For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

'జీడీపీపై ఆయన ప్రయివేటు ఏజెన్సీ సమాచారాన్ని నమ్ముతున్నారు'

|

న్యూఢిల్లీ: మాజీ ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ జీడీపీపై చేసిన వ్యాఖ్యలను ప్రధానమంత్రి ఎకనామిక్ అడ్వయిజరీ కౌన్సెల్ (EAC) కొట్టిపారేసింది. 2012 ఆర్థిక సంవత్సరం నుంచి 2017 ఆర్థిక సంవత్సరం వరకు జీడీపీని ఎక్కువ చేసి చూపించారన్న ఆయన వ్యాఖ్యలు సరికావని, ఆ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు తెలిపింది.

ట్రంప్‌కు మోడీ దెబ్బకు దెబ్బ, ట్రేడ్ హీట్ట్రంప్‌కు మోడీ దెబ్బకు దెబ్బ, ట్రేడ్ హీట్

2011-12 నుంచి 2016-17 మధ్య కాలంలో జీడీపీ గణాంకాలను 2.5 శాతం ఎక్కువ చేసి చూపారని, జీడీపీ గణాంకాల లెక్కింపు పద్ధతిలో మార్పు వల్లే ఇలా జరిగిందని ఆయన ఇటీవల ఓ చెప్పారు. ఇవి చర్చనీయాశంగా మారాయి. దీనిపై ప్రధాని ఎకనామిక్ అడ్వయిజరీ కౌన్సెల్ స్పందించింది.

EAC PM rejects Arvind Subramanians claim on over estimation of GDP

సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకనామి (CMIE) అనే ప్రయివేటు ఏజెన్సీ అందించిన సమాచారాన్ని ఆయన నమ్ముతున్నారని, ప్రభుత్వ సంస్థ అయిన సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ (సీఎస్‌ఓ) సమాచారాన్ని నమ్మకపోవడం విడ్డూరంగా ఉందని పేర్కొంది. భారత్‌ జీడీపీ గణాంకాల లెక్కింపు అంతర్జాతీయ స్థాయిలో ఉందని పేర్కొంది.

కాగా, మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో, అలాగే మోడీ ప్రభుత్వంలో ఒక్కోసారి జీడీపీ (గ్రాస్ డొమెస్టిక్ ప్రాడక్ట్ )ను భారీగా పెంచి చూపినట్లు ఆరోపించారు. 4.5 శాతంగా ఉన్న జీడీపీని 7 శాతంగా చూపించారని తెలిపారు. ఈ మేరకు 'ఇండియాస్ జీడీపీ మిస్ ఎస్టిమేషన్: లైక్లీ హుడ్, మ్యాగ్నిట్యూడ్, మెకానిజం, ఇంప్లికేషన్స్' అనే పేరుతో వెలువరించిన పరిశోధనా పత్రం వచ్చింది. ఇందులో పలు ఆసక్తికర అంశాలు ఉన్నాయి.

మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ, మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ హయాంలో భారత జీడీపీ వృద్ధి అంచనాల్ని ఎక్కువగా చూపించారని ఈ మాజీ ప్రధాన ఆర్థికసలహాదారు(అరవింద్ సుబ్రహ్మణ్యం) పేర్కొన్నారు. 2011-12, 2016-17 మధ్యకాలంలో జీడీపీని ఎక్కువ చేసి చూపించారని తెలిపారు. జీడీపీ లెక్కింపు పద్ధతుల్లో ఉన్న తేడాల వల్లే అసలు కంటే 2.5 శాతం ఎక్కువగా అంచనా వేశారన్నారు. 2011, 2016 మధ్యకాలంలో భారత వృద్ధి సరాసరి 4.5 శాతంగా ఉందని, కానీ అధికారిక అంచనా మాత్రం 6.9 శాతంగా ఉందని చెప్పారు.

2011 తర్వాత జీడీపీ లెక్కింపు కోసం తీసుకు వచ్చిన కొత్త పద్ధతులే అధిక అంచనాలకు కారణమని, దీనికి సంబంధించి పలు ఆధారాలు ఉన్నాయని చెప్పారు. భారత్ వేగవంతమైన వృద్ధి కోసం వాస్తవిక విధానాలను అనుసరించాల్సిన అవసరం ఉందన్నారు. వెహికిల్ సేల్స్, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, క్రెడిట్ గ్రోత్, ఎక్స్‌పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్ వంటి 17 అంశాలను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు.

English summary

'జీడీపీపై ఆయన ప్రయివేటు ఏజెన్సీ సమాచారాన్ని నమ్ముతున్నారు' | EAC PM rejects Arvind Subramanian's claim on over estimation of GDP

The Economic Advisory Council (EAC) to the Prime Minister refuted former chief economic advisor (CEA) Arvind Subramanian’s assertion that India’s GDP was overestimated between FY12 and FY17.
Story first published: Thursday, June 20, 2019, 16:35 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X