For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బాహుబలి మోటారు, రివర్స్ పంపింగ్.. రూ.80వేల కోట్ల భారీ ప్రాజెక్టు

|

హైదరాబాద్: ఈ నెల 21వ తేదీన తెలంగాణ ప్రభుత్వం భారీ ప్రాజెక్టును ప్రారంభించనుంది. కన్నెపల్లి పంప్‌హౌస్‌లోని మోటార్ల వెట్న్ ప్రారంభిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో చేపడుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు మెగా ఇరిగేషన్ (తాగునీరు కూడా)ను లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్రమోడీని ఆహ్వానించనున్నారని తెలుస్తోంది. ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌లు ముఖ్య అతిథులుగా హాజరవనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా కోటి ఎకరాలకు సాగునీరు అందివ్వాలన్నది ప్రభుత్వం లక్ష్యం.

ఏపీఎస్ఆర్టీసీకి ఎక్కడెంత అప్పు, జగన్ ప్రభుత్వంపై భారమెంత?ఏపీఎస్ఆర్టీసీకి ఎక్కడెంత అప్పు, జగన్ ప్రభుత్వంపై భారమెంత?

అంచనా వ్యయం రూ.80వేల కోట్లు

అంచనా వ్యయం రూ.80వేల కోట్లు

కాళేశ్వరం ప్రాజెక్టును ప్రభుత్వం తక్కువ కాలంలోనే పూర్తి చేస్తోంది. ఎక్కువ మొత్తం ఖర్చు చేసి పూర్తి చేసిన ప్రాజెక్టుగానే కాకుండా రాష్ట్రంలో అత్యధిక ఆయకట్టుకు సాగునీరు, అత్యధిక జనాభాకు తాగునీరు అందించే కాళేశ్వరం ఎత్తిపోతల పథకం. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.80వేల కోట్లు. ఈ ప్రాజెక్టును తొలుత అదిలాబాద్ జిల్లా తుమ్మిడిహట్టి గ్రామంలో రూ.40,300 కోట్లతో నిర్మించాలని భావించారు. దీంతో 16.14 లక్షల ఎకరాలకు నీరు ఇవ్వాలనేది లక్ష్యం. ఇప్పుడు రీడిజైనింగ్‌లో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మేడిగడ్డ గ్రామంలో నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం మూడేళ్లలో రూ.50,000కోట్లు ఖర్చు చేసింది.

కాళేశ్వరం ప్రాజెక్టు ప్రత్యేకతలు

కాళేశ్వరం ప్రాజెక్టు ప్రత్యేకతలు

కాళేశ్వరం పథకం కింద 13 జిల్లాల్లోని 18.25 లక్షల ఎకరాల ఆయకట్టు సాగు లక్ష్యం కాగా, శ్రీరాంసాగర్, నిజాం సాగర్, సింగూరు, వరద కాలువ తదితర పథకాల కింద 18.08 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ కూడా లక్ష్యం. 20 లిఫ్టులు. 19 పంప్‌హౌస్‌ల నిర్మాణం. దీని కింద 19 జలాశయాలు ఉంటాయి. నీటి నిల్వ 141 టీఎంసీలు. రోజుకు ఇక్కడి నుంచి మళ్లించే నీరు 2 టీఎంసీలు. మేడిగడ్డ నుంచి మళ్లించే నీళ్లు 180 టీఎంసీలు. ఈ మూడేళ్లలో ఇందుకోసం రూ.50వేల కోట్లు ఖర్చు చేసింది. మొత్తం అంచనా వ్యయం రూ.80,500 కోట్లు. దీనికి అవసరమయ్యే విద్యుత్ 4,992 మెగావాట్లు. విద్యుత్ సరఫరా ఖర్చు రూ.2,890 కోట్లు.

