For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బెంగళూరు సైకిల్ స్టార్టుప్ పై బజాజ్ ఆటో కన్ను, రూ.50 కోట్ల వరకు వెచ్చించే అవకాశం

By Jai
|

హైదరాబాద్: ప్రముఖ ద్విచక్ర వాహన దిగ్గజం బజాజ్ ఆటో ... బెంగళూరుకు చెందిన సైకిల్స్ అద్దెకు ఇచ్చే స్టార్టుప్ కంపెనీ పై కన్నేసింది. సైకిల్స్ తో పాటు నెమ్మదిగా వేళ్ళ స్కూటర్లను కూడా ఆ స్టార్టుప్ కంపెనీ అద్దెకు ఇస్తుంది. యులు అనే బ్రాండ్ నామ తో స్టార్టుప్ కంపెనీ బెంగళూరు తో పాటు నావి ముంబై, పూణే నగరాల్లో తన కార్యకలాపాలు సాగిస్తోంది.

అత్యంత వేంగంగా వృద్ధి చెందుతోన్న అర్బన్ మొబిలిటీ రంగంలో పెట్టుబడులతో విస్తరణ దిశగా బజాజ్ ఆటో అడుగులు వేస్తోంది. యులు అనే స్టార్టుప్ లో పెట్టుబడి పెడితే ... ఒకప్పుడు హమారా బజాజ్ అని పడుకొన్నపాత తరం లాగే మనం కూడా హమారా సైకిల్ అంటూ నగరాల్లో చక్కర్లు కొడతామేమో?

Bajaj Auto in talks to back cycle rental co Yulu

యులు అనే స్టార్టుప్ కంపెనీలో పెట్టుబడులు పెట్టేందుకు ఇప్పటికే పలు సంస్థలు సిద్ధమైనట్లు తెలుస్తోంది. మొత్తంగా ఈ కంపెనీ రూ 100 కోట్ల నుంచి రూ 150 కోట్లు సమీకరించాలని భావిస్తోందట. ఇందులో భాగంగానే బజాజ్ ఆటో రూ 50 కోట్ల వరకు పెట్టుబడి సమకూర్చేందుకు సమాయత్తం అవుతోందని ది ఎకనామిక్ టైమ్స్ ఒక కథనం లో పేర్కొంది. ఈ మేరకు బజాజ్ ఆటో డ్యూ డెలిజెన్సు కూడా ప్రారంభించింది. అన్నే అనుకున్నట్లు జరిగితే మరి కొన్ని రోజుల్లోనే డీల్ పూర్తి అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మూడు నగరాల్లో కార్యకలాపాలు ఉన్న యులు కంపెనీ వద్ద ఇప్పటికే 8,000 సైకిళ్ళు , 500 పైగా స్కూటర్లు ఉన్నాయట. వీటిని బుక్ చేసుకొనేందుకు ఈ కంపెనీ ఇటీవలే ఉబెర్ తో ఒప్పందం చేసుకోండి. దీంతో వినియోగదారులు బెంగళూరు, నావీ ముంబై, పూణే నగరాల్లో ఉబెర్ ఆపాలో యులు సైకిల్స్, స్కూటర్లను అద్దెకు తీసుకోవచ్చు.

బజాజ్ ఆటో ఇలాంటి స్టార్టుప్ కంపెనీలో పెట్టుబడులు పెట్టేందుకు మరో కారణం కూడా ఉన్నట్లు మార్కెట్ విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. దేశేయ ద్విచక్ర వాహన దిగ్గజం ఐన హీరో మోటోకార్ప్ సైతం ఇప్పటికే ఎలక్ట్రిక్ స్కూటర్లను తాయారు చేసే ఏతెర్ ఎనర్జీ అనే స్టార్టుప్ కంపెనీలో పెట్టుబడులు పెట్టి జోరు మీద ఉంది. హీరో మోటోకార్ప్ చైర్మన్ పవన్ ముంజల్ కూడా వ్యక్తిగతంగా ఓగో అనే స్కూటర్లను రెంటుకు ఇచ్ఛే స్టార్టుప్ కంపెనీలో పెట్టుబడి పెట్టేశారు. కొరియాకు చెందిన హ్యుండై మోటార్స్, కియా మోటార్స్ సంయుక్తంగా ఓలా ఎలక్ట్రిక్ వెంచర్లో ఏకంగా 300 మిలియన్ డాలర్లు పెట్టుబడులు పెట్టాయి. భవిష్యత్లో ఎలక్ట్రిక్ వాహనాలకు గిరాకీ పెరుగుతుందని, సైకిల్స్ వంటి ఆరోగ్యానికి పర్యావరణానికి మేలు చేసే వాహనాలపై వినియోగదారులు ఆసక్తి చూపుతారని ఆటోమొబైల్ రంగం విశ్వసిస్తోంది. అందులో భాగంగానే ఆయా రంగాల్లో నిమగ్నమైన స్టార్టుప్ కంపెనీలకు పెట్టుబడులు వెల్లువలా వచ్చి పడుతున్నాయి.

గత కొన్ని నెలలుగా భరత్ లో వాహనాల అమ్మకాలు నెమ్మదించటం కూడా కొత్త ట్రెండ్ను సూచిస్తోందని అందుకే కంపెనీలు నూతన ఆవిష్కరణల వైపు మొగ్గు చూపుతున్నారని ఆటోమొబైల్ రంగ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మైక్రో మొబిలిటీ గా ప్రాచుర్యం పొందుతున్న కొత్త తరహా ఆవిష్కరణలు ఈమేరకు వినియోగదారులను మెప్పిస్తాయో వేచి చూడాల్సిందే.

English summary

బెంగళూరు సైకిల్ స్టార్టుప్ పై బజాజ్ ఆటో కన్ను, రూ.50 కోట్ల వరకు వెచ్చించే అవకాశం | Bajaj Auto in talks to back cycle rental co Yulu

Bajaj Auto is in advanced discussions to pick up a stake in Bengaluru-based bicycle and low-speed electric scooter rental startup Yulu as part of its ongoing funding round of over $15-20 million.
Story first published: Thursday, June 20, 2019, 7:48 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X