For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జెట్ ఎయిర్‌వేస్ సరికొత్త 'కనిష్ట' రికార్డ్,కుప్పకూలిన షేర్లు

|

ఆర్థిక ఇబ్బందులతో రెండు నెలల క్రితం సేవలు నిలిపివేసిన జెట్ ఎయిర్వేస్ షేర్లు కుదేలవుతున్నాయి. మంగళవారం భారీగా పతనమయ్యాయి. బుధవారం ట్రేడింగ్ ప్రారంభం నుంచే 29 శాతం కుంగిపోయాయి. ఒక దశలో లైఫ్ టైమ్ కనిష్టం రూ.28.60 వద్దకు చేరుకుంది. ఈ రోజు (జూన్ 19) ఎన్సీఎల్టీలో విచారణ నుంది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు భారీగా కంపెనీ షేర్లను విక్రయిస్తున్నారు.

జెట్ ఎయిర్వేస్‌పై ఎస్బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌కు వెళ్లనున్న నేపథ్యంలో మంగళవారం కూడా స్టాక్‌ను కుప్పకూల్చాయి. కంపెనీని దివాలా గుర్తించి ముందుకు సాగేందుకు అనుమతినివ్వాంటూ ప్రధాన లెండర్ ఎస్బీఐ... ఎన్సీఎల్టీని ఆశ్రయించింది. దీంతో ఈ స్టాక్ బుధవారం ఏకంగా 50 శాతం వరకూ పతనమైంది. ఇంట్రాడేలో రూ.32 వరకు దిగొచ్చిన స్టాక్ కాస్త కోలుకుని రూ.40.50 దగ్గర క్లోజైంది. ఒక్కరోజులో 40 శాతం నష్టంతో క్లోజైంది.

Jet Airways, IRB Infra among top losers on BSE

బుధవారం కూడా పరిస్థితిలో మార్పు లేదు. మధ్యాహ్నం పన్నెండున్నర గంటల సమయంలో రూ.31.35 వద్ద ట్రేడ్ అయింది. బీఎస్‌ఈలో 28.18 శాతం నష్టంతో ఆల్ టైమ్ కనిష్టం రూ.29.05 వద్ద ట్రేడ్ అయింది. ఎన్ఎస్ఈలో 29.38 శాతం తగ్గి ఆల్ టైమ్ కనిష్టం రూ.28.60 వద్ద ట్రేడ్ అయింది. జెట్ ఎయిర్వేస్ షేర్లు వరుసగా 13 రోజులు పతనమయ్యాయి. గత వారంలోనే జెట్ ఎయిర్వేస్ షేర్లు 74 శాతం కుప్పకూలాయి. మొత్తంగా 81 శాతం నష్టపోయాయి. దీంతో జూన్ 28వ తేదీ నుంచి కంపెనీ షేర్లను ట్రేడ్ టు ట్రేడ్ విభాగంలోకి చేర్చారు.

జెట్ ఎయిర్వేస్ షేర్ ఈ ఏడాది ప్రారంభంలో రూ.250 దగ్గర ట్రేడ్ అవుతూ వచ్చింది. అప్పటో సంస్థ మార్కెట్ క్యాప్ సుమారు రూ.10 వేల కోట్ల వరకూ ఉండేది. అలాంటిది ఇప్పుడు సదరు షేర్ ధర రూ.30కి అటు ఇటుగా ఉంది. ఏడాదిలో 85 శాతం వరకూ స్టాక్ ధర కుప్పకూలిపోయింది. బ్యాంకుల విషయానికి వస్తే.. జెట్ ఎయిర్ సంస్థ బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు కలిపి సుమారు రూ.11260 కోట్లు బకాయి పడింది. వాటిల్లో సుమారు రూ.7251 కోట్ల వరకూ మన దేశీయ బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు చెల్లించాల్సి ఉంది. ఒక్క ఎస్బీఐకే సుమారు రూ.1958 కోట్ల వరకూ చెల్లించాల్సిన ఉంది జెట్ ఎయిర్. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు రూ.1746 కోట్లు, ఐసిఐసిఐ బ్యాంక్‌కు రూ.545 కోట్లు, యెస్ బ్యాంక్‌కు రూ.869 కోట్లు, ఐడిబిఐకి రూ.752 కోట్లు, కెనెరా బ్యాంక్‌కు రూ.718 కోట్లు, బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రూ.266 కోట్లు చెల్లించాల్సి ఉంది జెట్ ఎయిర్.

జెట్ ఎయిర్‌వేస్ దివాలా ! కుప్పకూలిన స్టాక్జెట్ ఎయిర్‌వేస్ దివాలా ! కుప్పకూలిన స్టాక్

English summary

జెట్ ఎయిర్‌వేస్ సరికొత్త 'కనిష్ట' రికార్డ్,కుప్పకూలిన షేర్లు | Jet Airways, IRB Infra among top losers on BSE

Shares of Jet Airways further plummeted over 29 per cent Wednesday after the consortium of bankers took the grounded airline to the National Company Law Tribunal.
Story first published: Wednesday, June 19, 2019, 12:43 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X