For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దెబ్బ మీద దెబ్బ: మా డబ్బులివ్వండి... అనిల్ అంబానీపై చైనా ఒత్తిడి!

|

న్యూఢిల్లీ: చైనాకు చెందిన పలు బ్యాంకులు అనిల్ అంబానీ కంపెనీకు అప్పులు ఇచ్చాయి. ప్రస్తుతం అనిల్ అప్పుల ఊబిలో కూరుకుపోయారు. తన గ్రూప్‌లోని కంపెనీల షేర్లు విక్రయిస్తూ వాటిని చెల్లిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయనకు అప్పులు ఇచ్చిన చైనీస్ బ్యాంకులు కూడా వసూళ్లకు సిద్ధమయ్యాయి. చైనా డెవలప్‌మెంట్ బ్యాంక్, ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా, ఎగ్జిమ్ బ్యాంక్ ఆఫ్ చైనాలు పెద్ద మొత్తంలో రుణాలు ఇచ్చాయి. ఈ బ్యాంకులకు అనిల్ అంబానీ రూ.2.1 బిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉంది.

బిలియనీర్ క్లబ్ నుంచి అనిల్ అంబానీ ఔట్బిలియనీర్ క్లబ్ నుంచి అనిల్ అంబానీ ఔట్

చైనా బ్యాంకులకు అనిల్ అంబానీ అప్పులు

చైనా బ్యాంకులకు అనిల్ అంబానీ అప్పులు

చైనా ప్రభుత్వరంగ బ్యాంకు అయినా చైనా డెవలప్‌మెంట్ బ్యాంక్.. అనిల్ అంబానీ కంపెనీలకు రూ.9,860 కోట్ల (1.4 బిలియన్ డాలర్లు) రుణాలు ఇచ్చింది. ఎగ్జిమ్ బ్యాంక్ ఆప్ చైనా రూ.3,360 కోట్లు, కమర్షియల్ బ్యాంక్ ఆప్ చైనా రూ.1,554 కోట్లు ఇచ్చింది. ఈ మొత్తాన్ని చెల్లించాలని చైనా బ్యాంకులు అనిల్ అంబానీ కంపెనీలపై ఒత్తిడి తెస్తున్నాయి. ఆర్.కామ్. చెల్లించాల్సిన మొత్తం అప్పులు రూ.57,382 కోట్లుగా ఉంది.

నిలిచిన ఆర్.కామ్. డీల్

నిలిచిన ఆర్.కామ్. డీల్

ఆసియా అత్యధిక ధనవంతుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్.. అనిల్ అంబానీకి చెందిన ఆర్.కామ్. ఆస్తులను రూ.17,300 కోట్లకు కొనుగోలు చేసేందుకు డీల్ కుదుర్చుకుంది. కానీ రెగ్యులేటరీ సమస్యల కారణంగా ఈ డీల్ ముందుకు కదల్లేదు.

అనిల్ అంబానీ ఏ బ్యాంకుకు ఎంత రుణాలు చెల్లించాలంటే?

అనిల్ అంబానీ ఏ బ్యాంకుకు ఎంత రుణాలు చెల్లించాలంటే?

అనిల్ అంబానీ భారతీయ, విదేశీ బ్యాంకులకు పెద్ద మొత్తంలో రుణాలు చెల్లించాలి. చైనా డెవలప్‌మెంట్ బ్యాంకుకు రూ.9,860 కోట్లు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రూ.4,910 కోట్లు, లైఫ్ ఇన్సురెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాకు రూ.4,760 కోట్లు, ఎగ్జిమ్ బ్యాంక్ ఆప్ చైనాకు రూ.3,360 కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడాకు రూ.2,700 కోట్లు, మాడిషన్ పసిఫిక్ ట్రస్ట్‌కు రూ.2,350 కోట్లు, యాక్సిస్ బ్యాంకుకు రూ.2,090 కోట్లు, రష్యాకు చెందిన బీటీబీ కేపిటల్ ఆఫ్ రష్యాకు రూ.511 కోట్లు చెల్లించాలి. ఇవే కాకుండా స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ (లండన్), డాయిష్ బ్యాంక్ (హాంగ్‌కాంగ్, డీబీఎస్ బ్యాంక్, ఎమిరేట్స్ ఎన్‌బీడీ బ్యాంక్‌లతో పాటు ఇతరులకు కూడా ఇవ్వాలి. రిలయన్స్ కమ్యూనికేషన్స్ సోమవారం తమ రుణాలకు సంబంధించిన వివరాలను విడుదల చేసింది. రూ.57,382 కోట్లుగా పేర్కొంది.

English summary

దెబ్బ మీద దెబ్బ: మా డబ్బులివ్వండి... అనిల్ అంబానీపై చైనా ఒత్తిడి! | Chinese Banks Demand $2.1 Billion From Embattled Anil Ambani's Firm

Chinese lenders, including China Development Bank, Industrial and Commercial Bank of China and Exim Bank of China, have demanded at least $2.1 billion from embattled tycoon Anil Ambani's Reliance Communications Ltd., that slid into bankruptcy earlier this year.
Story first published: Tuesday, June 18, 2019, 12:20 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X