష బ్యాంకింగ్ పాయింట్స్...

లక్ష బ్యాంకింగ్ పాయింట్స్...

భారత దేశవ్యాప్తంగా 50,000 బ్యాంకింగ్ పాయింట్స్ వద్ద కొద్ది నిమిషాల్లో పూర్తవుతుందని, భవిష్యత్తులో లక్ష బ్యాంకింగ్ పాయింట్స్‌కు విస్తరిస్తామని తెలిపింది. అసంఘటిత రంగంలో పని చేసే కార్మికులకు ప్రయోజనం కల్పించేందుకు, వృద్ధాప్యంలో సోషల్ సెక్యూరిటీ ఇచ్చేందుకు తీసుకువచ్చిన పథకం. 18-40 ఏళ్ల వయస్సు కార్మికులు ఈ పథకంలో చేరవచ్చు.

సంతోషకరం

సంతోషకరం

ఆర్థిక భారతాన్ని నిర్మించేందుకు తాము కట్టుబడి ఉన్నామని, అటల్ పెన్షన్ యోజనలో చేరేవారి కోసం PFRDAతో జత కట్టడం సంతోషకరమని ఎయిర్‌టెల్ పేమెంట్ బ్యాంక్ ఎండీ అండ్ సీఈవో అనుబ్రత బిశ్వాస్ అన్నారు. తమ ప్లాట్ ఫాం ద్వారా ఆర్థిక తోడ్పాటుకు అవసరమైన వాటిని ఆఫర్ చేయడం ముదావహం అన్నారు.

English summary

'తొలి' గుడ్‌న్యూస్: ఎయిర్‌టెల్ పేమెంట్ బ్యాంక్‌తో APYకి సబ్‌స్క్రైబ్ కావొచ్చు | Now subscribe to APY as an Airtel Payments Bank account holder

Airtel Payments Bank has launched Atal Pension Yojana for its savings account holders and has become the first payments bank in India to offer Government of India backed Atal Pension Yojana.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X