For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

22నెలల కనిష్టస్థాయికి పడిపోయిన ద్రవ్యోల్బణం..కారణం ఇదేనా..?

|

హోల్‌సేల్ ధరలతో కూడిన ద్రవ్యోల్బణం గత 22 నెలల్లో ఎప్పుడూ లేనంతగా 2.45 శాతానికి పడిపోయింది. ఇందుకు కారణం ఆహార పదార్థల ధరలు, ఇంధనం ధరలు, విద్యుత్ పరికరాల ధరలు తగ్గడమే అని అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. ఏప్రిల్‌లో హోల్‌సేల్ ప్రైస్ ఇండెక్స్‌ ఆధారంగా వచ్చిన ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో 3.07శాతంగా ఉన్నిందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. గతేడాది మే 2018లో ఈ ద్రవ్యోల్బణం 4.78శాతంగా ఉండేది.

ఆహార పదార్థాలపై ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో 7.37శాతం ఉండగా అది ప్రస్తుతం 6.99శాతానికి పడిపోయింది. ఇక ఉల్లిధరలు 15.89శాతం పెరుగగా అది ఏప్రిల్ నెలలో 3.43 శాతంగా ఉండేది. కూరగాయల ద్రవ్యోల్బణం మే నెలలో 33.15 శాతానికి తగ్గింది. అంతకు ముందు నెలలో ఇది 40.65 శాతంగా ఉంది. బంగాళాదుంపలో ద్రవ్యోల్బణం (-) 23.36 శాతం ఇప్పుడు ఉండగా అదే ఏప్రిల్ నెలలో (-) 17.15 శాతంగా ఉండేది.

inflation down to a 22-month low,falling prices of food articles the reason?

ఇక ఇంధనం విద్యుత్ కేటగిరీల్లో ద్రవ్యోల్బణం 0.98శాతానికి పడిపోగా.. మే నెలలో అది 3.84శాతంగా ఉండేది. ఇక ఉత్పత్తి అయిన వస్తువులపై కూడా ధరలు తగ్గాయని దీంతో ద్రవ్యోల్బణం మే నెలలో 1.28 శాతానికి పడిపోగా అదే ఏప్రిల్‌లో 1.72శాతంగా ఉన్నిందని లెక్కలు చెబుతున్నాయి. హోల్‌సేల్ ప్రైస్ ఇండెక్స్ ద్రవ్యోల్బణం సమాచారం ప్రకారం 3.18శాతం నుంచి 3.10శాతంకు రివైజ్ చేయడం జరిగింది. ఇక ఈ వారంలో విడుదల చేసిన డేటాను పరిశీలిస్తే రిటైల్ ద్రవ్యోల్బణం గత ఏడునెలల్లో అత్యధికంగా 3.05శాతానికి చేరుకున్నట్లు తెలుస్తోంది. ఇది ఒక్క కూరగాయలు, మరియు ప్రొటీన్ ఉన్నఆహార వస్తువులను లెక్కలోకి తీసుకుంటే తేలిన సంఖ్య.

ఇదిలా ఉంటే జూన్ 6వ తేదీన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గత 9ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా రివర్స్ రెపో రేటును 5.75 శాతానికి తగ్గించింది. 2019-20 తొలి ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం 3 నుంచి 3.1శాతం ఉంటుందని అంచనా వేసికూడా రెపోరేట్‌ను తగ్గించడం ఒక్కింత ఆశ్చర్యానికి గురిచేసింది. అకాల వర్షాలు, కూరగాయల ధరల్లో పెరుగుదల, ముడిచమురు ధరలు, మార్కెట్ ఒడిదుడుకులు ఇవన్నీ ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపుతున్నాయి. మరోవైపు రానున్న రోజుల్లో ఆహార ద్రవ్యోల్బణం కూడా ప్రభావం చూపుతుందని ఆర్బీఐ వెల్లడించింది.

English summary

22నెలల కనిష్టస్థాయికి పడిపోయిన ద్రవ్యోల్బణం..కారణం ఇదేనా..? | inflation down to a 22-month low,falling prices of food articles the reason?

Wholesale price-based inflation slipped to 22-month low at 2.45 per cent in May helped by falling prices of food articles, fuel and power items, according to an official data released Friday.
Story first published: Friday, June 14, 2019, 15:56 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X