పెద్ద ఎత్తున విద్యుత్ అవసరం

పెద్ద ఎత్తున విద్యుత్ అవసరం

ప్రస్తుతం 4,992.47 మెగావాట్ల విద్యుత్తు అవసరం. మూడో టీఎంసీ పని పూర్తయిన తర్వాత మొత్తం 7,000 మెగావాట్లకు పైగా అవసరం. కాళేశ్వరం ప్రాజెక్టుకు ట్రాన్స్‌కో గడువులోగా విద్యుత్ సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల వద్ద బ్యారేజీల నిర్మాణం చేపట్టగా, ఈ బ్యారేజీల నుంచి నీటిని ఎత్తిపోసేందుకు 3 లిఫ్టులను నిర్మంచారు. వంద మీటర్ల పూర్తిస్థాయి మట్టంతో 16.17 టీఎంసీల నీటిని నిల్వ చేసేలా చేపట్టిన మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ పనులు దాదాపు పూర్తి కావొచ్చాయి. 85 రేడియల్ గేట్లను అమర్చారు. ఇందులో 25 గేట్లు మహారాష్ట్ర వైపు, మిగిలిన గేట్లు తెలంగాణ వైపు ఉంటాయి. బ్యారేజీలోని నీటిని వెనుక భాగం నుంచి ఎత్తిపోసేందుకు కన్నెపల్లి వద్ద 11 మోటార్లు, పంపులు అమర్చడం దాదాపు పూర్తయింది. రెండు, మూడు పంపులు, మోటార్లకు సంబంధించి కొన్ని పనులు ఉన్నాయి.

బాహుబలి మోటార్లు

బాహుబలి మోటార్లు

గోదావరికి ఇన్ ఫ్లోలు ప్రారంభమయ్యాక జూలైలో అన్ని మోటర్లు పని చేస్తాయి. ప్రస్తుతం కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద గోదావరిలోకి 500 క్యూసెక్కుల లోపు మాత్రమే వరద వస్తోంది. ఈ క్రమంలో రోజుకు రెండు మోటర్లను అరగంట చొప్పున నడిపేందుకు సాంకేతికంగా వీలుందట. ఈ నెల 21న రెండు మోటర్లకు వెట్న్ నిర్వహిస్తారని, ఒక్క మోటర్‌ను అరగంట పరీక్షించే క్రమంలో 0.004 టీఎంసీలు అంటే 10.80 కోట్ల లీటర్ల గోదావరి జలాలను ఎత్తిపోయవచ్చని చెబుతున్నారు. జూలైలో రోజుకు రెండు టీఎంసీల చొప్పున గోదావరి జలాలను ఎత్తిపోసేందుకు ఏర్పాటు చేస్తున్నారు. కొన్ని పంప్‌హౌస్‌లలో 139 మెగావాట్ల సామర్థ్యం కలిగిన బాహుబలి మోటరు ద్వారా జలాలను తరలిస్తారు.

విద్యుత్ శాఖ

విద్యుత్ శాఖ

ఈ ప్రాజెక్టు కోసం విద్యుత్ శాఖ నుంచి ప్రస్తుతం 4,992.47 మెగావాట్ల విద్యుత్ అవసరం. 400 కేవీ సబ్ స్టేషన్లు 6, 220 కేవీ సబ్ స్టేషన్లు 9, 132 కేవీ సబ్ స్టేషన్లు 2.. మొత్తం 17 ఏర్పాటు చేశారు. మొత్తంగా ఇది 7వేలకు పైగా మెగావాట్ల విద్యుత్ వ్యవస్థ. ఇక్కడ కిలో మీటర్ల కొద్ది పొడవైన సొరంగాలు, ఆసియ్లోనే అతిపెద్ద మోటార్లు కనిపిస్తాయి. మూడు బరాజ్‌లు, మూడు పంప్‌హౌస్‌లు ఉంటాయి. నది గర్భంలో రివర్స్ పంపింగ్ విధానం.. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు ప్రత్యేకతలు ఎన్నో.

English summary

బాహుబలి మోటారు, రివర్స్ పంపింగ్.. రూ.80వేల కోట్ల భారీ ప్రాజెక్టు | Telangana govt to inaugurate Rs.80,000 crore Kaleshwaram project on 21 June

The Telangana government is all set to inaugurate its prestigious Rs.80,000 crore Kaleshwaram mega irrigation (and drinking water) project on 21 June.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X