జెట్ ఎయిర్ వేస్ ఆర్ధిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంది. ఒకప్పుడు దేశీయ విమాన రంగానికి దిక్సూచిలా ఉన్న జెట్ ఎయిర్‌వేస్ ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకొని పోయింది. ఆర్ధిక సంక్షోభం నుండి బయటపడటానికి 'జెట్' వాటాలవిక్రయానికి నిర్ణయం తీసుకుంది. అయితే విక్రయంలో జాప్యం జరుగుతుంది. అంతే కాదు దివాలా కేసు 20వ తేదీకి వాయిదా పడింది.

స్టాక్ ఎక్స్ఛేంజీల ఆంక్షలతో కుప్పకూలిన జెట్ ఎయిర్..10 రోజుల్లో 45.60 శాతం నష్టం
స్టాక్ ఎక్స్ఛేంజీల ఆంక్షలతో జెట్ ఎయిర్ వేస్ షేర్ కుప్పకూలింది . 10 రోజుల్లో 45.60 శాతం నష్టంతో ట్రేడ్ అవుతుంది. మూతపడిన జెట్ ఎయిర్‌వేస్ పరిస్థితి రోజురోజుకు మరింత సంక్లిష్ఠంగా మారుతోంది. జెట్‌లో వాటాలను విక్రయించేందుకు ఎస్‌బీఐ సారథ్యంలోని బ్యాంకుల కన్సార్షియం ప్రయత్నిస్తున్న తరుణంలో ఇద్దరు ఆపరేషనల్ క్రెడిటార్లు జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ ను ఆశ్రయించారు. ఇక ఈ కేసును విచారించిన ఎన్‌సీఎల్‌టీ బెంచ్ ఈ కేసును ఈ నెల 20 వ తేదీకి వాయిదా వేసింది.

వాటాల విక్రయంలో మరింత జాప్యం .. బ్యాంకు రుణాల చెల్లింపు విషయంలో ఓ నిర్ణయానికి రాకపోవటమే కారణం
దీంతో వాటాల విక్రయం మరింత జాప్యం అవుతుంది. మరోవైపు జెట్‌ను కొనుగోలు చేసేందుకు హిందూజా గ్రూప్ సహా లండన్‌కు చెందిన ఆదిగ్రో గ్రూప్ కూడా ఆసక్తి చూపిస్తోంది. అయితే ఈ సంస్థలు ఆఫర్ చేసిన మొత్తం బ్యాంకుల కన్సార్షియానికి నచ్చకపోవటంతో పరిస్థితి నానాటికి దారుణంగా మారుతోంది. పరిస్థితి మరింతగా దిగజారే అవకాశాలుండటంతో జూన్ 28 నుంచి జెట్ ఎయిర్‌వేస్ షేరుపై ఆంక్షలు విధించనున్నట్లు ప్రకటించాయి. రోలింగ్ సెగ్మెంట్ నుంచి ట్రేడ్ ఫర్ ట్రేడ్ సెగ్మెంట్‌కు జెట్ షేర్లను మారుస్తున్నట్లు ఈ నెల 12న ఎన్‌ఎస్ఈ ప్రకటించింది.ఈ నెల 28 నుంచి షేరు ట్రేడింగ్‌పై ఆంక్షలు విధించనున్నట్లు స్టాక్ ఎక్స్ఛేంజీలు ప్రకటించిన నేపథ్యంలో రెండు రోజుల్లో జెట్ షేరు 30 శాతానికి పైగా నష్టపోయింది.

బ్యాంకులు రుణ మొత్తాలను భారీగా వదులుకొనేందుకు సిద్ధంగా లేవు అందుకే విక్రయం జాప్యం
జెట్ ఎయిర్‌వేస్ ను గాడిలో పెట్టేందుకు ఎతిహాద్ ఎయిర్‌వేస్, హిందూజా గ్రూప్.. రుణదాతల కన్సార్షియంతో చర్చలు సాగిస్తూనే ఉన్నాయని తెలుస్తుంది . అయితే రుణాల చెల్లింపు విషయంలో ఇవి ఇంకా ఒక నిర్ణయానికి రాకపోవటంతో ఈ విక్రయం మరికొంత సమయం పట్టే అవకాశం లేకపోలేదని పేర్కొన్నాయి. మరోవైపు జెట్‌ను కొనుగోలు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు బ్రిటన్‌కు చెందిన ఆదిగ్రో ఏవియేషన్ కూడా ఇప్పటికే ప్రకటించింది. గతంలో జెట్‌లో 24.9 శాతం వాటాల కొనుగోలుకు ఆదిగ్రో ఏవియేషన్ రూ.2,5,00 కోట్లు ఆఫర్ చేసింది. బ్యాంకులు తమ రుణాల్లో 70-75 శాతం వదులుకుంటే తాము డీల్‌కు సిద్ధంగా ఉన్నట్లు ఆదిగ్రో తెలిపింది. అయితే రుణ మొత్తాలను భారీగా వదులుకునేందుకు బ్యాంకులు ఏమాత్రం సుముఖంగా లేవు. అందుకే ‘జెట్' వాటాల విక్రయం మరింత జాప్యం అయ్యే అవకాశం వుంది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications